Somesekhar
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఫిబ్రవరి 23 నుంచి స్టార్ట్ కానున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ కు ఆటంకం కలిగిస్తామని నిషేధిత ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ ఓ బెదిరింపు వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఫిబ్రవరి 23 నుంచి స్టార్ట్ కానున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ కు ఆటంకం కలిగిస్తామని నిషేధిత ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ ఓ బెదిరింపు వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
Somesekhar
టీమిండియా-ఇంగ్లాండ్ మధ్య 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సిరీస్ లో 2-1తో ఆధిక్యంలో ఉంది భారత్. కీలకమైన నాలుగో టెస్ట్ లో గెలిచి సిరీస్ ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది టీమిండియా. ఇక ఈ మ్యాచ్ రాంచీ వేదికగా ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభం కానుంది. అయితే ఈ టెస్ట్ కు ఉగ్రవాదుల నుంచి బెదిరింపులు వచ్చాయి. మ్యాచ్ కు ఆటంకం కలిగిస్తామని నిషేధిత ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఫిబ్రవరి 23 నుంచి స్టార్ట్ కానున్న నాలుగో టెస్ట్ కు ఉగ్ర బెదిరింపులు వచ్చాయి. నిషేధిత ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ ఈ మ్యాచ్ కు ఆటంకం కలిగిస్తామని హెచ్చరిస్తూ.. ఓ వీడియోను పోస్ట్ చేశాడు. ఈ టెస్ట్ కు అంతరాయం కలిగించాలని సీపీఐ మావోయిస్ట్ పార్టీని కోరాడు. దీంతో రాంచీ పోలీసులు అలెర్ట్ అయ్యారు. స్టేడియం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. అదనంగా మరో వెయ్యి మంది పోలీసులను రంగంలోకి దించినట్లు రాంచీ సీనియర్ పోలీస్ ఆఫీసర్ ఒకరు తెలిపారు.
కాగా.. పన్నూన్ పై బెదిరింపుల కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా.. ఇటీవల ముగిసిన వరల్డ్ కప్ లో సైతం నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగే ఓ మ్యాచ్ కు కూడా పన్నూన్ ఇదే విధంగా బెదిరింపులు చేశాడు. ఇతడిపై ఇప్పటికే ఎన్నో కేసులు నమోదు అయ్యాయి. కెనడా, అమెరికా దేశాల పౌరసత్వం కలిగిన పన్నూన్.. పంజాబ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రత్యేక ఖలిస్తాన్ పేరుతో అరాచకాలు సృష్టిస్తూ ఉంటాడు. ఇతడిపై 2021లో ఎన్ఐఏ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ను సైతం జారీ చేసింది. అదీకాక యాంటి టెర్రర్ ఫెడరల్ ఏజెన్సీ 2019లోనే పన్నూన్ పై కేసు నమోదు చేసింది.
ఇదికూడా చదవండి: విధ్వంసానికి సెహ్వాగ్, గేల్ సిద్ధం! తొలి మ్యాచ్‌లో ముంబైతో తెలంగాణ ఢీ