వరల్డ్ కప్ 2023 ముగింపు దశలో టీమిండియా మేనేజ్ మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత జట్టు పగ్గాలను కేఎల్ రాహుల్ కు అందించనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
వరల్డ్ కప్ 2023 ముగింపు దశలో టీమిండియా మేనేజ్ మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత జట్టు పగ్గాలను కేఎల్ రాహుల్ కు అందించనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
వరల్డ్ కప్ 2023 చివరి దశకు చేరుకుంటోంది. గ్రూప్ దశలో టీమ్స్ ఇంకా ఒక్కోమ్యాచ్ మాత్రమే ఆడాల్సి ఉంది. అందులో భాగంగా శనివారం రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. తొలి మ్యాచ్ లో ఆసీస్ వర్సెస్ బంగ్లాదేశ్ తలపడుతుండగా.. రెండో దానిలో పాకిస్థాన్-ఇంగ్లాండ్ జట్లు ఢీకొనబోతున్నాయి. కాగా.. టీమిండియా సైతం తన చివరి లీగ్ మ్యాచ్ ను ఆదివారం నెదర్లాండ్స్ తో ఆడబోతోంది. ఇక ఈ మ్యాచ్ తో ప్రపంచ కప్ లీగ్ దశ ముగుస్తుంది. ఈ క్రమంలోనే కీలక నిర్ణయం తీసుకుంది టీమిండియా మేనేజ్ మెంట్. స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కు టీమిండియా పగ్గాలను అందించనున్నట్లు సమాచారం.
ప్రపంచ కప్ లో భాగంగా తన చివరి లీగ్ మ్యాచ్ ను నెదర్లాండ్స్ తో ఆడనుంది టీమిండియా. అయితే ఇప్పటికే సెమీస్ బెర్త్ ను ఖరారు చేసుకున్న భారత టీమ్ కు ఈ మ్యాచ్ అంత ముఖ్యమైనదేమీ కాదు. ఈ నేపథ్యంలో జట్టులో కొన్ని కీలక మార్పులు చేసేందుకు టీమ్ మేనేజ్ మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా.. రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాలకు విశ్రాంతి ఇవ్వాలని భావిస్తోంది. దీంతో రోహిత్ కు రెస్ట్ ఇస్తే.. అతడి స్థానంలో టీమిండియా సారథి పగ్గాలు చేపట్టనున్నాడు స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్. ఇదిలా ఉండగా.. ఇప్పటికే పాండ్యా స్థానంలో వైస్ కెప్టెన్ గా పగ్గాలు అందుకున్న రాహుల్ ఈ మ్యాచ్ కు కెప్టెన్ గా సేవలు అందించనున్నట్లు సమాచారం.
ఇక బుమ్రాకు రెస్ట్ ఇస్తే.. అతడి స్థానంలో ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ ను తుది జట్టులోకి తీసుకోవచ్చు. ఇదే టైమ్ లో రవీంద్ర జడేజా ప్లేస్ లో సీనియర్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ ను తీసుకుంటారని తెలుస్తోంది. విరాట్ కోహ్లీ, మహ్మద్ షమీ, సిరాజ్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్ లు తుది జట్టులో కొనసాగుతారు. సెమీ ఫైనల్స్ విషయానికి వస్తే.. 15, 16వ తేదీల్లో సెమీఫైనల్స్ జరగనున్నాయి. తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్-ఇండియా ఢీకొంటాయి. ఇక రెండో మ్యాచ్ లో సౌతాఫ్రికాను ఎదుర్కోబోతోంది ఆసీస్. మరి నెదర్లాండ్స్ తో మ్యాచ్ లో కెప్టెన్ పగ్గాలు రాహుల్ కు అందిస్తుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.