iDreamPost
android-app
ios-app

PAK vs BAN: పాక్ కొంప ముంచిన రాంగ్ డెసిషన్.. తన గొయ్యి తానే తవ్వుకోవడం అంటే ఇదే!

  • Published Aug 26, 2024 | 12:08 PM Updated Updated Aug 26, 2024 | 12:08 PM

పాకిస్థాన్ జట్టు మరో ఘోర పరాజయాన్ని చవిచూసింది. బంగ్లాదేశ్​తో స్వదేశంలో జరుగుతున్న టెస్ట్ సిరీస్​లోని తొలి మ్యాచ్​లో ఆ టీమ్ 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. ఒక్క రాంగ్ డెసిషన్ ఆ జట్టు కొంప ముంచింది.

పాకిస్థాన్ జట్టు మరో ఘోర పరాజయాన్ని చవిచూసింది. బంగ్లాదేశ్​తో స్వదేశంలో జరుగుతున్న టెస్ట్ సిరీస్​లోని తొలి మ్యాచ్​లో ఆ టీమ్ 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. ఒక్క రాంగ్ డెసిషన్ ఆ జట్టు కొంప ముంచింది.

  • Published Aug 26, 2024 | 12:08 PMUpdated Aug 26, 2024 | 12:08 PM
PAK vs BAN: పాక్ కొంప ముంచిన రాంగ్ డెసిషన్.. తన గొయ్యి తానే తవ్వుకోవడం అంటే ఇదే!

ఒకప్పుడు డేంజరస్ టీమ్​గా వరల్డ్ క్రికెట్​లోని అన్ని టీమ్స్​ను వణికించిన పాకిస్థాన్ ఈ మధ్య కాలంలో చెత్తాటతో పరువు తీసుకుంటోంది. పసికూన జట్ల కంటే హీనంగా ఆడుతూ సొంత దేశ అభిమానుల నుంచే విమర్శల్ని మూటగట్టుకుంటోంది. వన్డే వరల్డ్ కప్-2023, టీ20 ప్రపంచ కప్-2024లో గ్రూప్ స్టేజ్ నుంచి నిష్క్రమించి ట్రోల్స్​కు గురైన పాక్.. బంగ్లాదేశ్​తో సిరీస్​తోనైనా గాడిన పడుతుందేమోనని అంతా భావించారు. కానీ సొంతగడ్డపై ఆ టీమ్​తో జరుగుతున్న టెస్ట్ సిరీస్​లో తొలి మ్యాచ్​లోనే 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్​లో ఒక్క రాంగ్ డెసిషన్​తో దారుణమైన ఓటమిని మూటగట్టుకుంది దాయాది జట్టు. కెప్టెన్ షాన్ మసూద్, టీమ్ మేనేజ్​మెంట్ కలసి తీసుకున్న ఓ నిర్ణయం ఆ టీమ్ కొంపముంచింది.

టెస్టుల్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్టు నెగ్గాలంటే భారీ స్కోరు నమోదు చేయాలి. అపోజిషన్ టీమ్​ బ్యాటింగ్​కు దిగే ముందే కొండంత లక్ష్యాన్ని చూసి వణికిపోయేలా చేయాలి. కానీ పాకిస్థాన్ ఆ ఆపర్చునిటీని చేజేతులా మిస్ చేసుకుంది. బంగ్లాతో మ్యాచ్​లో తొలి ఇన్నింగ్స్​లో 448/6 వద్ద ఉన్నప్పుడు ఇన్నింగ్స్​ను డిక్లేర్ చేసింది పాకిస్థాన్. మరో 100 నుంచి 150 పరుగులు చేసి డిక్లరేషన్ ఇచ్చి ఉంటే బంగ్లా డిఫెన్స్​లో పడేది. పిచ్​ బ్యాటింగ్​కు స్వర్గధామంగా ఉంది. బాల్ పడి బ్యాట్ మీదకు ఈజీగా వస్తోంది. బౌలర్లు ఎంత శ్రమించినా వికెట్లు రాని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఏ టీమ్ ఉన్నా ఇన్నింగ్స్​ను డిక్లేర్ చేసేది కాదు. కానీ పాక్ ఆ పని చేసి తన గొయ్యిని తానే తవ్వుకుంది. ఇక్కడే మ్యాచ్ టర్న్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్ స్టార్ట్ చేసిన బంగ్లాదేశ్ ఫస్ట్ ఇన్నింగ్స్​లో 565 పరుగులకు ఆలౌట్ అయింది.

ప్రెజర్​లోకి నెట్టే ఛాన్స్​ను పాక్ మిస్ చేసుకుంది. కానీ బంగ్లా బ్యాటర్లు మాత్రం దీన్ని సద్వినియోగం చేసుకున్నారు. పట్టుదలతో ఆడుతూ టీమ్​ను భారీ స్కోరుకు చేర్చారు. ఏకంగా 117 లీడింగ్ కూడా రావడంతో ఓడిపోని స్థితికి చేరుకుంది బంగ్లా. దీంతో సెకండ్ ఇన్నింగ్స్​లో పాక్ బ్యాటర్లను మరింత అటాక్ చేస్తూ బౌలింగ్ చేశారు. ఇది వర్కౌట్ అయింది. పాక్ 146 పరుగులకు ఆలౌట్ అయింది. ఒక్క స్పిన్నర్​ను కూడా ఆడించకపోవడం, అవతలి జట్టులోని స్పిన్నర్లను సరిగ్గా ఫేస్ చేయలేకపోవడం కూడా పాక్ ఓటమికి కారణాలుగా చెప్పొచ్చు. అయితే మ్యాచ్ మిస్ అయింది మాత్రం డిక్లరేషన్ టైమ్​లోనే. రిజల్ట్ రాబట్టాలన్న తొందర, ఇంగ్లండ్ వాడే బజ్​బాల్ లాంటి స్ట్రాటజీతో కొట్టేద్దామన్న ఊపుతో తాను తవ్విన గొయ్యిలో తానే పడింది పాక్. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్ మెరుగైన స్థితిలో ఉన్నప్పుడే డిక్లరేషన్ చేస్తుంది. ఈ ప్లాన్ ఒక్కోసారి బూమరాంగ్ అవుతుంది. పాక్ విషయంలో అదే జరిగింది. మరి.. పాక్ ఓటమికి ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయని మీరు భావిస్తే కామెంట్ చేయండి.