Kavya Maran Recommendations To BCCI: BCCIకి కావ్యా పాప 4 కండీషన్స్.. అమలు చేయాల్సిందేనంటూ వార్నింగ్!

BCCIకి కావ్యా పాప 4 కండీషన్స్.. అమలు చేయాల్సిందేనంటూ వార్నింగ్!

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ కో-ఓనర్ కావ్యా మారన్ ఇప్పుడు వార్తల్లో నిలిచారు. భారత క్రికెట్ బోర్డుకు ఆమె వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ కో-ఓనర్ కావ్యా మారన్ ఇప్పుడు వార్తల్లో నిలిచారు. భారత క్రికెట్ బోర్డుకు ఆమె వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.

ఒకవైపు టీమిండియా ఆడే మ్యాచులతో పాటు భారత క్రికెట్‌లో ఐపీఎల్‌కు సంబంధించిన విషయాలు కూడా చర్చనీయాంశంగా మారాయి. క్యాష్ రిచ్ లీగ్ నయా సీజన్‌కు ఇంకా చాలా టైమ్ ఉంది. మెగా ఆక్షన్ కూడా ఇప్పుడప్పుడే లేదు. కానీ ప్లేయర్ల రిటెన్షన్, శాలరీ పర్స్, కోచ్‌లు-ప్లేయర్ల మార్పు అంశాలతో ఐపీఎల్ ఇప్పుడు వార్తల్లో నిలుస్తోంది. మెగా లీగ్ ఫ్రాంచైజీ ఓనర్లతో నిన్న భారత క్రికెట్ బోర్డు పెద్దలు సమావేశం అయ్యారు. పైఅంశాల మీద వాళ్లతో డిస్కస్ చేశారు. ఈ మీటింగ్‌లో అందరి కంటే ఎక్కువగా సన్‌రైజర్స్ హైదరాబాద్ సహ యజమాని కావ్యా మారన్ హైలైట్ అయ్యారు. పలు అంశాల మీద ఆమె తన ఆలోచనలను కరాఖండీగా చెప్పారని తెలిసింది. ఆక్షన్ తర్వాత టోర్నీలో ఆడకుండా దూరంగా ఉండే ప్లేయర్లను బ్యాన్ చేయాల్సిందేనని బీసీసీఐ మీటింగ్‌లో ఆమె స్పష్టం చేశారని సమాచారం.

ఆక్షన్‌లో ఎంపికైన కొందరు ఆటగాళ్లు తమకు సరైన ధర దొరకలేదనే అసంతృప్తితో లీగ్‌కు దూరంగా ఉండటం వివాదాస్పదమైంది. గతేడాది జరిగిన మినీ ఆక్షన్‌లో రూ.1.5 కోట్ల ధరకు శ్రీలంక స్టార్‌ ఆల్‌రౌండర్‌ వనిందు హసరంగను సన్‌రైజర్స్‌ దక్కించుకుంది. అయితే గాయం కారణంగా చూపి అతడు ఈ సీజన్‌లో పాల్గొనలేదు. ఇదే విషయంపై సీరియస​ అయిన కావ్య పాప.. ఇలా వేలంలో ఎంపికైనా టీమ్స్‌కు ఆడని ఫారెన్‌ ప్లేయర్లను బ్యాన్‌ చేయాలని డిమాండ్‌ చేశారని తెలుస్తోంది. దీంతో పాటు బీసీసీఐకి ఆమె 4 కండీషన్స్‌ పెట్టారని సమాచారం. ప్రతి జట్టు నుంచి కనీసం 7 మంది ఆటగాళ్లను రీటెయిన్‌ చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఆమె కోరారట. ఈ ఏడు రిటెన్షన్స్‌లో ఓవర్సీస్‌, ఇండియన్‌, అన్‌క్యాప్డ్‌ ‌ప్లేయర్లు అందరూ ఉండేలా చూడాలన్నారట.

ఆక్షన్‌ సమయంలో అందరు ఆటగాళ్లతో రిటెన్షన్‌, ఆర్టీఎం గురించి డిస్కస్‌ చేసేందుకు పర్మిషన్‌ ఇవ్వాలని బీసీసీఐకి కావ్యా మారన్‌ విజ్ఞప్తి చేశారట. అలాగే మెగా ఆక్షన్‌ను ఇక మీదట ప్రతి 5 ఏళ్లకు ఒకసారి నిర్వహించాలని సూచించారట. దీంతో పాటు మరికొన్ని డిమాండ్లను కూడా ఆమె బోర్డు పెద్దల ముందు పెట్టారని సమాచారం. మిగతా ఫ్రాంచైజీల ఓనర్స్‌ కంటే కావ్యా పాప తాను అడగాలనుకున్నది సూటిగా, స్పష్టంగా అడిగేశారని వినికిడి. ఆమె డిమాండ్లలో బీసీసీఐ దేనికి ఓకే చెబుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక, బోర్డు మీటింగ్‌లో కచ్చితత్వంతో వ్యవహరించిన కావ్య.. ఓ విషయంలో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ యజమాని షారుక్‌ ఖాన్‌కు ఫుల్‌ సపోర్ట్‌ ఇచ్చారట. ఐపీఎల్‌-2025కి ముందు మెగా ఆక్షన్‌ ఎందుకు? మినీ వేలం చాలని షారుక్‌ సూచించారట. ఆయన ప్రతిపాదనను కావ్య మారన్‌ సమర్థించారని తెలుస్తోంది. మరి.. కావ్య కండీషన్స్‌కు బీసీసీఐ ఓకే అంటుందని మీరు భావిస్తే కామెంట్‌ చేయండి.

Show comments