iDreamPost
android-app
ios-app

వీడియో: స్పీడ్‌ బౌలింగ్‌లో హెల్మెట్‌ లేకుండా బ్యాటింగ్‌! ఆ డేర్‌ చేస్తే వణుకు పుట్టిద్ది!

  • Published Dec 09, 2023 | 5:50 PM Updated Updated Dec 10, 2023 | 10:10 AM

Krishnamachari Srikkanth: పేస్‌ బౌలింగ్‌కు పెట్టింది పేరైన వెస్టిండీస్‌ బౌలర్లను ఎదుర్కొంటూ.. ఓ బ్యాటర్‌ హెల్మెట్‌ కూడా పెట్టుకోలేదు. అది పిచ్చి అని చాలా మందికి అనిపించినా.. అది ఓ ధిక్కారం. అది క్రికెట్‌ యానిమల్‌ కథ.

Krishnamachari Srikkanth: పేస్‌ బౌలింగ్‌కు పెట్టింది పేరైన వెస్టిండీస్‌ బౌలర్లను ఎదుర్కొంటూ.. ఓ బ్యాటర్‌ హెల్మెట్‌ కూడా పెట్టుకోలేదు. అది పిచ్చి అని చాలా మందికి అనిపించినా.. అది ఓ ధిక్కారం. అది క్రికెట్‌ యానిమల్‌ కథ.

  • Published Dec 09, 2023 | 5:50 PMUpdated Dec 10, 2023 | 10:10 AM
వీడియో: స్పీడ్‌ బౌలింగ్‌లో హెల్మెట్‌ లేకుండా బ్యాటింగ్‌! ఆ డేర్‌ చేస్తే వణుకు పుట్టిద్ది!

ఇప్పుడున్న బౌలర్ల కంటే మరింత డేంజర్స్‌ స్పీడ్‌ బౌలర్లు ఉన్న కాలంలో ఓ భారత ఆటగాడు తలకు హెల్మెట్‌ లేకుండా.. ఎంతో మొండిగా బ్యాటింగ్‌ చేశాడు. అది కూడా అప్పట్లో ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్న వెస్టిండీస్‌ ఫాస్ట్‌ బౌలర్లను ఎదుర్కొని ఆడాడు. ఆ డేరింగ్‌ బ్యాటింగ్‌కి సంబంధించిన వీడియోలు ఎప్పుడు చూసినా.. ఒళ్లు గగుర్పొడుస్తుంది. ప్రపంచ క్రికెట్‌ను తమ పేస్‌తో భయపెడుతున్న కరేబియన్‌ బౌలర్లను.. తన కరేజ్‌తో భయపెట్టిన ఆ భారత బ్యాటర్‌ కథే ఇది. ఈ ఇండియన్‌ క్రికెట్‌ ‘యానిమల్‌’ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

కృష్ణమాచారి శ్రీకాంత్‌.. 1983లో టీమిండియా సాధించిన తొలి ప్రపంచ కప్‌ టీమ్‌లో సభ్యుడు. ఆయన గురించి చెప్పడానికి ఇదొక్కటే సరిపోదు.. వరల్డ్‌ కప్‌ నుంచిన స్టోరీ ఒకటుంది. అది అతని మొండితనం గురించి. 1980ల్లో ప్రపంచ క్రికెట్‌ను వెస్టిండీస్‌ శాసిస్తోంది. అప్పటికే రెండు సార్లు వరుసగా ప్రపంచ కప్‌ గెలిచిన జట్టు వెస్టిండీస్‌. ఆ జట్టుకు బ్యాటింగ్‌తో మరో బలం.. పేస్‌ బౌలింగ్‌. నిప్పులు చెరిగే బౌలింగ్‌తో ప్రపంచంలోని ఇతర జట్లను వణికిస్తున్నారు కరేబియన్‌ బౌలర్లు. అలాంటి టైమ్‌లో శ్రీకాంత్‌.. ఆ జట్టు స్టార్‌ బౌలర్‌, బౌన్సర్‌ కింగ్‌ కర్ట్లీ ఆంబ్రోస్ బౌలింగ్‌లో ఏకంగా హెల్మెట్‌ లేకుండా బ్యాటింగ్‌ చేశాడు.

అప్పటికే ఒక బాల్‌ అని కడుపులో తగులుతుంది. అయినా కూడా ఏ మాత్రం భయం లేకుండా.. అలాగే చాలా మొండిగా బ్యాటింగ్‌ చేసి.. తర్వాత బంతికి భారీ సిక్స్‌ కొడతాడు శ్రీకాంత్‌. అది చూసి ప్రపంచ క్రికెట్‌ మొత్తం ఆశ్చర్యపోతుంది. అసలు వెస్టిండీస్‌ జట్టుతో మ్యాచ్‌ అంటేనే భయపడుతున్న కాలంలో.. ఓ భారత ఆటగాడు.. ఆంబ్రోస్‌ బౌలింగ్‌లో హెల్మెట్‌ లేకుండా ఆడటమే గొప్ప విషయం అంటే.. పైగా సిక్స్‌ కొట్టి.. తాను మొండివాడేని కాదే.. గట్టి వాడిని కూడా కరేబియన్లతో పాటు, ప్రపంచానికి చాటి చెప్పాడు శ్రీకాంత్‌. సహజంగానే చాలా అగ్రెసివ్‌గా బ్యాటింగ్‌ చేసే శ్రీకాంత్‌.. అలా హెల్మెట్‌ లేకుండా.. జూలువిదిల్చిన సింహంలా బ్యాటింగ్‌ చేస్తున్న వీడియో చూస్తే.. ఇప్పటికి కూడా క్రికెట్‌ అభిమానులకు గూస్‌బమ్స్‌ వస్తాయి.

1983 వరల్డ్‌ కప్‌ సందర్భంగా కూడా శ్రీకాంత్‌ అద్భుతమైన బ్యాటింగ్‌ చేశాడు. ఈ టుకు టుకు బ్యాటింగ్‌ తనకు రాదని, బాల్‌ కనిపిస్తే బాదడమే తెలుసంటూ.. రెచ్చిపోయి ఆడటం శ్రీకాంత్‌ స్టైల్‌. అదే అగ్రెసివ్‌ నేచర్‌తో.. అందర్ని భయపెడుతున్న వెస్టిండీస్‌ను తను భయపెట్టాడు. ఆరంభంలో శ్రీకాంత్‌ హెల్మెట్‌ లేకుండా బ్యాటింగ్‌ చేస్తుండటంతో చాలా మంది భయం వ్యక్తం చేశారు.. కొంతమంది పిచ్చితనం అని నవ్వుకున్నారు. ఎందుకంటే.. అప్పుడు బాల్‌ తలకి గానీ తగిలిందా ఇక అంతే సంగతులు అలాంటి పరిస్థితుల్లో శ్రీకాంత్‌ మొండితనం, భయంలేని బ్యాటింగ్‌కు క్రికెట్‌ ప్రపంచం ఫిదా అయిపోయింది. మరి నిప్పులు చెరిగే వెస్టిండీస్‌ పేసర్లకు వణుకు పుట్టిస్తూ.. హెల్మెట్‌ లేకుండా శ్రీకాంత్‌ బ్యాటింగ్‌ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.