P Venkatesh
P Venkatesh
వన్డే వరల్డ్ కప్ 2023 ఉత్సాహభరితంగా సాగిపోతోంది. టీమిండియా ఇప్పటికే తొలి మ్యాచ్ ఆసిస్ తో ఆడి శుభారంబం చేయగా నేడు ఆఫ్ఘనిస్తాన్ తో రెండో లీగ్ మ్యాచ్ ఆడింది. అరుణ్ జైట్లీ మైదానం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 272 పరుగులు చేసింది. ఆ తర్వాత 273 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగింది టీమిండియా. కెప్టెన్ రోహిత్ శర్మ మెరుపు బ్యాటింగ్, ఇషాన్ కిషన్, కోహ్లీల అద్భుతమైన ప్రదర్శనతో 35 ఓవర్లలోనే పసికూనను మట్టి కరిపించింది. కాగా ఈ మ్యాచ్ లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. కోహ్లీ, నవీన్ ఉల్ హక్ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. ఐపీఎల్ 16 లో జరిగిన వివాదాన్ని మరిచి వీరిద్దరు కలిసిపోవడం ఆసక్తికరంగా మారింది.
కాగా లక్నో సూపర్‌జెయింట్స్ ఆటగాడు నవీన్ ఉల్ హక్ ఐపీఎల్ లో భారత్ స్టార్ బ్యాటర్ కింగ్ కోహ్లీ పట్ల దురుసుగా ప్రవర్తించిన తీరుకు తగిన మూల్యం చెల్లించుకున్నాడు. కోహ్లీ ఫ్యాన్స్ నవీన్ ను ఆటాడేసుకున్నరు. ఎక్కడ మ్యాచ్ జరిగిన నవీన్ ఉల్ హక్ ఉన్నాడంటే చాలు కోహ్లీ కోహ్లీ అంటూ నవీన్ ను ఎద్దేవా చేసేవారు ఆర్సీబీ అభిమానులు. అసలు ఈ వివాదం ఎక్కడ మొదలయ్యిందంటే.. మే 1న లక్నోలో ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో లక్నో పేసర్ నవీన్ ఉల్, విరాట్ కోహ్లీ మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత షేక్ హ్యాండ్ ఇస్తూ కోహ్లీ చేయి లాగాడు నవీన్. దీంతో చిర్రెత్తిపోయిన ఆర్సీబీ ఫ్యాన్స్ నవీన్ ను టార్గెట్ చేశారు.
అయితే తాజాగా జరిగిన భారత్, ఆఫ్ఘనిస్తాన్ లీగ్ మ్యాచ్ లో నవీన్ ఉల్ హక్, విరాట్ కోహ్లీ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. ఒకరికొకరు మద్దతు తెలుపుకుంటూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. ఐపీఎల్ మొదలుకుని నిన్న మొన్నటి వరకు ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్ చేత టీస్ చేయబడుతున్న నవీన్ ఉల్ హక్, కింగ్ కోహ్లీకి షేక్ హ్యాండ్ ఇవ్వడంతో ఆసక్తిగా మారింది. వివాదాలు మరిచి పలకరించుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఫైనల్ గా కోహ్లీ ముందు నవీన్ తలవంచడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. మరి ఇకనైనా నవీన్ కు కోహ్లీ ఫ్యాన్స్ నుంచి విముక్తి కలుగుతదో లేదో చూడాలి.
Mango 🥭 war is Over!
Finally Naveen ul haq bow down to Goat Virat Kohli 🐐#Naveen #ViratKohli𓃵#NaveenUlHaq #INDvAFGpic.twitter.com/vQ0zREw1nL
— Lost Man (@iamaliveX) October 11, 2023