iDreamPost

ఏం గుండెరా నీది.. ఆ కొట్టుడు ఏంది? 40 బంతుల్లోనే.. అదికూడా టీ20లో

  • Author Soma Sekhar Published - 09:30 PM, Mon - 28 August 23
  • Author Soma Sekhar Published - 09:30 PM, Mon - 28 August 23
ఏం గుండెరా నీది.. ఆ కొట్టుడు ఏంది? 40 బంతుల్లోనే.. అదికూడా టీ20లో

కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహారాజా టీ20 టోర్నీ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో దుమ్మురేపుతున్నాడు టీమిండియా బ్యాటర్ కరుణ్ నాయర్.. ఈ లీగ్ లో ఇప్పటికే లీడింగ్ స్కోరర్ గా ఉన్నాడు కరుణ్. తాజాగా గుల్భర్గా మిస్టిక్స్ తో(ఆగస్టు 28) జరిగిన రెండో సెమీఫైనల్లో పెను విధ్వంసం సృష్టించాడు కరుణ్ నాయర్. కేవలం 40 బంతుల్లోనే శతకం బాది మరోసారి తన సత్తా ఏంటో ప్రపంచానికి తెలియజేశాడు. దీంతో తన జట్టు అయిన మైసూర్ వారియర్స్ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి నిర్ణీత 20 ఓవర్లలో 248 పరుగులు చేసింది.

కరుణ్ నాయర్.. వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత ట్రిపుల్ సెంచరీ బాదిన రెండో టీమిండియా క్రికెటర్ గా చరిత్ర కెక్కిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత ఫామ్ కోల్పోవడంతో.. జట్టులో చోటును కోల్పోయాడు కరుణ్ నాయర్. ప్రస్తుతం మహారాజా టీ20 లీగ్ లో మైసూర్ వారియర్స్ జట్టు తరపున బరిలోకి దిగాడు ఈ యువ ఆటగాడు. కాగా.. ఈ టోర్నీలో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు కరుణ్. ఇప్పటికే లీగ్ టాప్ స్కోరర్ గా ఉన్న ఇతడు.. తాజాగా జరిగిన రెండో సెమీఫైనల్లో తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. గుల్భర్గా మిస్టిక్స్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం 40 బంతుల్లోనే సెంచరీ చేసి ఔరా.. అనిపించాడు. ఈ మ్యాచ్ లో మెుత్తంగా 42 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు, 9 సిక్సరల్లతో 107 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

ఇక కరుణ్ ఊచకోతకు ప్రత్యర్థి బౌలర్లు ధారళంగా పరుగులు సమర్పించుకున్నారు. అతడి బ్యాటింగ్ చేస్తుంటే ప్రత్యర్థి ఆటగాళ్లు ప్రేక్షక పాత్ర వహించడమే తప్ప.. మరో అవకాశం లేకుండా పోయింది. కరుణ్ నాయర్ కు తోడుగా సమర్థ్ 50 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 80 పరుగులు చేశాడు. ఎస్ కార్తీక్ కేవలం 23 బంతుల్లోనే 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 41 పరుగులు చేశాడు. అనంతరం 249 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుల్భర్గా టీమ్ పోరాడి ఓడిపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసి 36 పరుగుల తేడాతో ఓడిపోయింది. జట్టులో హెడ్లీ నొరోన్హా 34 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 61 పరుగులు చేయగా.. అబుల్ హసన్ ఖలీద్ 29 బంతుల్లో ఫోర్, 5 సిక్సర్లతో 54 పరుగులు చేశాడు. కాగా.. ఈ మ్యాచ్ లో కరుణ్ నాయర్ 254 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేయడం విశేషం.


ఇదికూడా చదవండి: ప్రజ్ఞానంద తల్లిదండ్రులకు ఆనంద్ మహీంద్రా మర్చిపోలేని గిఫ్ట్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి