iDreamPost
android-app
ios-app

వీడియో: కోహ్లీ-గిల్ మధ్య చిచ్చు పెట్టిన AI.. దీని మాయను కనిపెట్టడం కష్టమే!

  • Published Aug 29, 2024 | 3:02 PM Updated Updated Aug 29, 2024 | 3:02 PM

Virat Kohli, Shubman Gill, Deepfake Video: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి యంగ్ బ్యాటర్ శుబ్​మన్ గిల్​కు మధ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిచ్చు పెట్టింది. దీని వల్ల కోహ్లీ-గిల్ ఫ్యాన్స్ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.

Virat Kohli, Shubman Gill, Deepfake Video: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి యంగ్ బ్యాటర్ శుబ్​మన్ గిల్​కు మధ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిచ్చు పెట్టింది. దీని వల్ల కోహ్లీ-గిల్ ఫ్యాన్స్ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.

  • Published Aug 29, 2024 | 3:02 PMUpdated Aug 29, 2024 | 3:02 PM
వీడియో: కోహ్లీ-గిల్ మధ్య చిచ్చు పెట్టిన AI.. దీని మాయను కనిపెట్టడం కష్టమే!

అత్యాధునిక సాంకేతికత ఫుల్​గా అందుబాటులోకి వచ్చేసింది. ప్రస్తుత టెక్నాలజీలో అన్నింటి కంటే ఎక్కువగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్​ను ఇప్పుడు చాలా రంగాల్లో వాడుతున్నారు. అయితే దీని వల్ల చాలా ఉపయోగాలు ఉన్నా.. కొందరు మాత్రం చెడు పనుల కోసం వాడుతున్నారు. ముఖ్యంగా ఏఐ సాయంతో సెలెబ్రిటీలను టార్గెట్ చేసుకొని వాళ్లను అనవసర వివాదాల్లోకి లాగుతున్నారు. డీప్​ఫేక్ లాంటి టెక్నాలజీ హెల్ప్​తో ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్ చేస్తూ.. సెలెబ్రిటీలను లక్ష్యంగా చేసుకొని కొందరు చేస్తున్న ఆగడాలు అంతా ఇంతా కాదు. తాజాగా టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, యంగ్ క్రికెటర్ శుబ్​మన్ గిల్ మధ్య ఇలాగే ఏఐని ఉపయోగించి చిచ్చు పెట్టేందుకు ప్రయత్నించారు. అసలేం జరిగింది అనేది ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..

స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అందరితో కలసిపోతాడు. టీమ్​లోని సీనియర్లు, యంగ్​స్టర్స్​ అనే తేడాల్లేకుండా అందర్నీ కలుపుకొని పోతాడు. యంగ్​స్టర్ గిల్​ను కూడా కెరీర్ ఆరంభం నుంచి సపోర్ట్ చేస్తూ వస్తున్నాడు కింగ్. అయితే తాజాగా శుబ్​మన్​ను కోహ్లీ విమర్శిస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో.. ‘గిల్​ను చాలా దగ్గర నుంచి చూస్తున్నా. అతడు టాలెంటెడ్ ప్లేయర్. అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ లెజెండ్​గా మారడం అంత ఈజీ కాదు. బాగా ఆడటానికి దిగ్గజ స్థాయికి చేరుకోవడానికి మధ్య ఎంతో తేడా ఉంది. గిల్ టెక్నిక్ సాలిడ్​గా ఉంది. కానీ మా రేంజ్​కు చేరుకోలేడు. అందరూ నెక్స్ట్ విరాట్ కోహ్లీ ఎవరని అంటున్నారు. వాళ్లకు ఒక్కటే చెబుతా.. కోహ్లీ ఒక్కడే. నేను టఫెస్ట్ బౌలర్లను ఎదుర్కొని కఠిన పరిస్థితుల్లో పరుగులు చేశా. దశాబ్ద కాలానికి పైగా కన్​సిస్టెంట్​గా రన్స్ చేశా. కొన్ని ఇన్నింగ్స్​ల్లో బాగా ఆడినంత మాత్రాన ఆ స్థాయికి చేరుకోలేరు’ అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

Kohli vs Gill

భారత క్రికెట్​లో గాడ్ సచిన్ టెండూల్కర్, అలాగే తాను మాత్రమే ఉన్నామని.. ఓ బెంచ్​మార్క్​ను సెట్ చేశామని ఆ వీడియోలో విరాట్ చెబుతున్నట్లు ఉంది. గిల్ తమ స్థాయిని చేరుకోవాలంటే ఎంతో దూరం ప్రయాణించాలని చెప్పడాన్ని కూడా చూడొచ్చు. గిల్​ను కోహ్లీ విమర్శిస్తున్నట్లు ఉన్న ఈ వీడియో చూసి చాలా మంది నిజమనుకున్నారు. ఇది ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టింది. గిల్​ను అలా ఎలా అంటారని, తీసిపారేస్తారని కొందరు సీరియస్ అవుతున్నారు. అయితే ఇది నిజం కాదని.. కోహ్లీ అలా అనలేదని తేలింది. డీప్​ఫేక్ వీడియో అని.. విరాట్​ ఏదో ఇంటర్వ్యూ మాట్లాడిన క్లిప్పింగ్​ను తీసుకొని ఆడియోను మార్చి ఇలా వైరల్ చేస్తున్నారని తెలిసింది. కావాలని అభిమానుల మధ్య గొడవ పెట్టేందుకు, వ్యూస్ కోసం చేసిన వీడియో ఇదని ఎక్స్​పర్ట్స్ అంటున్నారు. ఇలాంటి వీడియోలు, ఆడియోలు, ఫొటోల నుంచి జాగ్రత్తగా ఉండాలని.. అధికారికంగా వస్తే తప్ప అంత ఈజీగా నమ్మొద్దని సూచిస్తున్నారు. వీటి మాయను కనిపెట్టకపోతే కష్టమేనని కామెంట్స్ చేస్తున్నారు.