Josh Inglis: జోష్ ఇంగ్లిస్ మెరుపు సెంచరీ.. స్కాట్లాండ్ బౌలర్లకు నరకం చూపించాడు!

Josh Inglis, AUS vs SCO: ఆస్ట్రేలియా పించ్ హిట్టర్ జోష్ ఇంగ్లీష్​ మరోమారు చెలరేగిపోయాడు. స్కాట్లాండ్ జట్టు బౌలర్లకు నరకం చూపించాడు. ఊచకోత అంటే ఎలా ఉంటుందో వాళ్లకు ప్రత్యక్షంగా చూపించాడు.

Josh Inglis, AUS vs SCO: ఆస్ట్రేలియా పించ్ హిట్టర్ జోష్ ఇంగ్లీష్​ మరోమారు చెలరేగిపోయాడు. స్కాట్లాండ్ జట్టు బౌలర్లకు నరకం చూపించాడు. ఊచకోత అంటే ఎలా ఉంటుందో వాళ్లకు ప్రత్యక్షంగా చూపించాడు.

ఆస్ట్రేలియా జట్టు నిండా హిట్టర్లే అనేది తెలిసిందే. ఒకరు పోతే మరొకరు రెడీగా ఉంటారు. ప్రత్యర్థులపై విరుచుకుపడే అవకాశం ఎప్పుడు వస్తుందా అని కాచుకొని ఉంటారు. ఒకర్ని ఆపినా ఇంకొకరు విరుచుకుపడతారు. ఇప్పుడు స్కాట్లాండ్ టీమ్ పరిస్థితి అలాగే ఉంది. విధ్వంసక ఓపెనర్ ట్రావిస్ హెడ్​తో పాటు చిచ్చరపిడుగు జేక్ ఫ్రేజర్ మెక్​గర్క్​ను ఆ టీమ్ కంట్రోల్ చేసింది. ఇద్దర్నీ 23 పరుగుల్లోపే ఔట్ చేసింది. కానీ తర్వాత వస్తున్న తుఫాన్​ను ఆపలేకపోయింది. పించ్ హిట్టర్ జోష్ ఇంగ్లిస్​ను నియంత్రించలేకపోయింది. అతడు సృష్టించిన పరుగుల సునామీలో కొట్టుకుపోయింది. ఈ స్టార్ బ్యాటర్ మెరుపు సెంచరీతో స్కాట్లాండ్​ను వణికించాడు.

స్కాట్లాండ్ బౌలర్లకు నరకం చూపించాడు ఇంగ్లిస్. 43 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు. తద్వారా ఆసీస్ తరఫున టీ20ల్లో అత్యంత వేగంగా సెంచరీ కొట్టిన బ్యాటర్​గా రికార్డు క్రియేట్ చేశాడు. వచ్చిన బంతిని వచ్చినట్లు స్టాండ్స్​లోకి పంపించాడు. కనికరం లేకుండా ప్రత్యర్థి జట్టును నిర్దాక్షిణ్యంగా శిక్షించాడు. ఊచకోత అంటే ఎలా ఉంటుందో వాళ్లకు ప్రత్యక్షంగా చూపించాడు. ఎవరు బౌలింగ్​కు వచ్చినా వాళ్లకు భారీ షాట్లతోనే వెల్​కమ్ చెప్పాడు. ఓవరాల్​గా 7 బౌండరీలు బాదిన ఈ కంగారూ హిట్టర్.. 7 భారీ సిక్సులు కొట్టాడు. మొత్తంగా 49 బంతుల్లో 103 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. 23 పరుగులకే ఇద్దరు ఓపెనర్లు పెవిలియన్ చేరడంతో క్రీజులోకి వచ్చిన ఇంగ్లిస్ మీద ఇన్నింగ్స్​ను నడిపించే బాధ్యత పడింది. అతడు ఈ రెస్పాన్సిబిలిటీని చక్కగా నిర్వర్తించాడు. కామెరాన్ గ్రీన్ (29 బంతుల్లో 36), మార్కస్ స్టొయినిస్ (20 బంతుల్లో 20) అండతో స్కోరు బోర్డును బుల్లెట్ స్పీడ్​తో పరుగులు పెట్టించాడు.

నాలుగో ఓవర్​లో క్రీజులోకి వచ్చిన ఇంగ్లిస్ 19వ ఓవర్ చివరి బంతికి ఔట్ అయ్యాడు. అతడు ఉన్నంత సేపు పరుగులు వస్తూనే ఉన్నాయి. ఎడాపెడా బౌండరీలు, సిక్సులు బాదుతూ ప్రత్యర్థి బౌలర్లతో ఓ ఆటాడుకున్నాడీ కంగారూ స్టార్. ముఖ్యంగా బ్రాడ్ వీల్, మార్క్ వాట్ బౌలింగ్​లో అతడు భారీగా పరుగులు పిండుకున్నాడు. మిగతా వారిని కూడా వదిలిపెట్టకుండా సాధ్యమైనన్ని రన్స్ రాబట్టాడు. ఇంగ్లిస్ తుఫాన్ ఇన్నింగ్స్​తో ఆస్ట్రేలియా ఓవర్లన్నీ ముగిసేసరికి 4 వికెట్లకు 196 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్​కు దిగిన స్కాట్లాండ్ ప్రస్తుతం 2 ఓవర్లకు వికెట్ నష్టానికి 20 పరుగులతో ఉంది. జార్జ్ మున్సే (19 నాటౌట్), బ్రెండన్ మెక్​ముల్లెన్ (0 నాటౌట్) క్రీజులో ఉన్నారు. మూడు టీ20ల ఈ సిరీస్ ఫస్ట్ మ్యాచ్​లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఈ మ్యాచ్​లోనూ నెగ్గితే సిరీస్ ఆ టీమ్ సొంతమవుతుంది. మరి.. ఇంగ్లిస్ విధ్వంసక బ్యాటింగ్​పై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

Show comments