iDreamPost

ప్రజ్ఞానంద తల్లిదండ్రులకు ఆనంద్ మహీంద్రా మర్చిపోలేని గిఫ్ట్!

  • Author singhj Updated - 07:31 PM, Mon - 28 August 23
  • Author singhj Updated - 07:31 PM, Mon - 28 August 23
ప్రజ్ఞానంద తల్లిదండ్రులకు ఆనంద్ మహీంద్రా మర్చిపోలేని గిఫ్ట్!

మన దేశంలో అత్యుత్తమ ప్రతిభ కలిగిన క్రీడాకారులు చాలా మంది ఉన్నారు. తమ అద్భుతమైన ప్రతిభతో, ఆటతీరుతో భారత్​కు విజయాలు అందిస్తున్న వాళ్ల లిస్టు పెద్దగానే ఉంది. అయితే వీరిలో ఎక్కువగా క్రికెటర్ల గురించే అందరూ మాట్లాడుకుంటారు. భారత్​లో క్రీడలు అంటే ఒక్క క్రికెట్ అనే చాలా మంది అనుకుంటారు. కానీ జెంటిల్మన్​ గేమ్​ కాకుండా కబడ్డీ, హాకీ, చెస్, కుస్తీ, అథ్లెటిక్స్, బాక్సింగ్.. ఇలా చాలా ఆటల్లో భారతీయ క్రీడాకారులు అద్వితీయ ప్రతిభతో అంతర్జాతీయ వేదికపై దేశ గౌరవాన్ని, ప్రతిష్టను ఇనుమడింజేస్తున్నారు. అయితే క్రికెటర్లతో పోలిస్తే వారికి అంతగా ప్రాచుర్యం, పేరు దక్కకపోవడం గమనార్హం.

ఇక, ఇటీవల ముగిసిన ఫిడే వరల్డ్ కప్​లో ప్రపంచ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్​సన్​ను ముప్పుతిప్పలు పెట్టాడు భారత గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద. ఈ 18 ఏళ్ల యువకుడి ఆటకు అందరూ ఆశ్చర్యపోయారు. అలాంటి ప్రజ్ఞానంద తల్లిదండ్రులకు తీపి కబురు అందించారు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా. సాధారణంగా స్పోర్ట్స్​లో బెస్ట్ పెర్ఫార్మెన్స్​ ఇచ్చిన ప్లేయర్లకు మహీంద్ర అండ్ మహీంద్రకు చెందిన స్పెషల్ ఎడిషన్ కార్లను గిఫ్ట్​గా ఇవ్వడం ఆనంద్ మహీంద్రాకు అలవాటు. అయితే తాజాగా ప్రజ్ఞానంద విషయంలో మాత్రం ఆయన కాస్త వినూత్నంగా ఆలోచించారు. ప్రజ్ఞానంద పేరెంట్స్​కు మహీంద్ర ఎక్స్​యూవీ 400 ఈవీని బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించారు.

ప్రజ్ఞానంద తల్లిదండ్రులు నాగలక్ష్మీ, రమేశ్​బాబుకు ఆల్ ఎలక్ట్రిక్ ఎస్​యూవీ ఎక్స్​యూవీ400 ప్రత్యేక ఎడిషన్​ను త్వరలో అందించనున్నట్లు మహీంద్ర కంపెనీకి చెందిన రాజేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆనంద్ మహీంద్రా అందరు తల్లిదండ్రులకు ఒక చక్కటి సలహా ఇచ్చారు. పిల్లలకు వీడియో గేమ్​లకు బదులుగా మేధస్సును పెంచే చెస్ ఆటను నేర్పించాలని సలహా ఇచ్చారు. కాగా, ఈ టోర్నమెంట్​లో తన అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకొని, ఫైనల్​లో కార్ల్​సన్​తో పోరాడి ఓడిన ప్రజ్ఞానందను అందరూ అభినందిస్తున్నారు. ఫ్యూచర్​లో అతడు మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి