SNP
Rohit Sharma, Shreyas Iyer, Pull Shot, IND vs SL: టీమిండియా వన్డే, టెస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మ.. తాజాగా హెడ్ కోచ్ అవతారం ఎత్తాడు. జట్టులోని ఓ స్టార్ ప్లేయర్‌కు తన టెక్నిన్స్ నేర్పించాడు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Rohit Sharma, Shreyas Iyer, Pull Shot, IND vs SL: టీమిండియా వన్డే, టెస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మ.. తాజాగా హెడ్ కోచ్ అవతారం ఎత్తాడు. జట్టులోని ఓ స్టార్ ప్లేయర్‌కు తన టెక్నిన్స్ నేర్పించాడు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
SNP
టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా.. నెక్ట్స్ వన్డే సిరీస్‌పై ఫోకస్ పెట్టింది. శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. టీ20 వరల్డ్ కప్ 2024 తర్వాత.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి దిగ్గజ క్రికెటర్లు మళ్లీ తిరిగి గ్రౌండ్‌లోకి దిగనున్నారు. అందుకే భారత క్రికెట్ అభిమానులు సైతం.. లంకతో వన్డే సిరీస్ ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. కోహ్లీకి బాగా ఇష్టమైన వన్డేల్లో తన దమ్మేంటో మరోసారి ప్రపంచానికి చూపించాలని ఉవ్విళ్లూరుతున్నాడు. అలాగే రోహిత్ శర్మ కూడా మరోసారి లాంగ్ ఇన్నింగ్స్ ఆడాలనే కసితో ఉన్నాడు. వీరిద్దరితో కలిసి పనిచేయాలని మరోవైపు కొత్త హెడ్ కోచ్ గంభీర్ ఆసక్తిగా ఉన్నాడు.. ఇలా లంకతో వన్డే సిరీస్ ఎన్నో మధుర జ్ఞాపకాలకు వేదిక కానుంది.
ఈ క్రమంలోనే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. హెడ్ కోచ్ అవతారం కూడా ఎత్తాడు. స్టార్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్‌కు బ్యాటింగ్‌లో టిప్స్ నేర్పిస్తూ కనిపించాడు. అయితే.. కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్.. ఇంకా వన్డే టీమ్‌తో కలవలేదు. మంగళవారం శ్రీలంకతో చివరి టీ20 మ్యాచ్ పల్లెకలెలో జరిగిన విషయం తెలిసిందే. వన్డే సిరీస్ కోసం శ్రీలంకకు ఆల్రెడీ లంకకు చేరుకుని.. కొలంబో క్రికెట్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్నారు. టీ20 జట్టుతో పల్లెకలె గంభీర్ ఉండిపోవడంతో.. అతను లేకుండానే వన్డే టీమ్ కొలంబోలో ప్రాక్టీస్ చేస్తోంది. వారికి అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ తోడుగా ఉన్నాడు.
అయితే.. శ్రేయస్ అయ్యర్‌కు షార్ట్ బాల్ వీక్‌నెస్ ఉన్న విషయం అందరికి తెలిసిందే. సరైన వేగంతో షార్ట్ బాల్ వేస్తే.. అయ్యర్ ఇబ్బంది పడతాడు. చాలా సార్లు షార్ట్ బాల్‌కే అయ్యర్ అవుట్ అయ్యాడు. అతను బ్యాటింగ్‌కు వచ్చాడంటే చాలా స్పీడ్ బౌలర్లు షార్ట్ బాల్స్‌తో అతన్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అదే సమయంలో షార్ట్ బాల్ అద్భుతంగా పుల్ షాట్ ఆడుతూ.. బంతిని సిక్స్‌కు పంపడంలో రోహిత్ శర్మ దిట్ట. పుల్‌షాట్ అనగానే గుర్తొచ్చే ప్లేయర్ రోహిత్. అందుకే.. శ్రీలంక సిరీస్‌కి ముందు పుల్‌షాట్‌పై మరింత పట్టుపెంచుకుని.. షార్ట్ బాల్ వీక్‌నెస్‌ను అధిగమించాలని భావించిన అయ్యర్.. రోహిత్ శర్మ వద్ద పుల్‌షాట్‌పై టిప్స్ అడిగి తెలుసుకున్నాడు.
తోటి ప్లేయర్ ఇబ్బందిని అర్థం చేసుకున్న రోహిత్.. శ్రేయస్‌కు పుల్‌షాట్‌పై టిప్స్ ఇచ్చాడు. ఈ సీన్స్ చూస్తుంటే.. రోహిత్ శర్మలో ఒక మంచి కోచ్ కనిపించాడని క్రికెట్ అభిమానులు అంటున్నారు. అయితే.. రోహిత్ శర్మ ఏం చేసినా అది టీమ్ కోసమే చేస్తాడని, ఇప్పుడు అయ్యర్‌కు పుల్ షాట్ నేర్పించి, షార్ట్‌బాల్ వీక్‌నెస్ దూరం చేస్తే.. అది టీమిండియాకే మంచిదనే విషయం రోహిత్‌కు తెలుసని, అందుకే అతని అద్భుతమైన టెక్నిక్‌ను శ్రేయస్‌కు కూడా నేర్పిస్తున్నాడంటూ ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Rohit Sharma has been working with Shreyas Iyer in nets to improve the pull shots of Iyer. [Vimal Kumar YT]
– Tremendous from the Indian Captain. pic.twitter.com/OmPTwWoH3w
— Johns. (@CricCrazyJohns) July 31, 2024