iDreamPost
android-app
ios-app

Gautam Gambhir: కోహ్లీ-రోహిత్ విషయంలో గంభీర్ యూటర్న్! మాజీ క్రికెటర్ ఘాటు విమర్శలు..

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ విషయంలో టీమిండియా న్యూ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ యూ టర్న్ తీసుకున్నాడని విమర్శించాడు మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్. ఆ వివరాల్లోకి వెళితే..

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ విషయంలో టీమిండియా న్యూ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ యూ టర్న్ తీసుకున్నాడని విమర్శించాడు మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్. ఆ వివరాల్లోకి వెళితే..

Gautam Gambhir: కోహ్లీ-రోహిత్ విషయంలో గంభీర్ యూటర్న్! మాజీ క్రికెటర్ ఘాటు విమర్శలు..

గౌతమ్ గంభీర్.. టీమిండియా కొత్త హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇక ఎప్పుడైతే హెడ్ కోచ్ గా పగ్గాలు అందుకుంటాడని తెలిందో.. అప్పటి నుంచి బీసీసీఐకి కండిషన్లు పెట్టడం మెుదలుపెట్టాడు గంభీర్. మంచిగా ఆడకపోతే.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు జట్టులో స్థానం ఉండదని చెప్పకనే చెప్పాడు. అయితే ఇప్పుడు ఈ విషయంపై అతడు యూటర్న్ తీసుకున్నాడని టీమిండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ఘాటు విమర్శలు చేశాడు. ప్రస్తుతం క్రిష్ కామెంట్స్ క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

టీ20 వరల్డ్ కప్ 2024 గెలిచిన తర్వాత టీమిండియా స్టార్ క్రికెటర్లు విరాట్  కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా టీ20 ఫార్మాట్ కు వీడ్కోలు పలికారు. అయితే ఈ పొట్టి ప్రపంచ కప్ ముందు గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ.. నేను హెడ్ కోచ్ అయితే.. మంచిగా ఆడకపోతే.. కోహ్లీ, రోహిత్ లకు జట్టులో స్థానం ఉండదని చెప్పాడు. దాంతో హెడ్ కోచ్ పదవి చేపట్టక ముందే గంభీర్ తన మార్క్ ప్లాన్స్ అప్లై చేస్తున్నాడని అందరూ చెప్పుకొచ్చాడు. అయితే తాజాగా తన మాటలపై గంభీర్ యూ టర్న్ తీసుకున్నాడని టీమిండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు.

“టీమిండియా కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అప్పుడే యూ టర్న్ తీసుకున్నాడు. ఇటీవలే ముగిసిన పొట్టి ప్రపంచ కప్ కు ముందు.. మంచి ప్రదర్శన ఇవ్వకపోతే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు జట్టులో స్థానం ఉండదని చెప్పావు. కానీ ఇప్పుడు ఏమంటున్నావ్. వారిద్దరు అద్భుతమైన ప్లేయర్లు, 2027 వరల్డ్ కప్ కూడా ఆడతారని అంటున్నావు. నీ స్టాండ్ ఏంటి? ఒక్క మాటపై నువ్వు నిలబడవా? ఇకనైనా ఒక స్టాండ్ పై ఉండు” అంటూ ఘాటుగా విమర్శించాడు కృష్ణమాచారి శ్రీకాంత్. అయితే విరాట్ కోహ్లీ ఫిట్ నెస్ పై ఎలాంటి సందేహం లేదు. అతడు వరల్డ్ కప్ ఆడతాడు. కానీ రోహిత్ శర్మ మాత్రం వరల్డ్ కప్ ఆడటం అనుమానమే. ఎందుకంటే? అతడికిప్పుడు 37 ప్రపంచ కప్ సమయానికి 40లో పడతాడు. ఈ వయసులో ప్రపంచ కప్ లో పాల్గొనడం కష్టం అని క్రిష్ చెప్పుకొచ్చాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి