టెస్ట్‌ క్రికెట్‌కు కొత్త రారాజు! వరల్డ్‌ నెం.1గా అవతరించిన స్టార్‌ ప్లేయర్‌!

తాజాగా ఓ స్టార్ బ్యాటర్ రిటైర్మెంట్ ఏజ్ లో పరుగుల వరదపారిస్తూ.. టెస్ట్ క్రికెట్ లో నెంబర్ వన్ ఆటగాడిగా అగ్రస్థానాన్ని ఆక్రమించాడు. మరి ఆ ప్లేయర్ ఎవరు? తెలుసుకుందాం పదండి.

తాజాగా ఓ స్టార్ బ్యాటర్ రిటైర్మెంట్ ఏజ్ లో పరుగుల వరదపారిస్తూ.. టెస్ట్ క్రికెట్ లో నెంబర్ వన్ ఆటగాడిగా అగ్రస్థానాన్ని ఆక్రమించాడు. మరి ఆ ప్లేయర్ ఎవరు? తెలుసుకుందాం పదండి.

ప్రపంచ క్రికెట్ లో ఎంతో మంది దిగ్గజ క్రికెటర్లు ఉన్నారు. అయితే అందులో కొందరు మాత్రం తమ ఆటతీరుతో దేశం దాటి అభిమానులను సంపాదించుకుంటున్నారు. టీమిండియా స్టార్ క్రికెటర్లు సచిన్, సెహ్వాగ్, ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ ఇలా చెప్పుకుంటూ పోతే.. చాలా మందికి వరల్డ్ వైడ్ గా ఫ్యాన్స్ ఉన్నారు. ఇక వీరితో పాటుగా విదేశీ ప్లేయర్లకు సైతం ఇటు ఇండియాలో అటు విదేశాల్లో ఫ్యాన్స్ ఉన్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా ఓ స్టార్ బ్యాటర్ రిటైర్మెంట్ ఏజ్ లో పరుగుల వరదపారిస్తూ.. టెస్ట్ క్రికెట్ లో నెంబర్ వన్ ఆటగాడిగా అగ్రస్థానాన్ని ఆక్రమించాడు. మరి ఆ ప్లేయర్ ఎవరు? తెలుసుకుందాం పదండి.

జో రూట్.. ప్రపంచ క్రికెట్ కు పరిచయం అక్కర్లేని పేరు. మరీ ముఖ్యంగా సంప్రదాయ క్రికెట్ లో దిగ్గజ ఆటగాడిగా మన్ననలు పొందుతున్నాడు ఈ ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్. 33 సంవత్సరాల వయసులో అద్భుతమైన ఆటతీరుతో రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతూ.. ప్రపంచ క్రికెట్ ను ఆశ్చర్యపరుస్తున్నాడు. వెస్టిండీస్ తో జరిగిన మూడు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ను 3-0తో ఇంగ్లండ్ కైవసం చేసుకుంది. ఈ విజయంలో రూట్ కీలక పాత్ర పోషించాడు. చివరి టెస్ట్ లో విండీస్ దిగ్గజం బ్రియన్ లారా రికార్డును బద్దలు కొట్టి టెస్టుల్లో 12 వేల పరుగుల క్లబ్ లో చేరాడు.

ఈ క్రమంలోనే టెస్టుల్లో నెంబర్ వన్ బ్యాటర్ గా అవతరించాడు. తాజాగా ఐసీసీ ప్రకటించిన టెస్ట్ బ్యాటర్ల ర్యాంకింగ్స్ లో 872 పాయింట్లతో అగ్రస్థానానికి దూసుకొచ్చాడు రూట్. ఈ క్రమంలో న్యూజిలాండ్ దిగ్గజ బ్యాటర్ కేన్ విలియమ్సన్(859)ను వెనక్కి నెట్టి.. టెస్ట్ క్రికెట్ కు కొత్త రారాజుగా అవతరించాడు. వెస్టిండీస్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో ఓ శతకంతో సహా కీలక ఇన్నింగ్స్ లు ఆడాడు రూట్. ఇక ఈ జాబితాలో టీమిండియా నుంచి రోహిత్ శర్మ(6), యశస్వీ జైస్వాల్(8), విరాట్ కోహ్లీ(10) ర్యాంకింగ్స్ లో కొనసాగుతున్నారు. మరి రిటైర్మెంట్ ఏజ్ లో కూడా అద్భుతంగా రాణిస్తూ.. టెస్ట్ క్రికెట్ లో నెంబర్ వన్ బ్యాటర్ గా అవతరించిన జో రూట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments