iDreamPost
android-app
ios-app

ఆ బాధ ఇప్పటికీ అలానే ఉంది.. కేఎల్ రాహుల్ ఎమోషనల్ కామెంట్స్!

  • Author Soma Sekhar Published - 01:26 PM, Sun - 29 October 23

ఇంగ్లాండ్ తో మ్యాచ్ కు ముందు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఎమోషనల్ అయ్యాడు. ఆ బాధ ఇప్పటికీ నన్ను వెంటాడుతూనే ఉందని చెప్పుకొచ్చాడు. మరి రాహుల్ ను వెంటాడుతున్న ఆ బాధ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంగ్లాండ్ తో మ్యాచ్ కు ముందు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఎమోషనల్ అయ్యాడు. ఆ బాధ ఇప్పటికీ నన్ను వెంటాడుతూనే ఉందని చెప్పుకొచ్చాడు. మరి రాహుల్ ను వెంటాడుతున్న ఆ బాధ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

  • Author Soma Sekhar Published - 01:26 PM, Sun - 29 October 23
ఆ బాధ ఇప్పటికీ అలానే ఉంది.. కేఎల్ రాహుల్ ఎమోషనల్ కామెంట్స్!

వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా దూసుకెళ్తోంది. ఆడిన ఐదు మ్యాచ్ ల్లో ఐదు గెలిచి.. సెమీస్ రేసులో ముందుంది. కాగా.. ప్రపంచ కప్ లో ఆరో విజయంపై కన్నేసింది భారత జట్టు. ఆదివారం లక్నో వేదికగా జరిగే మ్యాచ్ లో విజయం సాధించి.. తన జైత్ర యాత్రను దిగ్విజయంగా కొనసాగించాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే మ్యాచ్ కు ముందు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఎమోషనల్ అయ్యాడు. ఆ బాధ ఇప్పటికీ నన్ను వెంటాడుతూనే ఉందని చెప్పుకొచ్చాడు. మరి రాహుల్ ను వెంటాడుతున్న ఆ బాధ ఏంటి? ఇంగ్లాండ్ తో మ్యాచ్ ముందు అతడు ఎందుకు ఎమోషనల్ అయ్యాడో ఇప్పుడు తెలుసుకుందాం.

వరల్డ్ కప్ లో టీమిండియా ప్లేయర్లు సమష్టిగా రాణిస్తూ.. జట్టుకు తిరుగులేని విజయాలను అందిస్తున్నారు. ఇక ప్రపంచ కప్ లో ఆరో విజయం కోసం ఉవ్విళ్లూరుతోంది టీమిండియా. ఆదివారం లక్నో వేదికగా ఇంగ్లాండ్ తో కీలక మ్యాచ్ కు సిద్దమైంది భారత జట్టు. అయితే ఈ గ్రౌండ్ తో ప్రత్యేక అనుబంధం కలిగి ఉన్నాడు టీమిండియా వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ కేఎల్ రాహుల్. లక్నోలోని ఏకనా స్టేడియంతో రాహుల్ కు ప్రత్యేక అనుబంధం ఉంది. ఐపీఎల్ మెగాటోర్నీ(2023)లో లక్నో సూపర్ జెయింట్స్ కు సారథిగా వ్యవహరించాడు రాహుల్. అయితే ఈ సీజన్ మధ్యలోనే గాయపడి దాదాపు ఆటకు ఐదు నెలలు దూరం అయ్యాడు ఈ స్టార్ బ్యాటర్. ఇదే విషయాన్ని తలచుకుని ఇంగ్లాండ్ తో మ్యాచ్ కు ముందు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఎమోషనల్ అయ్యాడు.

కేఎల్ రాహుల్ మాట్లాడుతూ..”లక్నోతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఇక ఇదే మైదానంలో ఆడుతూ నేను గాయపడ్డాను. దీంతో 5 నెలల పాటు టీమిండియాకు దూరమైయ్యాను. ఇది నాకు కఠినమైన సమయం. ఆ బాధ ఇప్పటికీ అలానే ఉంది. ఇక గాయపడి సర్జరీ చేయించుకున్న తర్వాత.. రీ ఎంట్రీ ఇవ్వాలంటే ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. అదంత ఈజీకాదు. ఫిజియో చేయించుకున్నా సరే నొప్పి వస్తూనే ఉంటుంది. దానిని అధిగమించాలంటే.. శారీరకంగా, మానసికంగా చాలా దృఢంగా ఉండాలి” అంటూ తన జీవితంలో ఎదుర్కొన్న సంఘటనలను, గ్రౌండ్ తో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నాడు. కాగా.. ఈ గ్రౌండ్ లో అయిన గాయాన్ని నేను మర్చిపోదామని చూస్తున్నా.. కానీ అభిమానులు గుర్తు చేస్తూనే ఉన్నారని చెప్పుకొచ్చాడు. అయితే నేను దానిని పక్కన పెట్టి.. ఫ్రెష్ గా బరిలోకి దిగాలని భావిస్తున్నట్లు కేఎల్ పేర్కొన్నాడు.