శ్రీలంక-ఆఫ్గానిస్తాన్ మ్యాచ్ లో ఓ అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఓ బాలుడు స్పృహతప్పి పడిపోయాడు.
శ్రీలంక-ఆఫ్గానిస్తాన్ మ్యాచ్ లో ఓ అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఓ బాలుడు స్పృహతప్పి పడిపోయాడు.
వరల్డ్ కప్ లో భాగంగా పూనే వేదికగా జరిగిన మ్యాచ్ లో శ్రీలంక-ఆఫ్గానిస్తాన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో శ్రీలంకకు షాకిస్తూ.. 7 వికెట్ల తేడాతో విజయఢంకా మోగించింది ఆఫ్గాన్. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ లో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది ఆఫ్గానిస్తాన్. ఇంగ్లాండ్, పాకిస్తాన్, శ్రీలంకలను ఓడించి.. వరల్డ్ కప్ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానిక ఎగబాకి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్ లో ఓ అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
శ్రీలంక-ఆఫ్గానిస్తాన్ మ్యాచ్ లో ఓ అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు జాతీయ గీతం ఆలపిస్తుండగా ఈ సంఘటన జరిగింది. ఏం జరిగిందంటే? శ్రీలంక జాతీయ గీతం ఆలపిస్తుండగా.. మస్కట్ కు చెందిన ఓ బాలుడు స్పృహతప్పి పడిపోయాడు. అయితే ఇది గమనించిన శ్రీలంక సారథి కుశాల్ మెండిస్ వెంటనే ఆ బాలుడిని కిందపడకుండా పట్టుకున్నాడు. అక్కడే ఉన్న ఆఫ్గాన్ సపోర్ట్ స్టాప్ ఒకరు పరిగెత్తుకొచ్చి.. ఆ బాలుడిని గ్రౌండ్ నుంచి తీసుకెళ్లాడు. అయితే ఆ పిల్లాడు స్పృహతప్పి పోవడానికి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటమే కారణమని తెలుస్తోంది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 49.3 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌట్ అయ్యింది. లంక బ్యాటర్లలో నిస్సాంక(46), కెప్టెన్ కుశాల్ మెండిస్(39), సమరవిక్రమ(36) పరుగులు చేయగా.. ఆఫ్గాన్ బౌలర్లలో ఫజల్ ఫారూఖీ 4, ముజీబ్ రెహ్మన్ 2, రషీద్ ఖాన్, ఒమర్ జాయ్ తలా ఓ వికెట్ తీశారు. అనంతరం 242 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్గాన్ కేలవం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 45.2 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఆఫ్గాన్ బ్యాటర్లలో హష్మతుల్లా షాహిదీ(58*), ఒమర్జాయ్(72*), రెహ్మత్ షా(62) పరుగులతో రాణించి.. జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.
— rajendra tikyani (@Rspt1503) October 30, 2023