Nidhan
Kieron Pollard, CPL 2024: కరీబియన్ విధ్వంసకారుడు కీరన్ పొలార్డ్ తన భుజ బలం ఏంటో మరోమారు చూపించాడు. సునామీ ఇన్నింగ్స్‌తో రెచ్చిపోయాడు. సిక్సుల మోత మోగించి మ్యాచ్‌ను తన టీమ్ వైపు తిప్పాడు.
Kieron Pollard, CPL 2024: కరీబియన్ విధ్వంసకారుడు కీరన్ పొలార్డ్ తన భుజ బలం ఏంటో మరోమారు చూపించాడు. సునామీ ఇన్నింగ్స్‌తో రెచ్చిపోయాడు. సిక్సుల మోత మోగించి మ్యాచ్‌ను తన టీమ్ వైపు తిప్పాడు.
Nidhan
మోడర్న్ క్రికెట్ చూసిన అత్యంత విధ్వంసకారుల్లో కరీబియన్ యోధుడు కీరన్ పొలార్డ్ ఒకడు. భుజ బలాన్ని ఉపయోగించి పర్ఫెక్ట్ టైమింగ్‌తో అతడు కొట్టే షాట్లకు బంతులు ఈజీగా స్టాండ్స్ దాటిపోతాయి. అతడు కొట్టిన కొన్ని బంతులైతే స్టేడియం అవతల పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అవతల ఉన్నది ఎంత తోపు బౌలర్ అయినా పొలార్డ్ పవర్ ముందు నిలబడటం కష్టమే. లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్ అందునా టీ20ల్లో పొలార్డ్ రెచ్చిపోయి ఆడే తీరుకు ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే. తాజాగా మరోమారు తన బ్యాట్ దమ్ము చూపించాడీ విండీస్ వీరుడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా సెయింట్ లూసియా కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సునామీ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. సిక్సుల వర్షం కురిపించి పోయిందనుకున్న మ్యాచ్‌లో ట్రింబాగో నైట్ రైడర్స్‌కు అనూహ్య విజయాన్ని అందించాడు.
లూసియా కింగ్స్‌కు పొలార్డ్ చుక్కలు చూపించాడు. భారీ షాట్లతో విరుచుకుపడి మ్యాచ్‌ను వాళ్ల చేతుల్లో నుంచి లాగేసుకున్నాడు. 19 బంతుల్లోనే 52 పరుగులు చేశాడు. ఇందులో 7 సిక్సులు ఉన్నాయి. ఒకదశలో ట్రింబాగ్ మ్యాచ్ కోల్పోయినట్లే కనిపించింది. ఆ టీమ్ గెలవడం కష్టమని అంతా భావించారు. పొలార్డ్ క్రీజులోకి వచ్చినప్పుడు 40 బంతుల్లో 65 పరుగులు చేయాల్సి ఉంది. ఆ తర్వాత ఈక్వేషన్ మారిపోయింది. ఆఖరి 12 బంతుల్లో 27 పరుగులు చేయాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది. అంతే పొలార్డ్ తన విశ్వరూపం చూపించాడు. 19వ ఓవర్లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. బౌండరీలు కాదు.. కేవలం సిక్సులతోనే డీల్ చేశాడు. మాథ్యూ ఫోర్డ్ వేసిన ఆ ఓవర్లో ఏకంగా 4 సిక్సులు బాదేశాడు. దీంతో అప్పటివరకు తమదే విజయమని ధీమాగా ఉన్న ప్రత్యర్థి జట్టు, ఆ టీమ్ ఫ్యాన్స్ అంతా సైలెంట్ అయిపోయారు.
చేతిలో ఉన్న మ్యాచ్ పోవడంతో లూసియా కింగ్స్ ప్లేయర్లు నిరాశలో కూరుకుపోయారు. అసలేం జరిగిందో అర్థమయ్యేలోపే ఓటమి చెందడంతో షాక్‌లోనే ఉండిపోయారు. ఇదేం బీభత్సం రా బాబు.. ఒక్క ఓవర్లోనే మ్యాచ్ తిప్పేశాడంటూ పోలార్డ్ వైపు అలా చూస్తూ ఉండిపోయారు. సంచలన విజయం సాధించడంతో ట్రింబాగో ఆటగాళ్లు సంతోషంలో మునిగిపోయారు. పోయిందనుకున్న మ్యాచ్‌లో గెలవడంతో వాళ్ల ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. ఓటమి ఖాయం అనుకున్న మ్యాచ్‌లో ఇంకో 5 బంతులు ఉండగానే టీమ్‌కు గ్రాండ్ విక్టరీ అందించిన పొలార్డ్‌తో కలసి విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఒంటిచేత్తో జట్టును గెలిపించిన పొలార్డ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ సక్సెస్‌లో పొలార్డ్‌తో పాటు ఫస్ట్ డౌన్లో వచ్చిన షకెరే ప్యారిస్ (33 బంతుల్లో 57)కు కూడా క్రెడిట్ ఇవ్వాలి. అతడు 1 ఫోర్, 6 సిక్సులతో ప్రత్యర్థి బౌలర్లకు పోయించాడు. అదే జోరును ఆఖర్లో అందుకున్న పొలార్డ్ మ్యాచ్‌ను ఒక్క ఓవర్లో ఫినిష్ చేసేశాడు. మరి.. పొలార్డ్ బ్యాటింగ్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.
THE KIERON POLLARD MASTERCLASS.
– 52* (19) with ZERO fours and 7 sixes in the CPL. The GOAT finisher of T20 cricket did it once again. 🙇♂️pic.twitter.com/XKD8a0OYy1
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 11, 2024