IPL And WTC Final Have 15 Days Gap: తప్పు సరిదిద్దుకున్న BCCI.. ఆ ICC ట్రోఫీ మిస్ అవకుండా గట్టి ప్లానింగ్!

తప్పు సరిదిద్దుకున్న BCCI.. ఆ ICC ట్రోఫీ మిస్ అవకుండా గట్టి ప్లానింగ్!

BCCI Decision On WTC Final 2025: ప్రతి విషయంలో పర్టిక్యులర్​గా ఉండే భారత క్రికెట్ బోర్డు.. ఆ ఒక్కదాంట్లో మాత్రం తప్పు చేసింది. ఆ కాస్ట్​లీ మిస్టేక్​ను ఇప్పుడు బోర్డు సరిదిద్దుకుంది.

BCCI Decision On WTC Final 2025: ప్రతి విషయంలో పర్టిక్యులర్​గా ఉండే భారత క్రికెట్ బోర్డు.. ఆ ఒక్కదాంట్లో మాత్రం తప్పు చేసింది. ఆ కాస్ట్​లీ మిస్టేక్​ను ఇప్పుడు బోర్డు సరిదిద్దుకుంది.

భారత క్రికెట్ బోర్డు గురించి తెలిసిందే. ప్రతి విషయంలో పర్టిక్యులర్​గా ఉంటుంది బోర్డు. డొమెస్టిక్ క్రికెట్ నుంచి ఐపీఎల్, ఇంటర్నేషనల్ క్రికెట్ వరకు అన్ని విషయాలను జాగ్రత్తగా చూసుకుంటుంది. అలాంటిది ఆ ఒక్కదాంట్లో మాత్రం తప్పు చేసింది. ఆ కాస్ట్​లీ మిస్టేక్​ వల్ల టీమిండియా కప్పు కోల్పోవడంతో అప్పట్లో బీసీసీఐ మీద తీవ్ర విమర్శలు వచ్చాయి. ఏ ప్లానింగ్ లేకుండా టీమ్​ను పంపడం ఏంటని, అందువల్లే ఓడిపోయారంటూ బోర్డును అందరూ తప్పుబట్టారు. అయితే తమ మిస్టేక్​ను గ్రహించిన బీసీసీఐ పెద్దలు ఇప్పుడు దాన్ని సరిదిద్దుకున్నారు. ఇంతకీ ఏ విషయంలో బోర్డు తప్పు చేసిందనేగా మీ ప్రశ్న. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్​షిప్ ఫైనల్ విషయంలో అప్పట్లో ఒక మిస్టేక్ జరిగింది.

ఐపీఎల్ తర్వాత షార్ట్ గ్యాప్​లోనే డబ్ల్యూటీసీ ఫైనల్-2023 జరిగింది. భారత ఆటగాళ్లకు కనీసం ప్రాక్టీస్ చేయడానికి కూడా టైమ్ దొరకలేదు. దీంతో ఆస్ట్రేలియాతో జరిగిన ఆ ఫైనల్ మ్యాచ్​లో ఓడి ట్రోఫీని మిస్ అయింది మెన్ ఇన్ బ్లూ. అప్పటివరకు ఐపీఎల్​లో టీ20 ఫార్మాట్​కు అలవాటు పడిన భారత ఆటగాళ్లు.. టెస్టు ఫార్మాట్​కు తగినట్లు సిద్ధమయ్యేందుకు సమయం దొరక్కపోవడంతో డబ్ల్యూటీసీ ఫైనల్​లో ఫెయిలయ్యారు. దీంతో కంగారూల చేతుల్లో ఓడి కప్పును చేజార్చుకున్నారు. ఈ ఓటమితో బీసీసీఐపై తీవ్ర విమర్శలు వచ్చాయి. డబ్ల్యూటీసీ ఫైనల్ ఉందని ముందే తెలిసినా ఐపీఎల్​కు ఆ టోర్నీకి మధ్య ఎందుకు గ్యాప్ లేదు? ప్లాన్ చేయాల్సింది కదా? అంటూ బోర్డును అంతా తప్పుబట్టారు. ఆ మిస్టేక్​ను ఇప్పుడు సరిదిద్దుకుంది.

వచ్చే ఏడాది డబ్ల్యూటీసీ-2025 ఫైనల్ జరగనుంది. ఇది కూడా ఐపీఎల్​ తర్వాత కొద్ది గ్యాప్​లోనే జరగనుంది. దీంతో అలర్ట్ అయిన బీసీసీఐ.. డబ్ల్యూటీసీ ఫైనల్​కు, క్యాష్​ రిచ్ లీగ్​కు మధ్య 15 రోజుల విరామం ఉండేలా ప్లాన్ చేస్తోంది. ఒకవేళ మన జట్టు ఫైనల్​కు క్వాలిఫై అయితే రెండు వారాల ప్రాక్టీస్ టైమ్ దొరుకుతుంది. ఈ విషయాన్ని తాజాగా బోర్డు సెక్రెటరీ జైషా తెలిపారు. అప్పట్లో టీమ్ ఆలస్యంగా ఫైనల్ చేరడంతో తాము ఏమీ చేయలేకపోయామని, కానీ ఇక మీదట అలా జరగదన్నారు షా. ఇప్పటి నుంచి ఐపీఎల్-డబ్ల్యూటీసీ ఫైనల్​కు మధ్య రెండు వారాల గ్యాప్ ఉండేలా చూసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. భారత్ రెండుమార్లు ఆ టోర్నీ ఫైనల్​కు చేరుకోవడం హైలైట్ అని ఆయన చెప్పారు. షా వ్యాఖ్యలు విన్న నెటిజన్స్.. బీసీసీఐ తప్పు సరిదిద్దుకోవడం మంచి విషయమని అంటున్నారు. ఇంకో ఐసీసీ ట్రోఫీ కోసం గట్టిగానే ప్లానింగ్ చేస్తున్నారని చెబుతున్నారు. మరి.. ఐపీఎల్-డబ్ల్యూటీసీ ఫైనల్ మధ్య గ్యాప్ ఉండేలా బీసీసీఐ తీసుకుంటున్న చర్యలపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

Show comments