KKR vs PBKS: నరైన్-సాల్ట్ విధ్వంసం.. కానీ ఆ దిగ్గజ రికార్డును తాకలేకపోయారు!

ఫోర్లు, సిక్సర్లతో నరైన్-సాల్ట్ అర్దసెంచరీలు పూర్తి చేసుకుని జట్టుకు భారీ స్కోర్ అందించారు. అయితే వీరిద్దరు ఇంత విధ్వంసం సృష్టించినా గానీ ఆ దిగ్గజ రికార్డును మాత్రం తాకలేకపోయారు.

ఫోర్లు, సిక్సర్లతో నరైన్-సాల్ట్ అర్దసెంచరీలు పూర్తి చేసుకుని జట్టుకు భారీ స్కోర్ అందించారు. అయితే వీరిద్దరు ఇంత విధ్వంసం సృష్టించినా గానీ ఆ దిగ్గజ రికార్డును మాత్రం తాకలేకపోయారు.

ఐపీఎల్ 2024 సీజన్ ప్రేక్షకులకు ఫుల్ కిక్కిస్తోంది. రికార్డుల మీద రికార్డులు కొల్లగొడుతూ.. ముందుకు సాగుతోంది ఈ సీజన్. తాజాగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్ కత్తా వర్సెస్ పంజాబ్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో కేకేఆర్ ఓపెనర్లు సునీల్ నరైన్-ఫిలిప్ సాల్ట్ లు పెను విధ్వంసం సృష్టించాడు. నువ్వా? నేనా? అన్నట్లుగా పోటీ పడి మరి దంచికొట్టారు. ఫోర్లు, సిక్సర్లతో ఇద్దరూ అర్దసెంచరీలు పూర్తి చేసుకుని జట్టుకు భారీ స్కోర్ అందించారు. అయితే నరైన్-సాల్ట్ ఇంత విధ్వంసం సృష్టించినా గానీ ఆ దిగ్గజ రికార్డును మాత్రం తాకలేకపోయారు. ఆ వివరాల్లోకి వెళితే..

పంజాబ్ బౌలర్లను ఓ రేంజ్ లో ఆటాడుకున్నారు కేకేఆర్ ఓపెనర్స్ సునీల్ నరైన్-ఫిలిప్ సాల్ట్. వీరిద్దరి ధాటికి పవర్ ప్లేలో 76 పరుగులు, 10 ఓవర్లకు 137 పరుగులు వచ్చాయి. సునీల్ నరైన్ 23 బంతుల్లో అర్ధశతకం నమోదు చేసుకోగా.. సాల్ట్ 25 బంతుల్లో ఫిఫ్టీ బాదాడు. వీరిద్దరు కలిసి తొలి వికెట్ కు 137 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే మంచి ఊపులో కనిపించి, మరో సెంచరీ చేస్తాడనుకున్న నరైన్ 32 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సులతో 71 పరుగులు చేశాడు. ఆ వెంటనే సాల్ట్ సైతం 37 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సులతో 75 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. అయితే ఈ జోడి ఇంత విధ్వంసం సృష్టించినా గానీ, కేకేఆర్ గత ఓపెనర్లు గౌతమ్ గంభీర్-క్రిస్ లిన్ నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టలేకపోయారు. ఇంతకీ ఆ రికార్డు ఏంటంటే?

అది 2017 ఐపీఎల్ సీజన్.. కేకేఆర్ వర్సెస్ గుజరాత్ లయన్స్ మధ్య మ్యాచ్. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టీమ్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఆ తర్వాత 184 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన కేకేఆర్ టీమ్ వికెట్ నష్టపోకుండా టార్గెట్ ను 15 ఓవర్లలోనే మడతపెట్టేసింది. ఆ జట్టు ఓపెనర్లు అయిన గౌతమ్ గంభీర్(76), క్రిస్ లిన్(93) పరుగులతో అజేయంగా టీమ్ కు విజయాన్ని అందించారు. కేకేఆర్ తరఫున ఏ వికెట్ కైనా ఈ రికార్డు ఇప్పటికీ అలాగే ఉంది. దీంతో పాటుగా మరోసారి ఉతప్పతో కలిసి 158 పరుగులు జోడించాడు గంభీర్. అయితే ఈ రోజు ఈ రికార్డ్ బ్రేక్ అవుతుందని అనుకున్నారు. కానీ కాలేదు. ఈ ఘనతకు చేరువకి వచ్చినప్పటికీ నరైన్-సాల్ట్ దాన్ని తాకలేకపోయారు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. కేకేఆర్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 261 పరుగుల భారీ స్కోర్ దంచికొట్టారు. జట్టులో నరైన్(71), ఫిలిప్ సాల్ట్(75), ఆండ్రీ రస్సెస్(24), వెంకటేశ్ అయ్యర్ (39), శ్రేయస్ అయ్యర్(28) పరుగులు చేశారు.

Show comments