Somesekhar
Jasprit Bumrah Reacts Retirement: టీ20 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా ఆటగాళ్లకు బీసీసీఐ వాంఖడే స్టేడియంలో ఘనంగా సన్మానం చేసింది. ఈ కార్యక్రమంలో తన రిటైర్మెంట్ పై స్పందించాడు జస్ప్రీత్ బుమ్రా. అతడు ఏమన్నాడంటే?
Jasprit Bumrah Reacts Retirement: టీ20 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా ఆటగాళ్లకు బీసీసీఐ వాంఖడే స్టేడియంలో ఘనంగా సన్మానం చేసింది. ఈ కార్యక్రమంలో తన రిటైర్మెంట్ పై స్పందించాడు జస్ప్రీత్ బుమ్రా. అతడు ఏమన్నాడంటే?
Somesekhar
టీమిండియా టీ20 ప్రపంచ కప్ ను సాధించడంతో.. తమ రిటైర్మెంట్ కు ఇంతకంటే మంచి అవకాశం దొరకదని భావించిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాలు టీ20లకు వీడ్కోలు పలికారు. అయితే టీమిండియా ప్లేయర్లే కాదు.. ఇతర దేశాల ఆటగాళ్లు సైతం వరల్డ్ కప్ ఓటమి బాధలో పొట్టి ఫార్మాట్ కు గుడ్ బై చెప్పారు. ఇక ఇదే బాటలో మరికొందరు ఆటగాళ్లు కూడా వీడ్కోలు పలుకుతారని జోరుగా చర్చ జరుగుతోంది. అందులో భాగంగా టీమిండియా స్టార్ బౌలర్, యార్కర్ల కింగ్ జస్ప్రీత్ బుమ్రా సైతం రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అందరూ భావించారు. తాాజాగా తన రిటైర్మెంట్ ప్లాన్ పై వాంఖడేలో జరిగిన సన్మాన కార్యక్రమం సందర్బంగా స్పందించాడు. వీడ్కోలుపై ఏమన్నాడంటే?
టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత కొందరు టీమిండియా సీనియర్లు పొట్టి ఫార్మాట్ కు గుడ్ బై చెప్పారు. అందులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా ఉన్నారు. వీరి నిర్ణయాలతో ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ కు గురైయ్యారు. అయితే ఇదే బాటలో మరికొందరు కూడా టీ20లకు వీడ్కోలు పలుకుతారన్న వార్తలు వైరల్ గా మారాయి. అందులో ప్రధానంగా జస్ప్రీత్ బుమ్రా గురించి న్యూస్ వైరల్ గా మారింది. సీనియర్లు టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో.. బుమ్రా ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడా? అని అసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన సన్మాన కార్యక్రమంలో తన రిటైర్మెంట్ ప్లాన్స్ గురించి వెల్లడించాడు.
రిటైర్మెంట్ పై జస్ప్రీత్ బుమ్రా మాట్లాడుతూ..”నేను ఇప్పుడే మెుదలుపెట్టాను.. ఇప్పటి వరకు నేను సాధించిన విజయాలతో ఎంతో సంతోషంగా ఉన్నాను. నా వరకైతే.. రిటైర్మెంట్ ఆలోచనకు చాలా దూరంగా ఉన్నాను. వీడ్కోలుపై నేను ఎలాంటి ఆలోచన చేయలేదు. ఇక వరల్డ్ కప్ తో ఇక్కడి వచ్చిన తర్వాత మాకు దక్కిన అపూర్వ స్వాగతాన్ని జీవితంలో మర్చిపోలేను. నా కెరీర్ లో ఇలాంటి అనుభవం ఎదురుకాలేదు. భావోద్వేగాలను నియంత్రించుకోవడం చాలా కష్టమైంది. వాంఖడే స్టేడియం నాకెంతో స్పెషల్. ఇక్కడికి అండర్ 19 కుర్రాడిగా వచ్చాను.. ఇప్పుడు ఇక్కడే వరల్డ్ కప్ విన్నర్ గా నిలబడ్డాను. రోహిత్, విరాట్ లు తమ టార్గెట్ పై స్పష్టతతో ఉన్నారు. వీరిద్దరు జట్టును ముందుండి నడిపించారు. ఈ వరల్డ్ కప్ భవిష్యత్ కు స్ఫూర్తిగా నిలుస్తుంది” అంటూ చెప్పుకొచ్చాడు ఈ యార్కర్ల కింగ్. అంటే ఇప్పట్లో రిటైర్మెంట్ లేనట్లే అని చెప్పకనే చెప్పాడు బుమ్రా.
Jasprit Bumrah on his retirement plan 🐐 pic.twitter.com/qQhu3o9d5z
— RVCJ Media (@RVCJ_FB) July 4, 2024