iDreamPost
android-app
ios-app

విచిత్రంగా ఔటైన జో రూట్.. వైరలవుతున్న వీడియో!

  • Author Soma Sekhar Published - 04:45 PM, Wed - 8 November 23

ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ అయిన జో రూట్ ను అద్భుతమైన బాల్ తో బోల్తాకొట్టించాడు డచ్ బౌలర్ వాన్ బీక్. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ అయిన జో రూట్ ను అద్భుతమైన బాల్ తో బోల్తాకొట్టించాడు డచ్ బౌలర్ వాన్ బీక్. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  • Author Soma Sekhar Published - 04:45 PM, Wed - 8 November 23
విచిత్రంగా ఔటైన జో రూట్.. వైరలవుతున్న వీడియో!

ప్రపంచ కప్ లో ఇంటిదారి పట్టిన తొలి టీమ్ గా చెత్త రికార్డును మూటగట్టుకుంది డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్. ఈ వరల్డ్ కప్ లో దారుణంగా విఫలం అయిన ఇంగ్లీష్ జట్టు 7 మ్యాచ్ ల్లో కేవలం ఒకే ఒక్క విజయంతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. ఇక తాజాగా నెదర్లాండ్స్ తో నామమాత్రపు మ్యాచ్ లో తలపడుతోంది ఇంగ్లాండ్. ఇక ఈ మ్యాచ్ లో ఓ విచిత్రమైన ఔట్ చోటుచేసుకుంది. ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ అయిన జో రూట్ ను అద్భుతమైన బాల్ తో బోల్తాకొట్టించాడు డచ్ బౌలర్ వాన్ బీక్. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వరల్డ్ కప్ లో భాగంగా పూణే వేదికగా ఇంగ్లాండ్-నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన డిఫెండింగ్ ఛాంపియన్ బ్యాటింగ్ ను ఎంచుకుంది. బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లీష్ టీమ్ భారీ స్కోర్ వైపు దూసుకెళ్తోంది. తొలుత డచ్ బౌలర్లు ఇబ్బంది పెట్టినప్పటికీ.. డేవిడ్ మలన్(87) పరుగులతో రాణించి జట్టు భారీ స్కోర్ సాధించడానికి పునాది వేశాడు. మరో ఓపెనర్ బెయిర్ స్టో(15) విఫలం అయినప్పటికీ డేవిడ్ మలన్ చెలరేగాడు. బెయిర్ స్టోను ఆర్యన్ దత్ అవుట్ చేయగా.. క్రీజ్ లోకి వచ్చిన జో రూట్ తో ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు మలన్. కానీ రూట్ ను ఓ సూపర్ డెలివరీతో పెవిలియన్ కు పంపించాడు వాన్ బీక్.

ఇన్నింగ్స్ 21వ ఓవర్ లో బౌలింగ్ కు వచ్చాడు వాన్ బీక్. ఈ ఓవర్ రెండో బంతిని స్లో బాల్ వేయగా.. దానిని రివర్స్ స్వీప్ చేయడానికి ప్రయత్నించాడు రూట్. కానీ బాల్ అనూహ్యంగా బౌన్స్ కాకుండా అతడి కాళ్ల మధ్యలో నుంచి వెళ్లి వికెట్లను పడగొట్టింది. దీంతో 28 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రూట్ నిరాశగా పెవిలియన్ చేరాడు. ఇక ఈ ఔట్ కు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో.. క్రికెట్ ఫ్యాన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఏంటి రూట్ భాయ్ గల్లీ క్రికెట్ షాట్ ను కొట్టి ఔట్ అయ్యావ్.. జర చూసుకోవాలిగా అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. సీనియర్ బ్యాటర్ అయ్యి ఉండి ఆ బాల్ ను అంచనా వేయలేకపోయావా? అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ప్రస్తుతం బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లాండ్ ను డచ్ బౌలర్లు నిలువరిస్తున్నారు. 32 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 184 రన్స్ చేసింది ఇంగ్లాండ్. జట్టులో డేవిడ్ మలన్(87), రూట్(28) బెన్ స్టోక్స్(31 బ్యాటింగ్), మెుయిన్ అలీ(2 బ్యాటింగ్) క్రీజ్ లో ఉన్నారు. డచ్ బౌలర్లలో ఆర్యన్ దత్, వాన్ బీక్, పాల్ వాన్ మెకెరెన్, బాస్ డీ లీడే తలా ఓ వికెట్ తీసి ఇంగ్లాండ్ ను అడ్డుకున్నారు. మరి రూట్ విచిత్రమైన ఔట్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.