iDreamPost
android-app
ios-app

నువ్వు బౌలింగ్ చేసిన వారిలో టఫెస్ట్ బ్యాట్స్​మన్ ఎవరు? బుమ్రా అదిరిపోయే ఆన్సర్!

  • Published Aug 29, 2024 | 6:46 PM Updated Updated Aug 29, 2024 | 6:48 PM

Jasprit Bumrah, Team India: టీమిండియా స్పీడ్​స్టర్ జస్​ప్రీత్ బుమ్రా బౌలింగ్​కు వస్తున్నాడంటేనే అపోజిషన్ టీమ్ బ్యాటర్స్ భయపడిపోతారు. పరుగుల సంగతి దేవుడెరుగు ఔట్ కాకుండా ఉంటే అదే పదివేలని అనుకుంటారు. అలాంటి బుమ్రాను భయపెట్టే బ్యాటర్స్ ఎవరైనా ఉన్నారా? ఇదే ప్రశ్న అతడికి ఎదురైంది.

Jasprit Bumrah, Team India: టీమిండియా స్పీడ్​స్టర్ జస్​ప్రీత్ బుమ్రా బౌలింగ్​కు వస్తున్నాడంటేనే అపోజిషన్ టీమ్ బ్యాటర్స్ భయపడిపోతారు. పరుగుల సంగతి దేవుడెరుగు ఔట్ కాకుండా ఉంటే అదే పదివేలని అనుకుంటారు. అలాంటి బుమ్రాను భయపెట్టే బ్యాటర్స్ ఎవరైనా ఉన్నారా? ఇదే ప్రశ్న అతడికి ఎదురైంది.

  • Published Aug 29, 2024 | 6:46 PMUpdated Aug 29, 2024 | 6:48 PM
నువ్వు బౌలింగ్ చేసిన వారిలో టఫెస్ట్ బ్యాట్స్​మన్ ఎవరు? బుమ్రా అదిరిపోయే ఆన్సర్!

టీమిండియా స్పీడ్​స్టర్ జస్​ప్రీత్ బుమ్రా బౌలింగ్​కు వస్తున్నాడంటేనే అపోజిషన్ టీమ్ బ్యాటర్స్ భయపడిపోతారు. పరుగుల సంగతి దేవుడెరుగు ఔట్ కాకుండా ఉంటే అదే పదివేలని అనుకుంటారు. అంతలా బ్యాటర్లను వణికిస్తున్నాడీ భారత పేసర్. బుల్లెట్ పేస్​తో అతడు వేసే డెలివరీస్​కు టాప్ బ్యాటర్స్ దగ్గర కూడా సమాధానం ఉండటం లేదు. బంతిని ఇరువైపులా స్వింగ్ చేస్తూ అతడు వేసే బంతుల్ని ఎదుర్కోలేక స్టార్లు కూడా చిత్తవుతున్నారు. స్వింగర్స్, కట్టర్స్, యార్కర్స్, స్లో బౌన్సర్స్.. ఇలా తన అమ్ములపొదిలోని ఏదో ఒక అస్త్రంతో బ్యాటర్ల పనిపట్టేస్తున్నాడు బుమ్రా. బ్యాటర్లకు నిద్రలేకుండా చేస్తున్న ఈ సీమర్​కు ఏ బ్యాటర్ అంటే భయమనే ప్రశ్న మీకూ వచ్చే ఉంటుంది. ఇదే క్వశ్చన్ బుమ్రాకు ఎదురైంది. దీనికి అతడు షాకింగ్ ఆన్సర్ ఇచ్చాడు.

తమిళనాడులోని సత్యభామ యూనివర్సిటీని ఇటీవల సందర్శించాడు బుమ్రా. ఈ సందర్భంగా అక్కడి స్టూడెంట్స్ ఈ పేసర్​ను పలు ప్రశ్నలు అడిగారు. ఈ నేపథ్యంలోనే.. ‘మీ కెరీర్​లో మీరు బౌలింగ్ చేసిన టఫెస్ట్ బ్యాట్స్​మన్ ఎవరు’ అనే క్వశ్చన్ ఎదురైంది. దీనికి బుమ్రా తనదైన శైలిలో ఆన్సర్ ఇచ్చాడు. తాను ఎవరికీ భయపడనని.. బ్యాటర్లు తన మీద డామినేషన్ చూపించే ఛాన్స్ ఇవ్వనని అన్నాడు. ‘ఈ ప్రశ్నకు నేను మంచి ఆన్సర్ ఇవ్వాలని అనుకుంటున్నా. కానీ నిజం ఏంటంటే.. ఏ బ్యాటర్ కూడా నా మీద ఆధిపత్యం చూపించకుండా చూసుకుంటా. అందుకు తగ్గట్లుగా నా మైండ్​ను ముందే ప్రిపేర్ చేస్తా. ప్రతి బ్యాటర్​ను నేను గౌరవిస్తా. కానీ నా జాబ్ నేను కరెక్ట్​గా చేస్తే.. ఈ ప్రపంచంలో ఎవ్వరూ నన్ను ఆపలేరని నాకు నేనే చెప్పుకుంటా’ అని బుమ్రా చెప్పుకొచ్చాడు.

క్రీజులో ఉన్న బ్యాటర్ ఎవరు? అనే దానికి మరీ అధిక ప్రాధాన్యత ఇవ్వనని.. తన బౌలింగ్ మీదే తాను ఫోకస్ పెడతానని బుమ్రా తెలిపాడు. బ్యాటర్ తన కంటే గ్రేట్ అని భావిస్తే అతడు చెలరేగే ప్రమాదం ఉన్నందున.. ఆ అవకాశం ఇవ్వకుండా తన బౌలింగ్ మీదే దృష్టి పెడతానని పేర్కొన్నాడు బుమ్రా. బౌలింగ్ చేసే టైమ్​లో అన్ని విషయాలు తన కంట్రోల్​లో ఉండేలా చూసుకోవడం, ఔట్ చేసేందుకు ఆపర్చునిటీస్​ను కనిపెట్టడం మీదే ధ్యాస పెడతానని పేర్కొన్నాడు. ఇక, బంగ్లాదేశ్​తో సిరీస్​కు ముందు భారీగా గ్యాప్ దొరకడంతో బుమ్రా ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే సత్యభామ యూనివర్సిటీని సందర్శించాడు. అక్కడ అతడికి గ్రాండ్​ వెల్​కమ్ లభించింది. ఇక, సెప్టెంబర్ 5వ తేదీ నుంచి మొదలయ్యే దులీప్ ట్రోఫీలో బుమ్రా ఆడటం లేదు. అతడికి మరింత రెస్ట్ ఇద్దామనే ఉద్దేశంతో బీసీసీఐ ఎంపిక చేయలేదు. మరి.. బుమ్రా బౌలింగ్ చేసిన వారిలో టఫెస్ట్ బ్యాటర్ ఎవరు? అని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.

 

View this post on Instagram

 

A post shared by Department of CSE SIST (@sathyabama_cse)