iDreamPost
android-app
ios-app

IND vs ENG: ఇంగ్లండ్‌తో రెండో టెస్టు.. రోహిత్‌ కెప్టెన్సీపై మాజీ క్రికెటర్‌ విమర్శలు!

  • Published Feb 05, 2024 | 11:49 AM Updated Updated Feb 05, 2024 | 11:49 AM

ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కెప్టెన్సీపై విమర్శలు గుప్పించాడు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్.

ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కెప్టెన్సీపై విమర్శలు గుప్పించాడు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్.

IND vs ENG: ఇంగ్లండ్‌తో రెండో టెస్టు.. రోహిత్‌ కెప్టెన్సీపై మాజీ క్రికెటర్‌ విమర్శలు!

రోహిత్ శర్మ.. వన్డే వరల్డ్ కప్ 2023 తర్వాత దారుణంగా విఫలం అవుతూ వస్తున్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ తో పాటుగా 14 నెలల తర్వాత ఆఫ్గానిస్తాన్ తో టీ20 సిరీస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఈ సిరీస్ లో సైతం విఫలం అయ్యి.. విమర్శలు మూటగట్టుకున్నాడు. ఇక తాజాగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో కూడా తన పూర్ ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. బ్యాటింగ్ లోనే కాకుండా.. కెప్టెన్సీలో సైతం విఫలం అవుతూ వస్తున్నాడు. రెండో టెస్ట్ సందర్భంగా రోహిత్ సారథ్యాన్ని తప్పుపట్టాడు ఇంగ్లాండ్ మాజీ దిగ్గజ బ్యాటర్ కెవిన్ పీటర్సన్.

విశాఖ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ రసవత్తరంగా మారింది. ఇరు జట్లు గెలుపు కోసం హోరాహోరిగా పోరాడుతున్నాయి. ఇంగ్లాండ్ ఓపెనర్ జాక్ క్రాలీ టీమిండియా బౌలర్లను ఎదుర్కొంటూ.. సెంచరీ వైపు దూసుకెళ్తున్నాడు. కాగా.. ఈ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పూర్తిగా విఫలం అయ్యాడు. ఇటు బ్యాటింగ్ లో, అటు కెప్టెన్ గా రెండు విభాగాల్లో ఫెయిల్ అయ్యాడు. దీంతో అతడిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఈ మ్యాచ్ కు కామెంటేటర్ గా వ్యవహరిస్తున్న ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ రోహిత్ కెప్టెన్సీని విమర్శించాడు.

కాగా.. నాలుగో రోజు ఆట ప్రారంభించిన కొద్ది సేపటి తర్వాత రోహిత్ ఫీల్డ్ సెటప్ ను మార్చాడు. సాధారణంగా టెస్టుల్లో స్పిన్ వేసేటప్పుడు బ్యాటర్ చుట్టూ ఫీల్డర్లను మోహరిస్తారు. కానీ ఈ మ్యాచ్ లో రోహిత్ లా చేయలేదు. ఇదే విషయాన్ని పీటర్సన్ ప్రస్తావించాడు. “ఈ టెస్ట్ లో రోహిత్ కెప్టెన్సీ ఏమంత బాలేదు. అసలు ఫీల్డర్లను ఎందుకు దూరం పంపిచాడు. బ్యాటర్ల చుట్టూ ఎందుకు పెట్టలేదు.టెస్టుల్లో ఇంత లక్ష్యాన్ని ఎలా కాపాడుకోవాలో రోహిత్ కు తెలీదా? ఎందుకు ఇలాంటి కెప్టెన్సీ చేస్తున్నాడు. బెన్ స్టోక్స్ విషయమే తీసుకోండి అతడు అద్భుతమైన నాయకత్వం కలిగిఉన్నాడు” అంటూ రోహిత్ పై ప్రశ్నల వర్షం కురిపించాడు.

అయితే పీటర్సన్ అన్నట్లుగానే రోహిత్ తన ఫీల్డ్ సెటప్ ను వెరైటీగా పెట్టించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. నాలుగో రోజు లంచ్ బ్రేక్ సమయానికి ఇంగ్లాండ్ 6 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది. సెంచరీ వైపు దూసుకెళ్తున్న జాక్ క్రాలీని 73 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఎల్బీ రూపంలో బోల్తాకొట్టించాడు కుల్దీప్ యాదవ్. ఇంగ్లాండ్ విజయానికి ఇంకా 205 పరుగుల దూరంలో ఉండగా.. చేతిలో 4 వికెట్లు మాత్రమే ఉన్నాయి. మరి రోహిత్ కెప్టెన్సీపై పీటర్సన్ విమర్శలు గుప్పించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: Rohit Sharma: వీడియో: కళ్లు చెదిరే క్యాచ్‌ అందుకున్న రోహిత్‌! ఇలాంటివి రేర్‌