iDreamPost

విధ్వంసానికి సెహ్వాగ్‌, గేల్‌ సిద్ధం! తొలి మ్యాచ్‌లో ముంబైతో తెలంగాణ ఢీ

  • Published Feb 21, 2024 | 6:47 PMUpdated Feb 21, 2024 | 6:47 PM

Virender Sehwag, Chris Gayle: మాజీ క్రికెటర్లు వీరేందర్‌ సెహ్వాగ్‌, క్రిస్‌ గేల్‌ ఎంతంటి విధ్వంసకర ఆటగాళ్లో తెలిసిందే. అలాంటి వాళ్లు మళ్లీ వస్తున్నారంటే.. గ్రౌండ్‌ ఉలిక్కిపడుతుంది. ఆ అరుదైన ఫైట్‌కి ఇండియనే వేదికగా కాబోతుంది. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

Virender Sehwag, Chris Gayle: మాజీ క్రికెటర్లు వీరేందర్‌ సెహ్వాగ్‌, క్రిస్‌ గేల్‌ ఎంతంటి విధ్వంసకర ఆటగాళ్లో తెలిసిందే. అలాంటి వాళ్లు మళ్లీ వస్తున్నారంటే.. గ్రౌండ్‌ ఉలిక్కిపడుతుంది. ఆ అరుదైన ఫైట్‌కి ఇండియనే వేదికగా కాబోతుంది. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

  • Published Feb 21, 2024 | 6:47 PMUpdated Feb 21, 2024 | 6:47 PM
విధ్వంసానికి సెహ్వాగ్‌, గేల్‌ సిద్ధం! తొలి మ్యాచ్‌లో ముంబైతో తెలంగాణ ఢీ

వీరేందర్‌ సెహ్వాగ్‌, క్రిస్‌ గేల్‌.. క్రికెట్‌ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేర్లు.. ప్రపంచ క్రికెట్‌పై తమదైన ముద్ర వేసిన ఈ మాజీ క్రికెటర్లు.. మరోసారి గ్రౌండ్‌లో దిగి తమ సత్తాచాటేందుకు సిద్ధం అవుతున్నారు. భారత్‌ వేదికగా వీఐపీఎల్‌(వెటరన్‌ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌) 2024 సీజన్‌ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మాజీ సూపర్‌ స్టార్‌ క్రికెటర్లు పాల్గొనే ఈ వెటరన్‌ లీగ్‌ ఈ నెల 23న ప్రారంభం కానుంది. ఈ లీగ్‌లో సెహ్వాగ్‌, గేల్‌తో పాటు హెర్షల్‌ గిబ్స్‌, సురేష్‌ రైనా, యూసుఫ్‌ పఠాన్‌ లాంటి మాజీ స్టార్‌ క్రికెటర్లు ఆడునున్నారు. మొత్తం ఆరు జట్లు ఈ లీగ్‌లో పాల్గొంటున్నాయి. అయితే.. ఈ లీగ్‌లోని అన్ని మ్యాచ్‌లను మొదట డెహ్రాడూన్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో నిర్వహించాలని అనుకున్నా.. కొన్ని అనివార్య కారణాల వల్ల గ్రేటర్‌ నోయిడాలోని షహీద్‌ విజయ్‌ సింగ్‌ పాథిక్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో నిర్వహించేందుకు అన్ని ఏర్పాటు చేశారు.

అయితే.. ఈ లీగ్‌లో తొలి మ్యాచ్‌ శుక్రవారం తెలంగాణ టైగర్స్‌, ముంబై ఛాంపియన్స్‌ మధ్య జరగనునుంది. తెలంగాణ టైగర్స్‌ టీమ్‌కు క్రిస్‌ గేల్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా.. ముంబై ఛాంపియన్స్‌కు వీరేందర్‌ సెహ్వాగ్‌ కెప్టెన్‌గా ఉన్నాడు. ఈ ఇద్దరు లెజెండ్స్‌ ఐపీఎల్‌లో పంజాబ్‌ జట్టుకు కలిసి ఆడిన విషయం తెలిసిందే. పైగా ఇద్దరిది ఒకటే బ్యాటింగ్‌ స్టైల్‌. ఫస్ట్‌ బాల్‌ నుంచే బౌలర్లపై విరుచుకుపడ్డం వీరి నైజం. అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగినంత కాలం.. విధ్వంసకర బ్యాటర్లుగా బౌలర్లను ఊచకోత కోశారు. ఆ తర్వాత ఐపీఎల్‌లో కూడా సత్తా చాటారు. ఇప్పుడు మళ్లీ చాలా కాలం తర్వాత ఈ ఇద్దరు ఆటగాళ్ల గ్రౌండ్‌లోకి దిగి.. క్రికెట్‌ అభిమానులకు వారి బ్యాటింగ్‌ విన్యాసాల విందు ఇవ్వనున్నారు.

ఇక ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న ఈ వెటరన్‌ లీగ్‌.. మొత్తం పది రోజుల పాటు జరగనుంది. కొన్ని మ్యాచ్‌లు రాత్రి 7 గంటల నుంచి ప్రారంభం కానుండగా.. మరికొన్ని మ్యాచ్‌లు మధ్యాహ్నం 2 గంటలకు మొదలుకానున్నాయి. ముంబై-తెలంగాణ మధ్య జరిగే తొలి మ్యాచ్‌ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లను డీడీ స్పోర్ట్స్‌, యూరో స్పోర్ట్స్‌, ఫ్యాన్‌ కోడ్‌ యాప్స్‌లో లైవ్‌ చూడొచ్చు. ఇక ఈ లీగ్‌లో పాల్గొంటున్న జట్లను ఒకసారి పరిశీలిస్తే.. ముంబై ఛాంపియన్స్‌, తెలంగాణ టైగర్స్‌, ఛత్తీస్‌గఢ్‌ వారియర్స్‌, వీవీఐపీ ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌ లెజెండ్స్‌, రెడ్‌ కార్పెట్‌ ఢిల్లీగా ఉన్నాయి. ఈ లీగ్‌ దాదాపు ఒక మినీ ఐపీఎల్‌లా సాగనుంది. ఫిబ్రవరి 23 నుంచి మార్చ్‌ 3 వరకు మ్యాచ్‌లు జరగనున్నాయి. మరి ఈ వెటరన్‌ క్రికెటర్ల ఆటను చూసేందుకు మీరు ఎదురుచూస్తున్నారా? మీ సపోర్ట్‌ ఎవరికో కామెంట్స్‌లో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి