SNP
ఐపీఎల్ 2024 కోసం గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా ఉన్నా పాండ్యా.. తాజాగా ముంబై ఇండియన్స్‌కు మారాడు. అయితే.. పాండ్యా రాకతో ముంబైలో గొడవలు మొదలైనట్లు తెలుస్తుంది. ఏకంగా బుమ్రా ఆ జట్టును వీడేందుకు కూడా సిద్ధమైనట్లు సమాచారం. ముంబైలో అసలేం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం..
ఐపీఎల్ 2024 కోసం గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా ఉన్నా పాండ్యా.. తాజాగా ముంబై ఇండియన్స్‌కు మారాడు. అయితే.. పాండ్యా రాకతో ముంబైలో గొడవలు మొదలైనట్లు తెలుస్తుంది. ఏకంగా బుమ్రా ఆ జట్టును వీడేందుకు కూడా సిద్ధమైనట్లు సమాచారం. ముంబైలో అసలేం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం..
SNP
ఐపీఎల్ 2024 సీజన్ కు ఇంకా చాలా సమయం ఉన్నా.. ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో ఐపీఎల్ గురించే చర్చ జరుగుతోంది. రాబోయే సీజన్ కంటే ముందు ప్రతి ఏడాది జరిగినట్టే.. ఈ సారి కూడా ఆటగాళ్ల ఇంటర్నల్ ట్రేడింగ్, క్యాష్ ట్రేడింగ్, రిలీజ్, రిటేన్ ప్రక్రియ జరిగింది. కానీ, ఒక సక్సెస్ ఫుల్ టీమ్ కు కెప్టెన్ గా ఉన్న హార్ధిక్ పాండ్యా.. కెప్టెన్సీని సైతం వదిలేసి.. తన పాత ఫ్రాంచైజ్ కి తిరిగి రావడంతో ఒక్కసారిగా క్రికెట్ అభిమానుల దృష్టి ఐపీఎల్ పై పడింది. అసలు ఐపీఎల్ టీమ్స్ మధ్య ఏం జరుగుతుందోననే ఆసక్తి క్రికెట్ అభిమానుల్లో నెలకొంది.
గుజరాత్ కు కెప్టెన్ గా ఉన్న పాండ్యా ఏం ఆశించి మళ్లీ ముంబైకి వెళ్లాడనే ప్రశ్న అందరిలో ఉత్పన్నమవుతోంది. పాండ్యా ఎందుకు టీమ్ మారాడనే విషయం పక్కనపెడితే.. పాండ్యా ఎంట్రీతో ప్రస్తుతం జట్టులో లుకలుకలు మొదలైనట్లు తెలుస్తుంది. ఏకంగా ఆ జట్టు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ముంబై ఇండియన్స్ టీమ్ ను వీడేందుకు సిద్దమైనట్లు సమాచారం. అసలు పాండ్యా రాకకు.. బుమ్రా పోకకు లింక్ ఏంటి? అసలు ముంబై ఇండియన్స్ లో ఏం జరుగుతోంది? ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
ప్రస్తుతం ముంబై ఇండియన్స్ కు రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉన్నాడు. సూర్యకుమార్ యాదవ్ వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక సార్లు ఛాంపియన్ గా నిలిచిన జట్టుగా ముంబై ఇండియన్స్ ఉంది. ఇంత సక్సెస్ ఫుల్ టీమ్ ను భవిష్యత్తులో కూడా మరింత సక్సెస్ ఫుల్ గా నడిపించేందుకు రోహిత్ శర్మ తర్వాత అంత మంచి కెప్టెన్ కూడా ముంబైకి ఉండాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం గుజరాత్ నుంచి పాండ్యా తిరిగి వచ్చేయడంతో మళ్లీ అతనికే వైస్ కెప్టెన్సీ పగ్గాలు అప్పగిస్తారానే చర్చ జరుగుతోంది. ఇదే విషయమై ముంబై జట్టులో గొడవలు మొదలైనట్లు తెలుస్తుంది.
ఇప్పటికే ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్సీపై జస్ప్రీత్ బుమ్రా కన్నేసి ఉన్నాడు. రోహిత్ శర్మ ఐపీఎల్ కు గుడ్‌బై చెప్పిన తర్వాత.. ముంబై ఇండియన్స్ కు బుమ్రా కెప్టెన్సీ చేయాలని భావిస్తున్నాడని చాలా సార్లు వినిపించిన విషయమే. ఇప్పటికే బుమ్రా టీమిండియాకు పలు మ్యాచ్ ల్లో కెప్టెన్ గా వ్యవహరించాడు. అయితే.. ఇప్పుడు పాండ్యా జట్టులోకి తిరిగి రావడంతో తనకు కెప్టెన్సీ రావడం కష్టమని భావిస్తున్న బుమ్రా.. ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్ తో ఈ విషయంపై చర్చలు జరిపినట్లు సమాచారం. ఆ చర్చలు కాస్త విఫలం కావడంతోనే మంగళవారం తన ఇన్ స్టోరీలో కొన్ని సార్లు మౌనంగా ఉండటమే మంచిదని కోట్ రాసుకొచ్చాడు. దీంతో.. బుమ్రా ముంబై జట్టును వీడి.. వేరే ఫ్రాంచైజ్ కి మారే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. సూపర్ ఫామ్ లో ఉన్న బుమ్రా ముంబైని వదిలేస్తే.. ఆ జట్టుకు పెద్ద దెబ్బే. అయితే.. ఇది ఐపీఎల్ 2024 తర్వాతే జరగొచ్చు. మొత్తంగా.. పాండ్యా రాకతో ముంబై ఇండియన్స్ లో అలజడి మాత్రం రేగిందనేది సత్యం. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Jasprit Bumrah’s Instagram story. pic.twitter.com/EgpAirzwai
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 28, 2023