Nidhan
భారత పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రాపై మాజీ క్రికెటర్ లక్ష్మీపతి బాలాజీ ప్రశంసల జల్లులు కురిపించాడు. ఏకంగా ఇద్దరు లెజెండరీ పేసర్స్తో బుమ్రాను పోల్చాడు.
భారత పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రాపై మాజీ క్రికెటర్ లక్ష్మీపతి బాలాజీ ప్రశంసల జల్లులు కురిపించాడు. ఏకంగా ఇద్దరు లెజెండరీ పేసర్స్తో బుమ్రాను పోల్చాడు.
Nidhan
జస్ప్రీత్ బుమ్రా.. క్రికెట్లో ఎక్కడ విన్నా ఇదే పేరు వినిపిస్తోంది. దీనికి కారణం అతడి బౌలింగ్ పెర్ఫార్మెన్స్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బ్యాటర్లు, స్పిన్నర్ల గనిగా చెప్పునే ఇండియా నుంచి బుమ్రా లాంటి ఫాస్ట్ బౌలర్ వస్తాడని ఎవరూ ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. అంతలా క్రికెట్ దునియా మీద తన పెత్తనం చెలాయిస్తున్నాడతను. టీ20, వన్డే, టెస్టు.. మూడు ఫార్మాట్లలోనూ నంబర్ వన్ బౌలర్‌గా అవతరించాడతను. ఫార్మాట్ ఏదైనా, అవతల ఉన్నది ఎంత తోపు బ్యాటర్ అయినా సరే.. భారత పేసుగుర్రానికి తలొగ్గాల్సిందే. గత వన్డే వరల్డ్ కప్-2023 నుంచి భీకర ఫామ్‌లో ఉన్నాడు బుమ్రా. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లోనూ బ్యాటర్లకు నిద్రలేని రాత్రులు అంటే ఏంటో చూపిస్తున్నాడు. ఇంత బాగా పెర్ఫార్మ్ చేస్తున్న బుమ్రాను మాజీ పేసర్ లక్ష్మీపతి బాలాజీ మెచ్చుకున్నాడు. ఆ ఇద్దరు లెజెండ్స్‌కు బుమ్రా సమానమని చెప్పాడు.
భీకర ఫామ్‌లో ఉన్న బుమ్రా కనీసం 150 వికెట్లు తీసిన వారి జాబితాలో యావరేజ్లో అందరి కంటే అత్యుత్తమంగా నిలిచాడు. 20.19 సగటుతో చాలా మంది లెజెండ్స్‌ను వెనక్కి నెట్టి నంబర్ వన్ ప్లేసును దక్కించున్నాడు. ఈ నేపథ్యంలో బుమ్రాపై బాలాజీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. దిగ్గజ పేస్ బౌలర్లు రిచర్డ్ హ్యాడ్లీ, మాల్కమ్ మార్షమ్తో జస్ప్రీత్ను పోల్చాడు. వాళ్లిద్దరికీ అతడు సమానమని అన్నాడు. ‘బుమ్రా బౌలింగ్ యావరేజ్ 20.19గా ఉంది. అతడు ఇప్పటికే 150 వికెట్లు పడగొట్టాడు. అలాంటి నంబర్లను మాల్కమ్ మార్షల్, రిచర్డ్ హ్యాడ్లీ లాంటి లెజెండ్స్ నుంచి వినేవాళ్లం. ఇది అద్భుతం’ అని బాలాజీ ప్రశంసల జల్లులు కురిపించాడు. బుమ్రా ఉన్న ఫామ్, అతడి బౌలింగ్ సూపర్బ్ అని మెచ్చుకున్నాడు.
‘బుమ్రా బౌలింగ్ వేసే యాంగిల్ చాలా వైవిధ్యం. అది అతడికి దేవుడు ఇచ్చిన వరం. వికెట్లకు దూరం నుంచి వచ్చి అతడు వేసే కొన్ని బంతులు ఫిజిక్స్‌కు కూడా అంతుచిక్కవు. పిచ్‌తో సంబంధం లేకుండా అద్భుతంగా బౌలింగ్ చేయగలగడం బుమ్రా స్పెషాలిటీ. ఇది అతడి సత్తాకు నిదర్శనం. పిచ్ ఎలాంటిదైనా తాను అనుకున్నట్లు బౌలింగ్ చేయడం, వికెట్లు తీయగలగడం అతడ్ని మిగతా బౌలర్ల కంటే ప్రత్యేకంగా మార్చేసింది. ఇంజ్యురీ తర్వాత కమ్‌బ్యాక్ ఇచ్చినప్పటి నుంచి బుమ్రా మరింత డేంజరస్‌గా కనిపిస్తున్నాడు. ఆస్ట్రేలియా బౌలింగ్ గ్రేట్ డెన్నిస్ లిల్లీ మాదిరిగా అతడు బంతులు విసురుతున్నాడు. అప్పట్లో లిల్లీ కూడా ఇలాగే గాయాలతో ఇబ్బంది పడ్డాడు. అయితే ఇంజ్యురీ తర్వాత మరింత ప్రమాదకర బౌలర్‌గా మారాడు. బుమ్రా కూడా అలాగే పెర్ఫార్మ్ చేస్తున్నాడు. అతడి పేస్, బ్యాటర్లను భయపెట్టే తత్వం అస్సలు మారలేదు. ఒక బౌలర్‌గా చెబుతున్నా ఇలా చేయడం అసాధ్యం’ అని బాలాజీ వ్యాఖ్యానించాడు. మరి.. బుమ్రాపై బాలాజీ చేసిన వ్యాఖ్యల మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
ఇదీ చదవండి: Pathum Nissanka: లంక ఓపెనర్ డబుల్ సెంచరీ.. 136 బంతుల్లోనే..!