SNP
Jasprit Bumrah, Rohit Sharma: భారత స్పీడ్‌స్టర్ జస్ప్రీత్ బుమ్రా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని మాట్లాడుతూ.. కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
Jasprit Bumrah, Rohit Sharma: భారత స్పీడ్‌స్టర్ జస్ప్రీత్ బుమ్రా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని మాట్లాడుతూ.. కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
SNP
టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ గురించి మాట్లాడుతూ.. స్పీడ్‌స్టర్ జస్ప్రీత్ బుమ్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ సూపర్ సక్సెస్ అయిన విషయం తెలిసిందే. ఇటీవలె తన కెప్టెన్సీలోనే భారత్‌కు టీ20 వరల్డ్ కప్ అందించాడు. ఆ టోర్నీలో స్టార్ బౌలర్ బుమ్రా అద్భుతంగా రాణించాడు. స్లో పిచ్‌లపై లో స్కోర్కింగ్ థ్రిల్లర్స్‌లో జరిగిన మ్యాచ్‌ల్లో టీమిండియా ఓటమి ఎరుగని జట్టుగా కప్పు కొట్టిందంటే.. అందుకు ప్రధాన కారణం బుమ్రా. కెప్టెన్‌గా రోహిత్ టీ20 వరల్డ్ కప్ ఎత్తాడంటే బుమ్రా వల్లే.
అయితే.. బుమ్రా.. టీమిండియాకే కాదు, ఐపీఎల్‌లో కూడా రోహిత్ శర్మ కెప్టెన్సీలోనే ఆడాడు. ఐపీఎల్‌లో బుమ్రా ఫస్ట్ కెప్టెన్ రోహితే, అతని కెప్టెన్సీలోనే బుమ్రా స్టార్‌గా మారాడు. అందుకే ఈ ఇద్దరు ఆటగాళ్ల మంచి, బాండింగ్‌తో, అద్భుతమైన మ్యాచ్ విన్నింగ్ కమ్యూనికేషన్ ఉంది. అది ఎలాగంటే.. బుమ్రా బలం ఏంటి? ఎలాంటి బౌలింగ్ వేస్తాడు? అతను బౌలింగ్ వేస్తుంటే.. ఎలాంటి ఫీల్డ్ సెట్ చేయాలో రోహిత్ శర్మకు బాగా తెలుసు. అలాగే తన కెప్టెన్‌పై బుమ్రాకు పూర్తి నమ్మకం. తాను ఏం అనుకుంటాడో అతి స్పష్టంగా రోహిత్‌కు చెప్తాడు బుమ్రా.
ఇదే విషయంపై తాజాగా బుమ్రా మాట్లాడుతూ.. ఐపీఎల్‌లో ఆడుతున్న సమయంలో.. రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఉన్నప్పుడు నేను జస్ట్ ఈ బాల్ వేస్తున్నాను అని చెప్తాను అంటే.. దానికి ఎలాంటి ఫీల్డ్ పెట్టుకుండానేది రోహిత్ శర్మ ఇష్టం. నాకు కూడా నా కెప్టెన్‌పై పూర్తి నమ్మకం ఉంటుంది అని బుమ్రా వెల్లడించాడు. ఇలా కెప్టెన్‌గా రోహిత్, బౌలర్‌గా బుమ్రా.. జోడీ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు, ఇంటర్నేషనల్ క్రికెట్‌లో టీమిండియాకు ఎన్నో విజయాలు అందించింది. టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్‌లో కూడా బుమ్రా చేసిన అద్భుతంతోనే టీమిండియా కప్పు కొట్టింది. సౌతాఫ్రికా విజయానికి 30 బంతుల్లో 30 పరుగులు అవసరమైన దశలో.. చివరి 5 ఓవర్లలో 2 ఓవర్లు వేసిన బుమ్రా కేవలం 6 పరుగులు ఇచ్చి వికెట్ కూల్చాడు. బుమ్రా చెప్పిన దాన్ని బట్టి.. అతని సక్సెస్‌లో రోహిత్‌కు కూడా భాగం ఉంది. ఈ బాల్ వేస్తున్నాను అంటే దానికి తగ్గట్లు ఫీల్డింగ్ పెట్టి.. బుమ్రాకు వికెట్ దక్కేలా చేస్తాడు రోహిత్. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.