Somesekhar
Joe Root-Ben Stokes 'Pinkie' Celebration: ఇండియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్ లో జో రూట్ అద్భుత శతకం సాధించాడు. అయితే ఈ సెంచరీ తర్వాత రూట్-స్టోక్స్ పింకీ ఫింగర్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. మరి ఈ వెరైటీ సెలబ్రేషన్ కు అర్ధమేంటో ఇప్పుడు చూద్దాం.
Joe Root-Ben Stokes 'Pinkie' Celebration: ఇండియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్ లో జో రూట్ అద్భుత శతకం సాధించాడు. అయితే ఈ సెంచరీ తర్వాత రూట్-స్టోక్స్ పింకీ ఫింగర్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. మరి ఈ వెరైటీ సెలబ్రేషన్ కు అర్ధమేంటో ఇప్పుడు చూద్దాం.
Somesekhar
రాంచీ వేదికగా టీమిండియా వర్సెస్ ఇంగ్లండ్ మధ్య కీలకమైన నాలుగో టెస్ట్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ లో సగం రోజు వరకు భారత బౌలర్లు ఆధిపత్యం చెలాయిస్తే.. మిగతా సగం ఇంగ్లండ్ పై చేయిసాధించింది. ఒకానొక దశలో 112 రన్స్ కే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఇంగ్లీష్ టీమ్ ను తొలిరోజు ఆటముగిసే సరికి 302/7 స్కోర్ తో ఉందంటే దానికి ఏకైక కారణం జో రూట్. అద్భుతమైన శతకంతో అజేయంగా నిలిచాడు. అయితే సెంచరీ చేసిన తర్వాత ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్-రూట్ పింకీ ఫింగర్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ సెలబ్రేషన్స్ కు సంబంధించిన వీడియో వైరల్ గా మారడంతో.. దీనికి అర్ధం ఏంటని తెగ వెతుకుతున్నారు నెటిజన్లు.
జో రూట్.. నాలుగో టెస్ట్ తొలిరోజు ఇంగ్లండ్ టీమ్ హీరో. 112 రన్స్ కే సగం వికెట్లు కోల్పోయి ఆలౌట్ దిశగా పయనిస్తున్న టీమ్ కు అడ్డుగోడలా నిలిచాడు. 226 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లతో 106 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడికి తోడు బెయిర్ స్టో(38), బెన్ ఫోక్స్(47), రాబిన్సన్(31*) పరుగులతో రాణించారు. ఇదంతా కాసేపు పక్కనపెడితే.. తొలిరోజు గేమ్ లో ఓ విచిత్రకరమైన సన్నివేశం చోటుచేసుకుంది. అదేంటంటే?
జో రూట్ తన కెరీర్ లో 31వ సెంచరీ బాదిన తర్వాత డగౌట్ లో ఉన్న కెప్టెన్ బెన్ స్టోక్స్ తన పింకీ ఫింగర్ ను చూపించాడు. దానికి బదులుగా రూట్ సైతం అలాగే తన ఫింగర్ ను ఎత్తి చూపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీంతో ఈ మిస్టరీ సెలబ్రేషన్స్ కు అర్ధమేంటని తెగ వెతుకుతున్నారు నెటిజన్లు. అయితే ఇలా పింకి ఫింగర్ ను చూపించి సెలబ్రేట్ చేసుకోవడానికి పెద్ద అర్ధమేమీ లేదు. ఎల్విస్ ప్రిస్లీ అమెరికన్ స్టార్ సింగర్ కమ్ యాక్టర్. అతడిలా గ్రౌండ్ లో రాక్ స్టార్ లా ఉండాలన్నది స్టోక్స్ ఉద్దేశం.
అందుకే అలా పింకి ఫింగర్ చూపించాడు. దీనికి రూట్ సైతం నేను బ్యాటింగ్ లో రాక్ స్టార్ లానే ఉంటాను అంటూ అదే వేలిని చూపించాడు. 1935 లో పుట్టిన ఎల్విస్ ప్రిస్లీ 1977లో తన 42వ ఏట మరణించాడు. అతడికి గుర్తుగా ఈ చిహ్నాన్ని వాడుతున్నారు ఇంగ్లండ్ ఆటగాళ్లు. అయితే ఈ గుర్తును వాడటం ఇదే మెుదటిసారి కాదు.. 2022 జులైలో జరిగిన ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో కూడా ఇలా పింకి ఫింగర్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు ఇంగ్లండ్ ప్లేయర్లు. మరి ఈ సెలబ్రేషన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Joe Root showing pinky finger pic.twitter.com/2oPsrz4wxE
— Arya_Sinha9 (@Yobitch92321581) February 23, 2024
ఇదికూడా చదవండి: తీవ్ర విషాదం.. గుండెపోటుతో యువ క్రికెటర్ మృతి!