iDreamPost
android-app
ios-app

నా ఫేవరేట్‌ క్రికెటర్‌ రోహిత్‌ శర్మ: పాకిస్థాన్‌ క్రికెటర్‌

  • Published Feb 21, 2024 | 4:38 PM Updated Updated Feb 21, 2024 | 4:38 PM

Rohit Sharma, Khawaja Nafay: పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ 2024లో అద్భుతంగా రాణిస్తున్న పాకిస్థాన్‌ యువ క్రికెటర్‌.. రోహిత్‌ శర్మ అంటే తనకెంతో ఇష్టమని, అతనే తన అభిమాన బ్యాటర్‌ అని పేర్కొన్నాడు. ఆ క్రికెటర్‌ ఎవరో ఇప్పుడు చూద్దాం..

Rohit Sharma, Khawaja Nafay: పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ 2024లో అద్భుతంగా రాణిస్తున్న పాకిస్థాన్‌ యువ క్రికెటర్‌.. రోహిత్‌ శర్మ అంటే తనకెంతో ఇష్టమని, అతనే తన అభిమాన బ్యాటర్‌ అని పేర్కొన్నాడు. ఆ క్రికెటర్‌ ఎవరో ఇప్పుడు చూద్దాం..

  • Published Feb 21, 2024 | 4:38 PMUpdated Feb 21, 2024 | 4:38 PM
నా ఫేవరేట్‌ క్రికెటర్‌ రోహిత్‌ శర్మ: పాకిస్థాన్‌ క్రికెటర్‌

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తన ఫేవరేట్‌ బ్యాటర్‌ అంటూ ఓ పాకిస్థాన్‌ యువ క్రికెటర్‌ సంచలన ప్రకటన చేశాడు. ప్రస్తుతం పాకిస్థాన్‌లో జరుగుతున్న పీఎస్‌ఎల్‌ 2024(పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌)లో అదరగొడుతున్న యువ క్రికెటర్‌ ఇలా.. రోహిత్‌ శర్మ తన ఫేవరేట్‌ బ్యాటర్‌ అని ప్రకటించడం వైరల్‌గా మారింది. ఎందుకంటే.. ఇండియా-పాకిస్థాన్‌కు పడదనే విషయం తెలిసిందే. భారత్‌-పాక్‌ క్రికెట్‌ మ్యాచ్‌ అంటే అది కేవలం మ్యాచ్‌ కాదు.. ఓ మినీ యుద్ధం. ప్రస్తుతం పాకిస్థాన్‌ ఆటగాళ్లుకు ఇండియాలో పర్యటించేందుకు అనుమతి కూడా లేదు. వరల్డ్‌ కప్‌ లాంటి మెగా ఈవెంట్స్‌ తప్పితే.. ద్వైపాక్షిక సిరీస్‌లు కూడా జరగడం లేదు.

ఇలాంటి పరిస్థితుల్లో క్రికెట్‌లో ఇప్పుడిప్పుడే అడుగులేస్తూ రాణిస్తున్న ఓ యువ క్రికెటర్‌ రోహిత్‌ శర్మ తన ఫేవరేట్‌ క్రికెట్‌ అని చెప్పి పాక్‌లో ప్రకంపనలు సృష్టించాడు. ఆ యువ క్రికెటర్‌ పేరు ఖవాజా నఫే. ఈ పాకిస్థాన్‌ యువ క్రికెటర్‌ తాజాగా పీఎస్‌ఎల్‌లో ఒక్క ఇన్నింగ్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ నెల 19న లాహోర్‌ కలందర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 31 బంతుల్లోనే 60 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ఒక్క సంచలన ఇన్నింగ్స్‌తో ఖవాజా పేరు పాకిస్థాన్‌ క్రికెట్‌ లోకంలో మారుమోగిపోతుంది. ఈ క్రమంలోనే తన అభిమాన క్రికెటర్ల గురించి అడగినప్పుడు ఖవాజా.. తనకు రోహిత్‌ శర్మ, బాబర్‌ అజమ్‌ అంటే ఇష్టమంటూ వెల్లడించాడు.

కాగా, టీమిండియా స్టార్‌ ఆటగాళ్లైన రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీలకు పాకిస్థాన్‌లో భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న విషయం తెలిసిందే. తాజాగా విరాట్‌ కోహ్లీకి కొడుకు పుట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌లోని కోహ్లీ అభిమానులు సంతోషంలో స్వీట్లు పంచుకుని సంబురాలు చేసుకున్నారు. ఇలా చాలా మంది పాకిస్థానీలు టీమిండియా క్రికెటర్లపై తమ అభిమానం ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఖవాజా తనకు రోహిత్ శర్మ ఫేవరేట్‌ బ్యాటర్‌ అంటూ పేర్కొన్నాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.