షమీ, జడేజానే పొగుడుతున్నారు.. అతడి కష్టం ఎవరికీ కనిపించడం లేదా?

షమీ, జడేజానే పొగుడుతున్నారు.. అతడి కష్టం ఎవరికీ కనిపించడం లేదా?

  • Author Soma Sekhar Published - 07:37 PM, Mon - 6 November 23

వరల్డ్ కప్ లో టీమిండియా సాధిస్తున్న విజయాలకు కారణం షమీ, జడేజా అని చాలా మంది చెప్పుకొస్తున్నారు. కానీ భారత జట్టు సాధిస్తున్న గెలుపుల వెనక అతడి కష్టం ఉందని, అది ఎవరికీ కనిపించడం లేదని ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అతడెవరో ఇప్పుడు చూద్దాం.

వరల్డ్ కప్ లో టీమిండియా సాధిస్తున్న విజయాలకు కారణం షమీ, జడేజా అని చాలా మంది చెప్పుకొస్తున్నారు. కానీ భారత జట్టు సాధిస్తున్న గెలుపుల వెనక అతడి కష్టం ఉందని, అది ఎవరికీ కనిపించడం లేదని ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అతడెవరో ఇప్పుడు చూద్దాం.

  • Author Soma Sekhar Published - 07:37 PM, Mon - 6 November 23

టీమిండియా.. ఈ పేరు వింటే చాలు ప్రపంచ కప్ లో పాల్గొంటున్న జట్లకు వణుకుపుడుతోంది. అంతలా రెచ్చిపోయి ఆడుతోంది భారత జట్టు. వరుసగా 8 విజయాలు నమోదు చేసి.. టైటిల్ ను ముద్దాడే దిశగా దూసుకెళ్తోంది. ఇటు బౌలింగ్ లో అటు బ్యాటింగ్ లో దుమ్మురేపుతున్నారు టీమిండియా ఆటగాళ్లు. బ్యాటర్ల సంగతి అటుంచితే.. బౌలింగ్ లో మాత్రం టీమిండియా పేస్ త్రయం బుమ్రా, సిరాజ్, షమీలు అదరగొడుతున్నారు. మరోవైపు జడేజా, కుల్దీప్ యాదవ్ లు కూడా తమదైన రోజున చెలరేగిపోతున్నారు. అయితే చాలా మంది టీమిండియా విజయాలకు కారణం షమీ, జడేజా, సిరాజ్, కుల్దీప్ యాదవ్ లే అంటూ వారిని పొగుడుతున్నారు. స్పీడ్ గన్ బుమ్రాను మాత్రం తక్కువగా చూస్తున్నారు. కాగా.. టీమిండియా విజయాల్లో కీలక పాత్ర బుమ్రాదే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఆ లెక్కలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

జస్ప్రీత్ బుమ్రా.. వరల్డ్ క్రికెట్ లో బెస్ట్ బౌలర్ గా కితాబు అందుకుంటున్నాడు. అందుకు తగ్గట్లుగానే ఈ వరల్డ్ కప్ లో రాణిస్తూ.. టీమిండియా విజయాల వెనక ఎవరికీ కనిపించని గణాంకాలతో రాణిస్తున్నాడు. కానీ అతడికి రావాల్సినంత పేరు మాత్రం ఈ మెగాటోర్నీలో రావట్లేదనే చెప్పాలి. చాలా మంది షమీ, జడేజా, సిరాజ్, కుల్దీప్ లే టీమిండియా విజయానికి కారణం అవుతున్నారని చెప్పుకొస్తున్నారు. కానీ భారత జట్టు సాధిస్తున్న విజయాల వెనక బుమ్రా ఉన్నాడు. ఈ విషయాన్ని గణాంకాలే కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి. ఫస్ట్ ఓవర్ ప్రారంభిస్తున్న బుమ్రా.. తన అద్భుతమైన బంతులతో ప్రత్యర్థి బ్యాటర్లను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టేస్తున్నాడు. ఇక పరుగులు రాక, ఒత్తిడికి లోనైన బ్యాటర్లు సిరాజ్, షమీలతో పాటుగా జడేజా, కుల్దీప్ లకు వికెట్లు సమర్పించుకుంటున్నారు.

అయితే వారి ప్రతిభను తక్కువ అంచనా ఎవ్వరి ఉద్దేశం కాదు. షమీ అద్భుతంగా బౌలింగ్ చేస్తూ.. ఇప్పటికే వరల్డ్ కప్ లో రెండు సార్లు 5 వికెట్లను తీసి ఔరా అనిపించాడు. సిరాజ్ కూడా ప్రారంభంలో వికెట్లు తీస్తున్నాడు. అయితే స్టార్టింగ్ లో బాల్ ను రెండు వైపులా స్వింగ్ చేస్తూ.. ప్రత్యర్థి ఆటగాళ్లను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. దాంతో వారు సులువుగా వికెట్లు కోల్పోవడానికి కారణం అవుతున్నాడు బుమ్రా. ఇక అతడు సంధించే కొన్ని బంతులు అనూహ్యంగా స్వింగ్ అవుతూ.. వికెట్లు మిస్ అవుతున్నాయి లేకపోతే అతడే వరల్డ్ కప్ లో టాప్ వికెట్ టేకర్ గా నిలిచేవాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

అదీకాక ఈ మెగాటోర్నీలో ఇప్పటి వరకు అత్యధిక డాట్ బాల్స్ వేసిన రికార్డు బుమ్రా పేరిటే ఉంది. అతడు 8 మ్యాచ్ ల్లో 268 డాట్ బాల్స్ వేసి 70 శాతంతో అగ్రస్థానంలో ఉన్నాడు. దీన్ని బట్టే అర్ధం చేసుకోచ్చు.. బుమ్రా బ్యాటర్లపై ఏ మేరకు ఒత్తిడి తెస్తున్నాడో. డాట్ బాల్స్ తో పాటుగా 15 వికెట్లు తీసి బ్యాటర్లకు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు. అయినప్పటికీ ఈ విశ్వసమరంలో బుమ్రాకు అనుకున్నంత పేరు రావట్లేదనే చెప్పుకోవాలి. షమీ, జడేజా, కుల్దీప్, సిరాజ్ ల గురించే ఎక్కువ మాట్లాడుకుంటున్నారు తప్పితే.. ఇన్ని అద్భుతమైన గణాంకాలతో వరల్డ్ కప్ లో టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న బుమ్రాకు తగిన గుర్తింపు దక్కట్లేదు. దీంతో అతడి కష్టం ఎవరికీ కనిపించడం లేదా? అంటూ ప్రశ్నిస్తున్నారు ఫ్యాన్స్. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments