SNP
Jonny Bairstow: ఇండియాతో ఐదో టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్ ధర్మశాలలో చివరి టెస్ట్ ఆడనుంది. ఈ టెస్ట్ బెయిర్ స్టో జీవితంలో చిరస్థాయిగా మిగిలిపోనుంది. ఎందుకంటే ఇది అతనికి వందో టెస్ట్. ఈ సందర్భంగా బెయిర్‌స్టో ఎమోషనల్ తన తల్లి గురించి ఎమోషనల్ అయ్యాడు..
Jonny Bairstow: ఇండియాతో ఐదో టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్ ధర్మశాలలో చివరి టెస్ట్ ఆడనుంది. ఈ టెస్ట్ బెయిర్ స్టో జీవితంలో చిరస్థాయిగా మిగిలిపోనుంది. ఎందుకంటే ఇది అతనికి వందో టెస్ట్. ఈ సందర్భంగా బెయిర్‌స్టో ఎమోషనల్ తన తల్లి గురించి ఎమోషనల్ అయ్యాడు..
SNP
ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ జానీ బెయిర్ స్టో టెస్ట్ క్రికెట్‌లో అరుదైన ఘనతను అందుకోనున్నాడు. భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నాలుగు టెస్టులు ముగిశాయి. ఈ నెల 7 నుంచి ధర్మశాల వేదికగా ఈ రెండు జట్ల మధ్య చివరిదైన ఐదో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. 3-1తో టీమిండియా సిరీస్ కైవసం చేసుకోవడంతో చివరి టెస్ట్ నామమాత్రంగా మారింది. కానీ, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో ముందుండాలంటే ఈ టెస్ట్ కూడా ఇరు జట్లకు ముఖ్యమే. అదే కాకుండా ఈ టెస్టుకు మరో ప్రత్యేకత ఉంది. అదేంటంటే.. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్, ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జానీ బెయిర్ స్టో తమ వందో టెస్ట్ మ్యాచ్‌ను ఆడనున్నారు. దీంతో.. ఈ మ్యాచ్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇలా వందో టెస్ట్ ఆడబోతున్న సందర్భంగా జానీ బెయిర్ స్టో ఎమోషనల్ అయ్యాడు. తన వందో టెస్టును తన తల్లికి అంకితం ఇస్తున్నట్లు వెల్లడించాడు. ఈ సందర్భంగా తన జీవితానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలతో పాటు కన్నీళ్ల పెట్టించే అంశాలను కూడా ప్రస్తవించారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
జానీ బెయిర్ స్టో.. 2011 సెప్టెంబర్ 16న ఇండియాతో వన్డే మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. ఆ వెంటనే టీ20ల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. 2012 మే 17న వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్‌తో సాంప్రదాయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. క్రికెట్‌కు పుట్టినిల్లు అయిన ఇంగ్లండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. ఆ జట్టుకు తొలి వరల్డ్ కప్ అందించడంతో భాగమయ్యాడు. ఇంటర్నేషనల్ క్రికెట్‌లోనే కాకుండా.. ఐపీఎల్‌లోనూ తన సత్తా చాటాడు. ముఖ్యంగా మన హోం టీమ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫునే ఎంట్రీ ఇచ్చి అదరగొట్టాడు. తన 13 ఏళ్ల జర్నీలో ఎన్నో అద్భుతమైన మ్యాచ్‌లు ఆడిన బెయిర్‌స్టో.. తన కెరీర్‌లో వందో టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధం అవుతున్నాడు.
ఏ క్రికెటర్‌కైనా వందో టెస్ట్ మ్యాచ్ అనేది ఎంతో ప్రత్యేకం. చాలా తక్కువ మంది క్రికెటర్లు మాత్రమే వంద టెస్టులు ఆడారు. ఇంగ్లండ్ తరఫున వంద టెస్టులు ఆడిన 17వ ఆటగాడిగా బెయిర్ స్టో నిలువనున్నాడు. ఈ నేపథ్యంలోనే తన వందో టెస్టు తన తల్లికి అంకితం ఇస్తున్నట్లు బెయిర్ స్టో వెల్లడించాడు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ.. ‘మా నాన్న నా 8వ ఏటనే ఆత్మహత్య చేసుకున్నాడు. అలాంటి పరిస్థితుల్లో మా అమ్మ ధైర్యం కోల్పోకుండా మమ్మల్ని పోషించింది. రోజుకు మూడు చోట్ల పనులు చేస్తూ.. మమ్మల్ని ఇంత వాళ్లను చేసింది. ఆమెకు రెండు సార్లు బ్రెస్ట్ క్యాన్సర్ కూడా వచ్చింది. అయినా కూడా మా కోసం అన్ని తట్టుకుని నిలబడి.. మమ్మల్ని ఈ స్థాయిలో ఉంచింది. అందుకే నా వందో టెస్ట్ మా అమ్మకే అంకితం’ అంటూ బెయిర్ స్టో ఎమోషనల్ అయ్యాడు.
నిజంగా బెయిర్ స్టో తల్లికి హ్యాట్సాఫ్ చెప్పాల్సింది. పిల్లలు చాలా చిన్న వయసులో ఉండగానే భర్త ఆత్మహత్య చేసుకుని చనిపోతే.. ఏ మహిళ అయినా మానసికంగా కుంగిపోతుంది. కానీ, బెయిర్ స్టో తల్లి మాత్రం.. తన పిల్లల కోసం బాధనంతా దిగమింగుకుని, ఓ పోరాట యోధురాలిలా జీవితంలో తన పిల్లల కోసం రెక్కలు ముక్కలు చేసుకుని వాళ్లను పోషించింది. అందుకే ఏదో సినిమాలో చెప్పినట్లు.. తల్లిని మించి యోధులు ఎవరూ లేరు అనిపిస్తోంది. మరి ఒక స్టార్ క్రికెటర్ సక్సెస్ వెనుక ఓ తల్లి కష్టం ఇంతలా ఉండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Bairstow said “My 100th Test Cap is for my mother, my mum is the embodiment of strength – she worked three jobs & had two kids that were under 10 at difficult time – She had cancer twice, she is a bloody strong woman to get through that twice”. [Telegraph Sport] pic.twitter.com/JcWiPX9gIw
— Johns. (@CricCrazyJohns) March 4, 2024