Nidhan
టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఆటతోనే కాదు సేవాగుణంతోనూ ఎంతో మంది హృదయాలు గెలుచుకున్నాడు. అతడు మరోమారు తన మంచి మనసును చాటుకున్నాడు.
టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఆటతోనే కాదు సేవాగుణంతోనూ ఎంతో మంది హృదయాలు గెలుచుకున్నాడు. అతడు మరోమారు తన మంచి మనసును చాటుకున్నాడు.
Nidhan
టీమిండియా స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ గురించి తెలిసిందే. గ్రౌండ్లోకి అడుగుపెట్టాడా అద్భుతమైన బ్యాటింగ్, స్టన్నింగ్ కీపింగ్‌తో అందరి మనసులు దోచుకుంటాడు. తన బ్యాటింగ్ స్టైల్‌తో కోట్లాది మంది ఫ్యాన్స్‌ను అతడు సొంతం చేసుకున్నాడు. బాల్‌ను కసితీరా బాదడం రాహుల్‌కు తెలియదు. కూల్‌గా, స్టైలిష్‌గా, అందంగా ఉంటుంది అతడి బ్యాటింగ్ శైలి. ఎక్కడా బలం పెట్టి కొట్టినట్లు గానీ రిస్క్ చేస్తున్నట్లు గానీ అనిపించదు. నిలబడిన చోటు నుంచే బాల్ వేగం, తన టైమింగ్‌ను వాడి అలవోకగా బౌండరీకి తరలిస్తుంటాడు. అలాంటి రాహుల్ క్రికెట్‌తో పాటు పలు సేవా కార్యక్రమాల ద్వారా కూడా అభిమానుల మనసు దోచుకుంటున్నాడు. మరోమారు అతడు తన గొప్ప మనసును చాటుకున్నాడు.
భార్య అతియా శెట్టితో కలసి ఓ చారిటీని ప్రకటించాడు రాహుల్. వినికిడి, దృష్టి లోపంతో బాధపడుతున్న విద్యార్థుల కోసం ఈ దంపతులు విరాళాలు సేకరించనున్నారు. ఇందులో భాగంగా ‘క్రికెట్ ఫర్ ఏ కాజ్’ పేరుతో ఆక్షన్‌ను నిర్వహించనున్నారు. ఈ వేలంలో విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని, రాహుల్ ద్రవిడ్, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్, శ్రేయస్ అయ్యర్, యుజ్వేంద్ర చాహల్, రిషబ్ పంత్, సంజూ శాంసన్, రవీంద్ర జడేజా లాంటి క్రికెట్ ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ ఆక్షన్‌లో పాల్గొనే ప్లేయర్లు తమకు నచ్చిన అమౌంట్‌ను డొనేట్ చేస్తారు. ఈ మొత్తాన్ని ఆ పిల్లల ఆలనాపాలన చూసుకుంటున్న విప్లా ఫౌండేషన్‌కు అందించనున్నారు రాహుల్-అతియా.
చారిటీ కోసం రాహుల్ నిర్వహించనున్న స్పెషల్ ఆక్షన్‌లో భారత క్రికెటర్లతో పాటు జాస్ బట్లర్, క్వింటన్ డికాక్, మార్కస్ స్టొయినిస్, నికోలస్ పూరన్ లాంటి ఇంటర్నేషనల్ ప్లేయర్లు కూడా పార్టిసిపేట్ చేయనున్నారు. ఇది తెలిసిన నెటిజన్స్.. రాహుల్ సేవా గుణాన్ని మెచ్చుకుంటున్నారు. పిల్లల కోసం రాహుల్ చేస్తున్న పని గ్రేట్ అంటూ ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. అతడు తన సేవా కార్యక్రమాలను ఇలాగే కొనసాగించాలని కోరుకుంటున్నారు. ఇక, శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో ఈ స్టార్ బ్యాటర్ ఫర్వాలేదనిపించాడు. 43 బంతుల్లో 31 పరుగులు చేశాడు రాహుల్. అయితే అతడితో పాటు అక్షర్ పటేల్ (57 బంతుల్లో 33), శివమ్ దూబె (24 బంతుల్లో 25) కీలక సమయంలో పెవిలియన్ చేరడంతో మ్యాచ్ టై అయింది.