iDreamPost

Pathum Nissanka: లంక ఓపెనర్ డబుల్ సెంచరీ.. 136 బంతుల్లోనే..!

  • Published Feb 09, 2024 | 8:59 PMUpdated Feb 09, 2024 | 8:59 PM

శ్రీలంక ఓపెనర్ పతుమ్ నిస్సాంక రికార్డు సృష్టించాడు. డబుల్ సెంచరీతో అరుదైన ఘనత సాధించాడు. 24 ఏళ్ల రికార్డును బ్రేక్ చేశాడు.

శ్రీలంక ఓపెనర్ పతుమ్ నిస్సాంక రికార్డు సృష్టించాడు. డబుల్ సెంచరీతో అరుదైన ఘనత సాధించాడు. 24 ఏళ్ల రికార్డును బ్రేక్ చేశాడు.

  • Published Feb 09, 2024 | 8:59 PMUpdated Feb 09, 2024 | 8:59 PM
Pathum Nissanka: లంక ఓపెనర్ డబుల్ సెంచరీ.. 136 బంతుల్లోనే..!

ఏ ఆటలోనైనా రికార్డులు బ్రేక్ అవడం మామూలే. క్రికెట్​లో కూడా పాత రికార్డులు బద్దలవుతుంటాయి.. కొత్తవి నమోదవుతుంటాయి. అయితే తన ఉనికి ప్రశ్నార్థకంగా మారిన జట్టు నుంచి రికార్డులు వస్తే మాత్రం అద్భుతమనే చెప్పాలి. అది ఆ టీమ్​కే కాదు.. జెంటిల్మన్ గేమ్​కు కూడా ఎంతో మేలు చేస్తుంది. తాజాగా ఓ శ్రీలంక క్రికెటర్ డబుల్ సెంచరీతో మోత మోగించాడు. అతడే పతుమ్ నిస్సాంక. ఆఫ్ఘానిస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో అతడు ద్విశతకాన్ని నమోదు చేశాడు. కేవలం 136 బంతుల్లోనే డబుల్ సెంచరీ బాదేశాడు నిస్సాంక. తద్వారా 24 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న ఓ అరుదైన రికార్డును తన పేరు మీద లిఖించుకున్నాడు. ఒక్క ఇన్నింగ్స్​తో నిస్సాంక అందుకున్న ఘనతలు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..

ఆఫ్ఘానిస్థాన్​పై అద్భుత ఇన్నింగ్స్​తో అలరించిన నిస్సాంక.. వన్డేల్లో డబుల్ సెంచరీ బాదిన ఫస్ట్ లంకన్ ప్లేయర్​గా చరిత్ర సృష్టించాడు. తద్వారా ఆ దేశ దిగ్గజం సనత్ జయసూర్య అత్యధిక వ్యక్తిగత స్కోరు (189) 24 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. 50 ఓవర్ల క్రికెట్​లో అత్యంత వేగంగా డబుల్ సెంచరీ చేసిన మూడో ఆటగాడిగా అతడు రికార్డులకు ఎక్కాడు. ఈ క్రమంలో భారత డాషింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ , విండీస్ వీరుడు క్రిస్ గేల్ రికార్డులను బ్రేక్ చేశాడు. వీరూ 140 బంతుల్లో, గేల్ 138 బంతుల్లో డబుల్ సెంచరీ మార్క్​ను అందుకున్నారు. ఇక, ఆఫ్ఘాన్​తో మ్యాచ్​లో మొత్తంగా 139 బంతులు ఎదుర్కొన్న నిస్సాంక 210 పరుగులు చేసి నాటౌట్​గా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్​లో 20 బౌండరీలుతో పాటు 8 భారీ సిక్సులు ఉన్నాయి.

కాగా, వన్డే వరల్డ్ కప్​లో దారుణంగా ఫెయిలైంది శ్రీలంక. దీంతో ఆ దేశ క్రికెట్ బోర్డును రద్దు చేయడం, ఐసీసీ బ్యాన్​ లాంటి వరుస పరిణామాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు క్రికెటర్లు. ఈ తరుణంలో నిస్సాంక ఆడిన అద్వితీయ ఇన్నింగ్స్​ అందర్నీ ఊరట పరిచిందని చెప్పొచ్చు. అందుకే ఇది స్పెషల్ ఇన్నింగ్స్​ అని ఆ దేశ అభిమానులు నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. ఇక, నిస్సాంక డబుల్ సెంచరీ కారణంగా ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్​కు దిగిన లంక 381 పరుగుల భారీ స్కోరు చేసింది. మరో ఓపెనర్ అవిష్​క ఫెర్నాండో (88) కూడా మంచి ఇన్నింగ్స్​తో నిస్సాంకకు సహకారం అందించాడు. కుశాల్ మెండిస్ (16) ఫెయిలైనా.. సదీర సమరవిక్రమ (45) ఆకట్టుకున్నాడు.

ఆఖర్లో నిస్సాంక భారీ షాట్లతో విరుచుకుపడటంతో లంక స్కోరు బోర్డు బుల్లెట్ స్పీడుతో దూసుకెళ్లింది. ఆ తర్వాత ఛేజింగ్​కు దిగిన ఆఫ్ఘానిస్థాన్ ప్రస్తుతం 9.2 ఓవర్లలో 5 వికెట్లకు 58 స్కోరుతో ఉంది. ఓపెనర్లు రెహ్మానుల్లా గుర్బాజ్ (1), ఇబ్రహీం జాద్రాన్ (4)తో పాటు రెహ్మత్ షా (7), హష్మతుల్లా షాహిదీ (7), గుల్బదీన్ నయీబ్ (16) కూడా ఫెయిలయ్యారు. బ్యాటర్లంతా మూకుమ్మడిలా ఫెయిలవడంతో ఆఫ్ఘాన్ స్కోరు 100 దాటడం కూడా కష్టంగా ఉంది. లంక బౌలర్లలో ప్రమోద్ మదుషాన్ 3 వికెట్లు తీయగా.. దుష్మంత చమీరాకు 2 వికెట్లు దక్కాయి. మరి.. లంక ఓపెనర్ నిస్సాంక డబుల్ సెంచరీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి