iDreamPost
android-app
ios-app

ఈ పోలీస్ ఆఫీసర్ ఒకప్పటి స్టార్ క్రికెటర్! ధోనిని ఇంతటి స్టార్ చేసింది ఈయనే!

  • Published Aug 03, 2024 | 1:31 PM Updated Updated Aug 03, 2024 | 1:31 PM

T20 World Cup 2007, Joginder Sharma, MS Dhoni: పోలీస్‌ డ్రెస్‌లో వచ్చి ధోనిని కలిశాడు.. కానీ, ఒకప్పుడు ధోనితో కలిసి వరల్డ్‌ కప్‌ ఆడాడు. నిజానికి ధోనిని స్టార్‌ చేసింది ఇతనే. అతనెవరో? ఎలా స్టార్‌ చేశాడో ఇప్పుడు చూద్దాం..

T20 World Cup 2007, Joginder Sharma, MS Dhoni: పోలీస్‌ డ్రెస్‌లో వచ్చి ధోనిని కలిశాడు.. కానీ, ఒకప్పుడు ధోనితో కలిసి వరల్డ్‌ కప్‌ ఆడాడు. నిజానికి ధోనిని స్టార్‌ చేసింది ఇతనే. అతనెవరో? ఎలా స్టార్‌ చేశాడో ఇప్పుడు చూద్దాం..

  • Published Aug 03, 2024 | 1:31 PMUpdated Aug 03, 2024 | 1:31 PM
ఈ పోలీస్ ఆఫీసర్ ఒకప్పటి స్టార్ క్రికెటర్! ధోనిని ఇంతటి స్టార్ చేసింది ఈయనే!

టీమిండియా దిగ్గజ మాజీ క్రికెటర్‌ మహేంద్రసింగ్‌ ధోనిని తాజాగా ఓ డీజీపీ కలిశాడు. హర్యానా పోలీస్‌ డిపార్మెంట్‌లో పనిచేస్తున్న ఆ వ్యక్తి.. గతంలో టీమిండియా తరఫున ఆడాడు. టీమిండియాకు ఆడటమే కాదు.. భారత్‌కు టీ20 వరల్డ్‌ కప్‌ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. సౌతాఫ్రికా వేదికగా జరిగిన మొట్టమొదటి టీ20 వరల్డ్‌ కప్‌ 2007లో ధోని కెప్టెన్సీలోని టీమిండియా ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఆ మెగా టోర్నీలో మన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో.. చివరి ఓవర్‌ వేసిన బౌలరే ఈ డీజీపీ. వెంటనే.. ఆ బౌలర్‌ పేస్‌ కళ్ల ముందు కదలాడింది కదా.. ఎస్‌ అతనే జోగిందర్‌ శర్మ.

వరల్డ్‌ కప్‌ ఫైనల్‌.. పాకిస్థాన్‌ విజయానికి చివరి 6 బంతుల్లో 13 పరుగులు కావాలి. స్ట్రైక్‌లో అప్పటికే 37 పరుగులు చేసి మంచి ఊపు మీదున్న మిస్బా ఉల్‌ హక్‌ ఉన్నాడు. అతన్ని చూస్తే ఆ 13 పరుగులు కొట్టేసేలా కనిపిస్తున్నాడు. ఇక 13 రన్స్‌ను డిఫెండ్‌ చేస్తూ.. చివరి ఓవర్‌ వేసే బౌలర్‌ ఎవరా? అంటూ భారత క్రికెట్‌ అభిమానులు నరాలు తెగే ఉత్కంఠ మధ్య ఊపిరి బిగబట్టి మ్యాచ్‌ చూస్తున్నారు.. కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని.. బంతిని జోగిందర్‌ శర్మ చేతుల్లో పెట్టాడు. అప్పటికీ అతను పెద్ద బౌలర్‌ కాదు, అనుభవం కూడా పెద్దగా లేదు.. అలాంటి బౌలర్‌కు బాల్‌ ఇవ్వడంతో అంతా షాక్‌ అయ్యారు. కానీ, ధోని అతన్ని నమ్మాడు. చివరి ఓవర్‌ వేసేందుకు ఎంతో ధైర్యంగా బంతి అందుకున్న జోగిందర్‌ శర్మ తొలి బాల్‌ను వైడ్‌గా వేశాడు. తర్వాత బంతి డాట్‌, ఆ నెక్ట్స్‌ బాల్‌ సిక్స్‌.. ఆయిన కూడా ఒత్తిడికి గురికాకుండా మూడో బాల్‌ వేశాడు.. ఆ బాల్‌ను స్కూప్‌షాట్‌ ఆడిన మిస్బా.. బంతిని శ్రీశాంత్‌ చేతుల్లోకి కొట్టాడు. అంతే పాక్‌ చివరి వికెట్‌ కోల్పోవడంతో టీమిండియా మొట్టమొదటి టీ20 ఛాంపియన్‌గా అవతరించింది.

ఈ విజయంతో తొలి టీ20 వరల్డ్‌ కప్‌ అందించిన కెప్టెన్‌గానే కాకుండా.. ఇండియన్‌ క్రికెట్‌లో ధోని ఒక స్టార్‌గా మారిపోయాడు. ఇప్పుడు ధోని ఈ స్థాయిలో ఉన్నాడంటే అందుకు కారణం ఆ టీ20 వరల్డ్‌ కప్‌ విజయం. అయితే.. అంతటి మెగా టోర్నీలో ఎంతో ధైర్యంగా, ఒత్తిడి తట్టుకంటూ బౌలింగ్‌ చేసి.. జోగిందర్‌ శర్మ వరల్డ్‌ కప్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు ధోని ఈ స్థాయిలో ఉన్నాడంటే అందుకు జోగిందర్‌ శర్మ కూడా ఒక కారణం. ఇక జోగిందర్‌ శర్మ టీమిండియా తరఫున 4 వన్డేలు, 4 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. వన్డేల్లో 1, టీ20ల్లో 4 వికెట్లు సాధించాడు. వన్డేల్లో 3 ఇన్నింగ్స్‌ల్లో 35 పరుగులు చేశాడు. టీ20ల్లో అతనికి బ్యాటింగ్‌ రాలేదు. ఇక క్రికెట్‌కు దూరమైన తర్వాత.. స్పోర్ట్స్‌ కోటాలో హర్యానా ప్రభుత్వం జోగిందర్‌కు పోలీస్‌ డిపార్మెంట్‌లో ఉద్యోగం కల్పించింది. ప్రస్తుతం డీజీపీగా విధులు నిర్వహిస్తున్నాడు జోగిందర్‌. తాజాగా మహేంద్ర సింగ్‌ ధోనిని కలిశాడు. దాదాపు 12 ఏళ్ల తర్వాత ధోనిని కలిసినట్లు జోగిందర్‌ పేర్కొన్నాడు. మరి వీళ్లిద్దరి అపూర్వ కలయికపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.