iDreamPost
android-app
ios-app

దులీప్ ట్రోఫీకి రోహిత్-కోహ్లీ దూరం.. ఎందుకు ఆడట్లేదో క్లారిటీ ఇచ్చిన జైషా!

  • Published Aug 15, 2024 | 6:24 PM Updated Updated Aug 15, 2024 | 6:24 PM

Jay Shah On Rohit Absence From Duleep Trophy: దులీప్ ట్రోఫీకి బీసీసీఐ ప్రకటించిన టీమ్స్​లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పేర్లు లేకపోవడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఈ విషయంపై బోర్డు సెక్రెటరీ జైషా తాజాగా రియాక్ట్ అయ్యాడు.

Jay Shah On Rohit Absence From Duleep Trophy: దులీప్ ట్రోఫీకి బీసీసీఐ ప్రకటించిన టీమ్స్​లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పేర్లు లేకపోవడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఈ విషయంపై బోర్డు సెక్రెటరీ జైషా తాజాగా రియాక్ట్ అయ్యాడు.

  • Published Aug 15, 2024 | 6:24 PMUpdated Aug 15, 2024 | 6:24 PM
దులీప్ ట్రోఫీకి రోహిత్-కోహ్లీ దూరం.. ఎందుకు ఆడట్లేదో క్లారిటీ ఇచ్చిన జైషా!

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇప్పుడు వెకేషన్​ను ఎంజాయ్ చేస్తున్నారు. హాలీడేస్​ను ఫ్యామిలీతో కలసి ఆస్వాదిస్తున్నారు. ఫారెన్ కంట్రీస్ చుట్టేస్తూ రిలాక్స్ అవుతున్నారు. లండన్ వీధుల్లో కింగ్ కోహ్లీ చక్కర్లు కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. అయితే ఈ ఇద్దరు స్టార్లు సెప్టెంబర్ 5 నుంచి మొదలయ్యే డొమెస్టిక్ టోర్నమెంట్ దులీప్ ట్రోఫీలో ఆడతారని వార్తలు వచ్చాయి. కానీ ఈ వీళ్లిద్దరితో పాటు పేసుగుర్రం జస్​ప్రీత్ బుమ్రాకు బీసీసీఐ మినహాయింపు ఇచ్చింది. బోర్డు తీసుకొచ్చిన కొత్త రూల్స్ ప్రకారం నేషనల్ డ్యూటీ లేని సమయంలో ప్రతి ఆటగాడు కచ్చితంగా దేశవాళీ క్రికెట్ ఆడాలి. కానీ రోకో జోడీతో పాటు బుమ్రాకు మాత్రం మినహాయింపు ఇచ్చారు.

దులీప్ ట్రోఫీలో రోహిత్, కోహ్లీ, బుమ్రాను ఆడించకపోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వాళ్లకు రెస్ట్ ఇవ్వడం మంచిదే, నెక్స్ట్‌ లాంగ్ టెస్ట్ సీజన్ ఉంది కాబట్టి అదనపు విశ్రాంతి ఇవ్వడంలో తప్పులేదని నెట్టింట కొందరు సమర్థిస్తున్నారు. మరికొందరు మాత్రం ఈ ముగ్గుర్నీ స్పెషల్​గా ట్రీట్ చేయడం కరెక్ట్ కాదని విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఈ టాప్ క్రికెటర్స్ దులీప్ ట్రోఫీలో ఆడకపోవడానికి రీజన్ ఏంటనేది తాజాగా బీసీసీఐ సెక్రెటరీ జైషా క్లారిటీ ఇచ్చాడు. రోహిత్, విరాట్, బుమ్రా మినహా మిగతా భారత జట్టు ఆటగాళ్లంతా డొమెస్టిక్ క్రికెట్​లో ఆడుతుండటం శుభపరిణామమని.. అందుకు వాళ్లను అభినందించాలన్నాడు. ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ బుచ్చిబాబు టోర్నీలోనూ పాల్గొంటున్నారని చెప్పాడు.

‘రోహిత్, కోహ్లీ, బుమ్రాను డొమెస్టిక్ క్రికెట్​లో ఆడమని పట్టుబట్టడం సరికాదు. వాళ్లు గాయాల బారిన పడే ప్రమాదం ఉంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లాంటి బడా టీమ్స్​లోని టాప్ ప్లేయర్లు ఎవరూ కూడా డొమెస్టిక్ క్రికెట్ ఆడరు. కాబట్టి రోహిత్, విరాట్​కు రెస్పెక్ట్ ఇచ్చి తీరాల్సిందే. చాన్నాళ్లుగా క్రికెట్​కు దూరంగా ఉన్నవారు, ఎక్కువ విరామం ఉన్నవారు, ఇంజ్యురీల నుంచి రికవర్ అయినవారు ఫామ్​ను అందుకోవడానికి ఇదే కరెక్ట్ టైమ్. వాళ్లు ఫిట్​నెస్​ను ఇంప్రూవ్ చేసుకోవడం, ఫామ్​ను అందుకోవడానికి ప్రయత్నించాలి. రెగ్యులర్​గా ఆడే ఆటగాళ్లకు అంత అవసరం లేదు’ అని జైషా చెప్పుకొచ్చాడు. కాగా, రెస్ట్ దొరికినప్పటికీ ఫిట్​నెస్​, ఫామ్​ మీద ఫోకస్ చేయాలని సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్లకు కొత్త కోచ్ గంభీర్ ఆదేశించాడని సమాచారం. మరి.. జైషా చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.