iDreamPost
android-app
ios-app

Jay Shah: BCCIకి జై షా గుడ్ బై? ఆ పోస్ట్ పై కన్నేసిన షా..

  • Published Jan 30, 2024 | 4:08 PM Updated Updated Jan 30, 2024 | 4:08 PM

త్వరలోనే బీసీసీఐకి జై షా గుడ్ బై చెప్పబోతున్నాడట. దానికి కారణం, అతడు మరో పోస్ట్ పై కన్నేయడమే అని తెలుస్తోంది. ఇంతకీ ఆ పోస్ట్ ఏంటి? ఆ వివరాలు..

త్వరలోనే బీసీసీఐకి జై షా గుడ్ బై చెప్పబోతున్నాడట. దానికి కారణం, అతడు మరో పోస్ట్ పై కన్నేయడమే అని తెలుస్తోంది. ఇంతకీ ఆ పోస్ట్ ఏంటి? ఆ వివరాలు..

Jay Shah: BCCIకి జై షా గుడ్ బై? ఆ పోస్ట్ పై కన్నేసిన షా..

జై షా.. 2019లో బీసీసీఐ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ పదవిలో కొనసాగుతున్నాడు షా. అయితే బీసీసీఐ నియమావళి ప్రకారం ఏ పదవిలో అయినా ఐదు సంవత్సరాలు మాత్రమే ఉండాలి. కానీ రూల్స్ మార్చడం వల్ల ప్రస్తుతం కూడా అదే పదవిలో కొనసాగుతున్నాడు షా. ఈ పదవే కాకుండా.. ఏసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం త్వరలోనే బీసీసీఐకి జై షా గుడ్ బై చెప్పబోతున్నాడట. దానికి కారణం, అతడు మరో పోస్ట్ పై కన్నేయడమే అని తెలుస్తోంది. మరి ఇంతకీ ఆ పోస్ట్ ఏంటి? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఏసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా, బీసీసీఐ సెక్రటరీగా సేవలు అందిస్తూ వస్తున్నాడు జై షా. 2019 నుంచి అతడు BCCI కార్యదర్శిగా కొనసాగుతున్నాడు. ఇంతకు ముందు 2013లో గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శిగా, 2015లో బీసీసీఐ మార్కెటింగ్, ఫైనాన్స్ కమిటీలో సభ్యుడిగా చేసిన అనుభవం ఉంది షాకి. దీంతో ఐసీసీ అధ్యక్ష రేసు బరిలోకి దిగాలని ఆలోచిస్తున్నాడట. వచ్చే నవంబర్ లో ఐసీసీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో పోటీ చేయాలని జై షా భావిస్తున్నాడట.

ఒక వేళ ఐసీసీ ఛైర్మన్ గా షా ఎన్నికైతే.. ప్రస్తుతం ప్రెసిడెంట్ గా కొనసాగుతున్న ఏసీసీ అధ్యక్షు పదవి నుంచి అలాగే బీసీసీఐ కార్యదర్శి పదవుల నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఇప్పటికే జై షా పై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. సౌరవ్ గంగూలీని బలవంతంగా అధ్యక్ష పదవి నుంచి పంపిచాడని, ప్రస్తుతం ఉన్న అధ్యక్షుడు అయిన రోజర్ భిన్నీని నామమాత్రంగా పెట్టి.. అన్ని అధికారాలు షానే చెలాయిస్తున్నాడని సోషల్ మీడియా వేదికగా క్రికెట్ అభిమానులు ఆరోపిస్తున్నారు. మరి బీసీసీఐకి గుడ్ బై చెప్పి.. ఐసీసీ అధ్యక్షుడు కావాలనుకుంటున్న జై షాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.