Tirupathi Rao
Kapil Dev Seeking Help From BCCI: కపిల్ దేవ్ ఎమోషనల్ అయ్యాడు. బీసీసీఐకి ఒక లెటర్ కూడా రాశాడు. తన మిత్రుడిని కాపాడాలని రిక్వెస్ట్ పెట్టుకున్నాడు. బీసీసీఐ స్పందించి ఆర్థికసాయం చేయాలని కోరుతున్నాడు.
Kapil Dev Seeking Help From BCCI: కపిల్ దేవ్ ఎమోషనల్ అయ్యాడు. బీసీసీఐకి ఒక లెటర్ కూడా రాశాడు. తన మిత్రుడిని కాపాడాలని రిక్వెస్ట్ పెట్టుకున్నాడు. బీసీసీఐ స్పందించి ఆర్థికసాయం చేయాలని కోరుతున్నాడు.
Tirupathi Rao
కపిల్ దేవ్ ఎమోషనల్ అయ్యాడు. తన మిత్రుడిని కాపాడుకోవడం కోసం బీసీసీఐకి స్పెషల్ రిక్వెస్ట్ పెట్టాడు. మాజీ క్రికెటర్, హెడ్ కోచ్ అన్షుమాన్ గైక్వాడ్ కోసమే కపిల్ దేవ్ ఇంతలా పాకులాడుతున్నాడు. అన్షుమాన్ గైక్వాడ్ బ్లడ్ క్యాన్సర్ కి చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నాడు. లండన్ లోని కింగ్స్ కాలేజ్ హాస్పిటల్ లో బ్లడ్ క్యాన్సర్ కు చికిత్స పొందుతున్నాడు. ఇప్పుడు గైక్వాడ్ అన్షుమాన్ పరిస్థితిపై కపిల్ దేవ్ ఆవేదన వ్యక్తం చేశాడు. అతనిడి పరిస్థితి చూస్తే బాధగా ఉందని తెలిపాడు. అన్షుమాన్ కోసం అందరూ ముందుకు రావాలి అని కోరాడు. బీసీసీఐ కూడా ఆర్థికంగా ఆదుకోవాలి అని అని విజ్ఞప్తి చేశాడు.
కపిల్ దేవ్- అన్షుమాన్ గైక్వాడ్ ఎన్నో మ్యాచులు ఆడారు. అన్షుమాన్ గురించి మాట్లాడుతూ.. “అన్షుని ఇలాంటి పరిస్థితుల్లో చూసి తట్టుకోలేకపోతున్నాను. అన్షుమాన్ ని చూస్తే బాధగా ఉంది. అన్షుకే కాదు.. ఎవరికీ ఇలాంటి ఒక పరిస్థితి రాకూడదు. అతని చికిత్సకు కావాల్సిన నిధులను సేకరిస్తున్నాం. నాతో పాటుగా.. గావస్కర్, సందీప్ పాటిల్, దిలీప్ వెంగ్ సర్కార్, రవిశాస్త్రి, మదన్ లాల్, కీర్తి ఆజాద్, మోహిందర్ అమర్ నాథ్ ప్రయత్నాలు చేస్తున్నాం. మాతోపాటుగా.. బీసీసీఐ కూడా ఆర్థికసాయం చేస్తే బాగుంటుంది. మన మాజీ కోచ్ ని మనం కాపాడుకోవాలి. మేము ఎవరినీ బలవంతం చేయడం లేదు. కావాలంటే బీసీసీఐ నా పెన్షన్ డబ్బు తీసుకోవాలి. మన టీమ్ కోసం అన్షుమాన్ గైక్వాడ్ చాలా సార్లు టఫ్ బౌలర్స్ ను ఎదిరించి నిలబడ్డాడు. ఛాతీ, ముఖంపై దెబ్బలు తిన్నాడు. అన్షుమాన్ గైక్వాడ్ కోసం మనమందరం నిలబడాల్సిన అవసరం వచ్చింది. అతనికి అండగా ఉందాం” అంటూ కపిల్ దేవ్ ఎమోషనల్ అయ్యాడు.
అంతేకాకుండా.. కపిల్ దేవ్ కొన్ని లోపాలను ఎత్తి చూపాడు. ఇప్పటి బోర్డు పరిస్థితి, వేతనాలు.. వారి కాలంలో ఉన్న పరిస్థితుల గురించి ప్రస్తావించాడు. ఇప్పుడంటే ఆటగాళ్లే కాదు.. సపోర్ట్ స్టాఫ్ కి కూడా మంచి వేతనాలు ఉన్నాయన్నాడు. అయితే తమ రోజుల్లో ఇలాంటి పరిస్థితి లేదని తెలిపాడు. అందుకే మాజీ ఆటగాళ్ల సంరక్షణ బాధ్యతను బోర్డు తీసుకోవాలి. కానీ, మన దగ్గర అలాంటి వ్యవస్థ లేదని కపిల్ దేవ్ విచారం వ్యక్తం చేశాడు. అందుకే బీసీసీఐ ఒక ట్రస్టు ఏర్పాటు చేస్తే బాగుంటుందని అభిప్రాయ పడ్డాడు. అన్షుమాన్ గైక్వాడ్ టీమిండియా తరఫున 40 టెస్టులు, 15 వన్డేలు ఆడాడు. అలాగే టీమిండియాకి రెండుసార్లు హెడ్ కోచ్ గా వ్యవహరించాడు.