Somesekhar
ఇన్నాళ్లకు భారత్ ను చూసి బుద్ధితెచ్చుకుంది పాకిస్తాన్. టీమిండియా చూపిన బాటలో పయనించి.. ఇన్నాల్టికి ఓ మంచి చేసేందుకు సిద్ధమవుతోంది. ఆ వివరాల్లోకి వెళితే..
ఇన్నాళ్లకు భారత్ ను చూసి బుద్ధితెచ్చుకుంది పాకిస్తాన్. టీమిండియా చూపిన బాటలో పయనించి.. ఇన్నాల్టికి ఓ మంచి చేసేందుకు సిద్ధమవుతోంది. ఆ వివరాల్లోకి వెళితే..
Somesekhar
ప్రపంచ క్రికెట్ లో టీమిండియాకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఇక ఆర్థికంగా బీసీసీఐని మించిన క్రికెట్ బోర్డ్ మరోకటి లేదన్నది కాదనలేని సత్యం. తాజాగా టీ20 వరల్డ్ కప్ ను కూడా సాధించి.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులతో జేజేలు కొట్టించుకొంటోంది. ఇన్ని విషయాల్లో ప్రపంచ క్రికెట్ కు దిక్సూచిలా నిలుస్తూ వస్తున్న టీమిండియాపై తన అక్కసును టైమ్ దొరికినప్పుడల్లా వెల్లగక్కుతూ ఉంటుంది దాయాది పాకిస్తాన్. అయితే ఇన్నాళ్లకు భారత్ ను చూసి బుద్ధితెచ్చుకుంది పాకిస్తాన్. టీమిండియా చూపిన బాటలో పయనించి.. ఇన్నాల్టికి ఓ మంచి చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
యంగ్ టీమిండియా ప్రస్తుతం జింబాబ్వే టూర్ లో ఉంది. 5 టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా శుబ్ మన్ గిల్ నాయకత్వంలో యువ జట్టు అక్కడికి చేరుకుంది. జూలై 6 నుంచి ఈ సిరీస్ ప్రారంభం అవుతుంది. వరుసగా 6, 7, 10, 13, 14 తేదీల్లో మ్యాచ్ లు జరగనున్నాయి. అన్ని మ్యాచ్ లకు హరారే వేదిక కానుంది. అయితే.. ఆర్థికంగా వెనకబడిన జింబాబ్వే క్రికెట్ బోర్డ్ కు చేయూతనిచ్చేందుకు టీమిండియా అక్కడికి వెళ్లి సిరీస్ ఆడాలని నిర్ణయించుకుంది. తద్వారా జింబాబ్వే క్రికెట్ బోర్డ్ కు ఆదాయం చేకూరుతుంది.
కాగా.. టీమిండియా చూపిన బాటలో పాకిస్తాన్ పయనిస్తోంది. ఆర్థికంగా వెనకబడిన ఆ దేశ క్రికెట్ బోర్డ్ కు సహాయం చేసేందుకు అక్కడ పర్యటిస్తోంది. పరిమిత ఓవర్ల సిరీస్ కోసం పాక్ జింబాబ్వేలో పర్యటించనుంది. ఈ ఏడాది నవంబర్, డిసెంబర్ లో వన్డే, టీ20 సిరీస్ ఆడనుంది. సిరీస్ లో భాగంగా.. తొలుత మూడు వన్డేలు నవంబర్ 24, 26, 28 తేదీల్లో జరగనున్నాయి. ఆ తర్వాత డిసెంబర్ 1, 3, 5 తేదీల్లో టీ20 మ్యాచ్ లు జరగనున్నాయి. అయితే వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ2025 జరగనుంది. ఆ ట్రోఫీకి సన్నాహకంగా ఈ జింబాబ్వే సిరీస్ ను పాక్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకున్న పాకిస్తాన్.. టీమిండియా బాటలో పయనిస్తూ.. ఇన్నాల్టికీ ఓ మంచి పని చేస్తోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.