SNP
వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా తమ చివరి లీగ్‌కు మ్యాచ్‌కు రెడీ అవుతుంది. నెదర్లాండ్స్‌తో ఆదివారం నామమాత్రపు మ్యాచ్ ఆడనుంది. అయితే.. ఇప్పటి వరకు టీమిండియా అద్భుత ప్రదర్శన కనబర్చింది. మరి సక్సెస్‌ఫుల్ జర్నీలో టీమిండియా స్టార్ పేసర్ బుమ్రా ఎవరికి కనిపించకుండా జట్టు అద్భుతమైన సపోర్ట్ అందిస్తున్నాడు. మరి అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా తమ చివరి లీగ్‌కు మ్యాచ్‌కు రెడీ అవుతుంది. నెదర్లాండ్స్‌తో ఆదివారం నామమాత్రపు మ్యాచ్ ఆడనుంది. అయితే.. ఇప్పటి వరకు టీమిండియా అద్భుత ప్రదర్శన కనబర్చింది. మరి సక్సెస్‌ఫుల్ జర్నీలో టీమిండియా స్టార్ పేసర్ బుమ్రా ఎవరికి కనిపించకుండా జట్టు అద్భుతమైన సపోర్ట్ అందిస్తున్నాడు. మరి అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
SNP
వన్డే వరల్డ్ కప్ 2023 చివరి దశకు చేరుకుంది. శనివారం జరిగే రెండు మ్యాచ్‌లను వదిలేస్తే.. కేవలం మరో నాలుగు మ్యాచ్‌లే మిగిలి ఉన్నాయి. అందులో ఒకటి లీగ్ మ్యాచ్ కాగా, రెండు సెమీ ఫైనల్స్, ఫైనల్ ఉన్నాయి. దాదాపు నెల రోజులకు పైగా క్రికెట్ అభిమానులకు వినోదాన్ని అందించిన ప్రపంచ కప్ మెగా టోర్నీ ఈ నాలుగు మ్యాచ్‌లతో ముగుస్తుంది. ఇండియా-నెదర్లాండ్స్ మధ్య ఆదివారం జరగనున్న చివరి లీగ్ మ్యాచ్ నామమాత్రమే అయినా.. సెమీస్‌కి ముందు టీమిండియాకు మంచి ప్రాక్టీస్ లభించనుంది. ఇక ఈ నెల 15న టీమిండియా.. దాదాపు న్యూజిలాండ్‌తో మ్యాచ్ ఆడనుంది. అయితే.. ఇక్కడి వరకు భారత జట్టు ఎంతో సక్సెస్‌ఫుల్‌గా దూసుకొచ్చింది. ఒక్కటంటే.. ఒక్క ఓటమి కూడా ఎదురుకాలేదు రోహిత్ సేన.
ఈ అద్భుతమైన జర్నీకి జట్టులోని ఆటగాళ్లంతా తోడ్పాటు అందిస్తున్నారు. అయితే.. బ్యాటర్లు పరుగులు చేస్తూ, బౌలర్లు వికెట్లు తీస్తూ తమ సత్తా చాటుతుంటే.. సీనియర్ స్టార్ బౌలర్ బుమ్రా మాత్రం వేరే విధంగా జట్టుకు బ్యాక్‌బోన్‌గా నిలుస్తున్నాడు. జట్టు విజయాల్లో కనిపించని సీక్రెట్‌గా ఉంది బుమ్రా కష్టం. అతను టీమ్‌కు ఏ విధంగా తన సపోర్ట్‌ను అందిస్తున్నాడో ఇప్పుడు చూద్దాం.. క్రికెట్ అభిమానులే కాదు, క్రికెట్ పండితులు సైతం ఆశ్చర్యపోయే ఒక నిజం ఏంటో తెలుసా? ఈ వరల్డ్ కప్‌లో బుమ్రా వేసిన డాట్స్ బాల్స్ గురించి తెలుసుకుంటే.. అంతా అవాక్కు అవుతారు. వరల్డ్ కప్ బుమ్రా వేసిన మొత్తం బంతులు 383. అయితే అందులో డాట్ బాల్స్ ఎన్నో తెలుసా.. ఏకంగా 268. ఈ వరల్డ్ కప్‌లో అత్యధిక డాట్ బాల్స్ వేసిన బౌలర్ బుమ్రానే. అతని తర్వాత న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ 245 డాట్ బాల్స్‌తో రెండో ప్లేస్‌లో ఉన్నాడు.
కాగా, బుమ్రా వేసిన బౌలింగ్‌తో దాదాపు 70 పర్సంటెజ్ బంతులకు ప్రత్యర్థి బ్యాటర్లు పరుగులే చేయలేకపోయారు. ముఖ్యంగా భారీగా పరుగులు వచ్చే పవర్ ప్లేలో బుమ్రా 204 బంతుల్లో 161 బంతులను డాట్స్ బాల్స్‌గా వేశాడు. బుమ్రా ఇలా ప్రత్యర్థి బ్యాటర్ల చేతులు కట్టేయడంతోనే తీవ్ర ఒత్తిడికి లోనై వికెట్లు పరేసుకున్నారు. బుమ్రా వేస్తున్న కట్టుదిట్టమైన ఓవర్లతోనే సిరాజ్, షమీ లబ్దిపొందుతున్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. బుమ్రా ఓవర్‌లో రన్స్ రాకపోవడంతో సిరాజ్ ఓవర్‌ను టార్గెట్ చేస్తున్న బ్యాటర్లు వేగంగా ఆడే క్రమంలో అవుట్ అవుతున్నారు. సిరాజ్, షమీ కూడా అద్భుతంగా బౌలింగ్ వేస్తున్నా.. ఒక ఎండ్‌లో బుమ్రా అస్సలు రన్స్ ఇవ్వకుండా ఒత్తిడి పెంచడంతోనే వికెట్లు వెంటవెంటనే పడుతున్నాయని క్రికెట్ నిపుణులు అంటున్నారు. ఒక వైపు తాను వికెట్లు తీయడమే కాకుండా.. తన కట్టుదిట్టమైన బౌలింగ్‌తో జట్టులోని మిగతా బౌలర్లు కూడా బుమ్రా వికెట్లు అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ వరల్డ్ కప్‌లో టీమిండియా బౌలింగ్ ఇంత స్ట్రాంగ్‌గా ఉందంటే.. అది బుమ్రా వల్లే. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Jasprit Bumrah has bowled 161 dot balls out of 204 balls he bowled in Powerplay in this World Cup.
– Bumrah is next level…!!! 🤯 pic.twitter.com/nLFocEqIsc
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 10, 2023