Somesekhar
ఆ టీమిండియా ప్లేయర్ చెప్పిన మాటల కారణంగానే నేను హెడ్ కోచ్ పదవిని స్వీకరించడం లేదని ఆసీస్ లెజెండ్ షాకింగ్ విషయాలు వెల్లడించాడు. ఆ భారత ప్లేయర్ ఎవరు? ఏం చెప్పాడు? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఆ టీమిండియా ప్లేయర్ చెప్పిన మాటల కారణంగానే నేను హెడ్ కోచ్ పదవిని స్వీకరించడం లేదని ఆసీస్ లెజెండ్ షాకింగ్ విషయాలు వెల్లడించాడు. ఆ భారత ప్లేయర్ ఎవరు? ఏం చెప్పాడు? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Somesekhar
ప్రస్తుతం బీసీసీఐ ముందున్న ఏకైక లక్ష్యం.. టీమిండియా హెడ్ కోచ్ ను నియమించడం. ఇది పెద్ద సవాల్ తో కూడుకున్న పని. ప్రపంచ క్రికెట్ ను శాసిస్తూ.. ముందుకెళ్తున్న భారత జట్టుకు హెడ్ కోచ్ ను ఎంపిక చేయడం, దానిని నిర్వహించడం కత్తిమీదసామే. అందుకే బీసీసీఐ ఈ విషయంలో ఆచితూచి ముందుకు అడుగులు వేస్తోంది. ఇక హెడ్ కోచ్ పదవి కోసం ఎంతో మంది ముందుకు వస్తారని అంతా భావించారు. కానీ అనూహ్యంగా దిగ్గజాలు ఎవ్వరూ ముందుకు రాకపోవడం విచారకరం. మే 27న దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ అయినప్పటికీ.. ఇప్పటి వరకు ఎవరు దరఖాస్తు చేశారో తెలీదు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా లెజెండ్ జస్టిన్ లాంగర్ షాకింగ్ విషయాలను వెల్లడించాడు.
టీమిండియా హెడ్ కోచ్ పదవి రేసు నుంచి స్టీఫెన్ ఫ్లెమింగ్, రికీ పాంటింగ్, మహేళ జయవర్థనే నిష్క్రమించినట్లు సమాచారం. ఈ ముగ్గురు లెజెండ్స్ భారత ప్రధాన కోచ్ పదవిని స్వీకరించడానికి నిరాకరించారు. వ్యక్తిగత కారణాల వల్ల వారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ జాబితాలోకి చేరాడు మరో దిగ్గజం. ఆస్ట్రేలియా లెజెండ్ జస్టిన్ లాంగర్ తొలుత టీమిండియా హెడ్ కోచ్ పదవిని స్వీకరించడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాడు. కానీ టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ చెప్పిన మాటలు విని తాను హెడ్ కోచ్ పదవి తీసుకోవడం లేదని లాంగర్ చెప్పుకొచ్చాడు. ఇంతకీ రాహుల్ ఆసీస్ దిగ్గజానికి ఏం చెప్పాడంటే?
“ప్రస్తుతం మీరు ఓ ఐపీఎల్ టీమ్ కు కోచ్ గా ఉన్నారు. ఇక్కడ ఉండే ప్రెజర్, రాజకీయాల కంటే వెయ్యిరేట్లు ఎక్కువ టీమిండియా హెడ్ కోచ్ పదవిలో ఉంటాయి. ఆ ఒత్తిడిని, పాలిటిక్స్ ను తట్టుకుని నిలబడతారనుకుంటేనే కోచ్ పదవిని తీసుకోండి. నేను మీకిచ్చే గొప్ప సలహా ఇదే” అంటూ కేఎల్ రాహుల్ తనతో చెప్పాడని లాంగర్ చెప్పుకొచ్చాడు. పైగా సంవత్సరానికి 10 నెలల ఫ్యామిలీని విడిచిపెట్టి ఉండటం కూడా విదేశీ దిగ్గజాలు వెనకడు వేయడానికి ఓ కారణం. దీంతో స్వదేశీ కోచ్ నే తీసుకోవాలని బీసీసీఐ ఆలోచనలో పడినట్లు సమాచారం. మరి వరుసగా విదేశీ దిగ్గజాలు హెడ్ కోచ్ పదవి చేపట్టడానికి వెనకడు వేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.