iDreamPost
android-app
ios-app

IND vs ENG: అఫీషియల్‌: టీమిండియాకు బిగ్‌ షాక్‌! టీమ్‌కు ఇద్దరు ఆటగాళ్లు దూరం!

  • Published Jan 29, 2024 | 4:55 PM Updated Updated Jan 29, 2024 | 4:55 PM

KL Rahul, Ravindra Jadeja: ఇం‍గ్లండ్‌తో విశాఖపట్నం వేదికగా జరగనున్న రెండో టెస్టుకు ఇద్దరు భారత ఆటగాళ్లు దూరం అయ్యాడు. పైగా వాళ్లిద్దరూ ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లు. మరి వారిద్దరు ఎవరు? ఎందుకు దూరం అయ్యారో ఇప్పుడు చూద్దాం..

KL Rahul, Ravindra Jadeja: ఇం‍గ్లండ్‌తో విశాఖపట్నం వేదికగా జరగనున్న రెండో టెస్టుకు ఇద్దరు భారత ఆటగాళ్లు దూరం అయ్యాడు. పైగా వాళ్లిద్దరూ ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లు. మరి వారిద్దరు ఎవరు? ఎందుకు దూరం అయ్యారో ఇప్పుడు చూద్దాం..

  • Published Jan 29, 2024 | 4:55 PMUpdated Jan 29, 2024 | 4:55 PM
IND vs ENG: అఫీషియల్‌: టీమిండియాకు బిగ్‌ షాక్‌! టీమ్‌కు ఇద్దరు ఆటగాళ్లు దూరం!

హైదరాబాద్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఓటమి పాలైన టీమిండియాకు దెబ్బ మీద దెబ్బ తగిలింది. ఇప్పటికే తొలి టెస్ట్‌లో దారుణ ఓటమితో బాధలో ఉన్న భారత జట్టుకు ఇద్దరు స్టార్‌ ఆటగాళ్లు దూరమయ్యారు. విశాఖపట్నం వేదికగా జరగనున్న రెండో టెస్టుకు టీమిండియా స్టార్‌ క్రికెటర్లు కేఎల్‌ రాహుల్‌, రవీంద్ర జడేజాలు దూరం అయినట్లు బీసీసీఐ తన అధికార ట్విట్టర్‌ అకౌంట్‌లో వెల్లడించింది. తొలి టెస్ట్‌ సందర్భంగా రవీంద్ర జడేజా గాయపడిన విషయం తెలిసిందే. తొడ కండరాల నొప్పితో జడేజా బాధపడుతున్నాడు. దీంతో.. అతను రెండో టెస్టు ఆడతాడా? లేదా అన్న అనుమానాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ అధికారిక ప్రకటన వెలువరించింది.

అయితే. అతనితో పాటు కేఎల్‌ రాహుల్‌ సైతం రెండో టెస్టుకు దూరం కావడం క్రికెట్‌ అభిమానులను షాక్‌కు గురిచేసింది. జడేజాతో పాటు కేఎల్ రాహుల్‌ సైతం గాయంతో బాధపడుతున్నాడని, అందుకే రెండో టెస్ట్‌కు వాళ్లిద్దరూ దూరంగా ఉండనున్నారు. ఇలా ఇద్దరు మంచి ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లు.. కీలకమైన రెండో టెస్టుకు దూరం కావడం జట్టుకు ఇబ్బందికరంగా మారొచ్చు. ఇప్పటికే జట్టులో విరాట్‌ కోహ్లీ లాంటి స్టార్‌ ఆటగాడు టీమ్‌లో లేకపోవడం, ఈజీగా గెలవాల్సిన తొలి టెస్టులో ఓటమి పాలు కావడం, ఇప్పుడు ఇద్దరు స్టార్‌ ప్లేయర్‌ దూరం కావడంతో భారత క్రికెట్‌ అభిమానులను ఆందోళన పరుస్తోంది. ఇలా అయితే.. రెండో టెస్టులోనూ టీమిండియా గడ్డు పరిస్థితి తప్పదని అంటున్నారు.

ఇక కేఎల్‌ రాహుల్‌, రవీంద్ర జడేజాల స్థానాల్లో యువ క్రికెటర్లతో భర్తీ చేసింది బీసీసీఐ. ఎన్నో రోజులుగా దేశవాళి క్రికెట్‌లో అద్భుతమైన ప్రదర్శన చేస్తూ.. జాతీయ జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్న సర్ఫారాజ్‌ ఖాన్‌తో పాటు సౌరభ్‌ కుమార్‌, వాషింగ్టన్‌ సుందర్‌లను టీమ్‌లో యాడ్‌ చేసింది. వీరిలో ఒకరిద్దరూ రెండో టెస్టులో బరిలోకి దిగొచ్చు. మరి రవీంద్ర జడేజా, కేఎల్‌ రాహుల్‌ గాయాలతో టీమ్‌కి దూరం కావడంపై అలాగే వారి స్థానాల్లో ఎంపికైన ఆటగాళ్లపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.