iDreamPost
android-app
ios-app

ఇండియాతో సెమీస్.. కేన్ విలియమ్సన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

  • Author Soma Sekhar Updated - 04:03 PM, Sun - 12 November 23

వరల్డ్ కప్ సెమీఫైనల్స్ లో టీమిండియా-న్యూజిలాండ్ జట్లు తలపడటం దాదాపు ఖాయం అవ్వడంతో.. ఈ మ్యాచ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు కివీస్ సారథి కేన్ విలియమ్సన్.

వరల్డ్ కప్ సెమీఫైనల్స్ లో టీమిండియా-న్యూజిలాండ్ జట్లు తలపడటం దాదాపు ఖాయం అవ్వడంతో.. ఈ మ్యాచ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు కివీస్ సారథి కేన్ విలియమ్సన్.

  • Author Soma Sekhar Updated - 04:03 PM, Sun - 12 November 23
ఇండియాతో సెమీస్.. కేన్ విలియమ్సన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

వరల్డ్ కప్ తుది దశకు చేరుకుంటోంది. ఇప్పటికే భారత్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు సెమీస్ చేరగా.. నాలుగో బెర్త్ కోసం రసవత్తర పోరు ప్రారంభమైంది. అయితే ఈ పోరులో పాకిస్థాన్, ఆప్గానిస్థాన్ జట్లను కాదని న్యూజిలాండ్ ముందంజలో ఉంది. తాజాగా బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్ లో శ్రీలంకను 5 వికెట్లతో చిత్తుచేసి.. సెమీస్ ఆశలను సులభతరం చేసుకోవడమే కాకా.. దాదాపు ఖాయం చేసుకుంది. ఈ విజయంతో ఇప్పటి వరకు కివీస్ ఆడిన 9 మ్యాచ్ ల్లో 5 గెలుపులతో 10 పాయింట్లు సాధించి.. ప్రస్తుతానికి పాయింట్ల పట్టికలో నాలుగో ప్లేస్ లో ఉంది. నెట్ రన్ రేట్ కూడా మిగతా రెండు జట్ల కంటే ఎక్కువే ఉండటంతో.. కివీస్ సెమీస్ చేరడం ఖాయం. ఇక ఇదే విషయంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు బ్లాక్ క్యాప్ సారథి కేన్ మామ.

వరల్డ్ కప్ 2023లో సెమీస్ లో టీమిండియా ప్రత్యర్థి ఎవరో ఖరారు అయిపోయింది. గురువారం జరిగిన మ్యాచ్ లో శ్రీలంకపై న్యూజిలాండ్ 5 వికెట్లతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో సెమీస్ లో టీమిండియతో తలపడబోతోంది కివీస్ టీమ్. ఈ నేపథ్యంలో లంకతో మ్యాచ్ ముగిసిన అనంతరం మాట్లాడిన కేన్ విలియమ్సన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. కేన్ మామ మాట్లాడుతూ..”టీమిండియాతో వరల్డ్ కప్ లో సెమీఫైనల్ ఆడటం మాకెప్పుడు ప్రత్యేకమే. అయితే ఇది మాకు కఠిన సవాల్ తో కూడుకున్నదే. విజయం కోసం మా వంతు ప్రయత్నం మేం చేస్తాం” అంటూ చెప్పుకొచ్చాడు బ్లాక్ క్యాప్ కెప్టెన్.

కాగా.. టీమిండియా తన పగతీర్చుకునే టైమ్ వచ్చిందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. 2019 ప్రపంచ కప్ సెమీఫైనల్లో కివీస్ చేతిలో టీమిండియా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆ పరాజయానికి ఇప్పుడు ప్రతీకారం తీర్చుకునే ఛాన్స్ వచ్చిందని, ఈసారి తప్పకుండా కివీస్ ను ఓడించి.. విశ్వసమరం ఫైనల్లోకి టీమిండియా వెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు భారత క్రికెట్ ఫ్యాన్స్. అయితే కివీస్ కాకుండా సెమీస్ కు పాక్ వెళ్లాలంటే కనీవినీ ఎరుగని అద్భుతమే జరగాలి. అదేంటంటే? పాక్ తన నెక్ట్స్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై 274 రన్స్ తేడాతో విజయం సాధించాలి. ఒకవేళ ఇంగ్లాండ్ ముందు బ్యాటింగ్ చేస్తే.. పాక్ ఆ లక్ష్యాన్ని కేవలం 2.3 ఓవర్లలోనే ఛేదించాలి. ఇది సాధ్యమయ్యే పనికాదు. దీంతో సెమీస్ లో ఇండియా-కివీస్ తలపడటం ఖాయమని చెప్పుకొస్తున్నారు క్రీడాపండితులు.