iDreamPost
android-app
ios-app

తీవ్ర విషాదం.. గుండెపోటుతో యువ క్రికెటర్ మృతి!

  • Published Feb 23, 2024 | 9:07 PM Updated Updated Feb 23, 2024 | 9:07 PM

భారత క్రికెట్ లో తీవ్ర విషాదం నెలకొంది. కర్ణాటకకు చెందిన ఓ యువ క్రికెటర్ గుండెపోటుతో మరణించాడు.

భారత క్రికెట్ లో తీవ్ర విషాదం నెలకొంది. కర్ణాటకకు చెందిన ఓ యువ క్రికెటర్ గుండెపోటుతో మరణించాడు.

  • Published Feb 23, 2024 | 9:07 PMUpdated Feb 23, 2024 | 9:07 PM
తీవ్ర విషాదం.. గుండెపోటుతో యువ క్రికెటర్ మృతి!

రోజురోజుకు మారుతున్న జీవనశైలి.. మానవుడి జీవితాన్ని ప్రశ్నార్థకంగా చేస్తోంది. ఏ క్షణాన ప్రాణాలు పోతాయో కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం. పసిపిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ల వరకు గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. తాజాగా ఇండియన్ క్రికెట్ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గుండెపోటుతో ఓ యువ క్రికెటర్ తన ప్రాణాలను విడిచాడు.

కర్ణాటక క్రికెట్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. యువ క్రికెటర్ హోయ్ సల(34) గుండెపోటుతో గురువారం మరణించాడు. కర్ణాటకకు చెందిన హోయ్ సల ప్రస్తుతం బెంగళూరులో AEG సౌత్ జోన్ టోర్నీలో ఆడుతున్నాడు. ఈ టోర్నీలో భాగంగా తమిళనాడుతో జరిగిన మ్యాచ్ అనంతరం ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.దీంతో అతడిని సహచర క్రికెటర్లు, సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

అనంతరం పరీక్షించిన వైద్యులు అప్పటికే హోయ్ సల మరణించినట్లు ధృవీకరించారు. దీంతో అప్పటి వరకు తమ మధ్య క్రికెట్ ఆడిన ప్లేయర్ ఇలా విగతజీవిలా పడిఉండటం చూసి.. కన్నీరుమున్నీరుగా ఏడ్చారు ప్లేయర్లు. ఇక ఇతడు గతంలో KPL టోర్నీలో కూడా ఆడాడు. ఈ విషయం తెలియడంతో.. దేశవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు విచారం వ్యక్తం చేస్తూ.. అతడి కుటుంబ సభ్యులకు సోషల్ మీడియా వేదికగా ప్రగాఢసానుభూతి తెలుపుతున్నారు. జాతీయ జట్టుకు ఆడాలన్న కల నెరవేరకముందే.. ఇలా అర్ధాంతరంగా యువ క్రికెటర్ మరణించడం చాలా బాధాకరం.

ఇదికూడా చదవండి: సెంచరీతో దుమ్మురేపిన సర్ఫరాజ్‌ తమ్ముడు! అన్నను మించిన ఆట..

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobet