క్రికెట్.. వ్యాపారం కాదు! IPL ఓనర్లపై KL రాహుల్‌ సీరియస్

KL Rahul Serious On IPL Owners: ఎప్పుడూ కూల్​గా, కామ్​గా ఉండే టీమిండియా స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ సడన్​గా సీరియస్ అయ్యాడు. ఐపీఎల్ ఓనర్లపై అతడు ఫైర్ అయ్యాడు. క్రికెట్ అనేది వ్యాపారం కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

KL Rahul Serious On IPL Owners: ఎప్పుడూ కూల్​గా, కామ్​గా ఉండే టీమిండియా స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ సడన్​గా సీరియస్ అయ్యాడు. ఐపీఎల్ ఓనర్లపై అతడు ఫైర్ అయ్యాడు. క్రికెట్ అనేది వ్యాపారం కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఎప్పుడూ కూల్​గా, కామ్​గా ఉంటాడు. తన పనేదో తాను అన్నట్లు బిహేవ్ చేస్తాడు. పెద్దగా ఏ విషయాల్లోనూ జోక్యం చేసుకోడు. వివాదాలకు దూరంగా ఉంటాడు. క్రికెట్ తప్ప ఇతర విషయాలకు దూరంగా ఉంటాడు రాహుల్. ఇన్నేళ్ల కెరీర్​లో అతడు ఇతరుల మీద సీరియస్ అయిన ఘటనలు లేవు. ఎవరైనా ఏమైనా అన్నా అతడు పట్టించుకోడు. అలాంటి రాహుల్ సడన్​గా సీరియస్ అయ్యడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్​ ఓనర్లపై కేఎల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. క్రికెట్ అనేది వ్యాపారం కాదంటూ ఫైర్ అయ్యాడు. గేమ్​ను గేమ్​లా చూడాలన్నాడు. ఐపీఎల్ ఓనర్లపై రాహుల్ ఇంకా ఎలాంటి కామెంట్స్ చేశాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఐపీఎల్ ఓనర్లపై రాహుల్ సీరియస్ అయ్యాడు. క్రికెట్​ను ఓ ఆటలాగే చూడాలని, ఇది వ్యాపారం కాదన్నాడు స్టైలిష్ బ్యాటర్. ప్రతి ఆటగాడికి ఓ బ్యాడ్ డే ఉంటుందని, అన్ని సార్లు ఒకేలా ఆడటం ఎవరికీ సాధ్యం కాదన్నాడు. ‘బిజినెస్​ బ్యాగ్రౌండ్​కు చెందిన కొందరు వచ్చి ఐపీఎల్ టీమ్స్​ను కొనుగోలు చేస్తున్నారు. ఈ ఓనర్లంతా బాగానే రీసెర్చ్ చేసి జట్లలోకి ఏయే ఆటగాడు కావాలో తీసుకుంటున్నారు. అయితే బెస్ట్ టీమ్, బెస్ట్ ప్లేయర్లు అందుబాటులో ఉన్నంత మాత్రాన విజయాలు సాధిస్తారని గ్యారెంటీ లేదు. డేటాను బట్టి మంచి ఆటగాడ్ని దక్కించుకోవచ్చు. కానీ అతడు ఆ ఏడాది దారుణంగా ఆడొచ్చు. క్రికెట్ అనే కాదు.. ఏ ఆటలో చూసుకున్నా ఆటగాళ్లకు బ్యాడ్ డే అనేది ఉంటుంది. ముందు ఇది అర్థం చేసుకోవాలి’ అని రాహుల్ స్పష్టం చేశాడు.

గేమ్​తో పాటు ఆటగాళ్లను అర్థం చేసుకోవాలని రాహుల్ చెప్పాడు. అన్ని ఇతర గేమ్స్​లోలాగే క్రికెట్​లోనూ గుడ్ డే, బ్యాడ్ డే అనేది ఉంటుందని తెలిపాడు. ప్లేయర్ల కష్టాలు అర్థం చేసుకోవాలని రాహుల్ పేర్కొన్నాడు. కేఎల్ కామెంట్స్ విన్న నెటిజన్స్.. గత ఐపీఎల్​లో జరిగిన ఓ ఘటనను గుర్తుచేసుకుంటున్నారు. ఓ మ్యాచ్​లో లక్నో ఓడిపోవడంతో ఆ ఫ్రాంచైజీ ఓనర్ సంజీవ్ గోయెంకా గ్రౌండ్​లో అందరూ చూస్తుండగానే టీమ్ కెప్టెన్ రాహుల్​పై సీరియస్ అయ్యాడు. ఇది అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.

ఆటల్లో గెలుపోటములు సహజం, ఏదైనా ఉంటే డ్రెస్సింగ్ రూమ్​లో మాట్లాడుకోక, అందరి ముందు కెప్టెన్, టీమిండియాకు ఆడే ప్లేయర్​ను ఇలా తిట్టడం కరెక్ట్ కాదంటూ అందరూ గోయెంకాను విమర్శించారు. రాహుల్ వ్యాఖ్యలు చూస్తే ఆయన్నే టార్గెట్ చేసుకొని అన్నట్లు కనిపిస్తోందని నెటిజన్స్ అంటున్నారు. కేఎల్ లక్నోకు వీడటం ఖాయమని, మెగా ఆక్షన్​లో ఇతర టీమ్​కు వెళ్లడం పక్కా అని చెబుతున్నారు. మరి.. ఐపీఎల్ ఓనర్లపై రాహుల్ చేసిన వ్యాఖ్యల మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

Show comments