ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు ఆడుతున్న జస్ప్రీత్ బుమ్రా ఫ్రాంచైజీ మారుతున్నాడని సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తోంది.
ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు ఆడుతున్న జస్ప్రీత్ బుమ్రా ఫ్రాంచైజీ మారుతున్నాడని సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తోంది.
టీమిండియా స్టార్ క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. అద్భుతమైన వేగం, కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌తో అతడు వేసే బంతులకు బ్యాట్స్‌మెన్ దగ్గర ఆన్సర్ ఉండదు. ఈ స్పీడ్‌స్టర్ వేసే యార్కర్లు, బౌన్సర్లకు ఎంతటి బ్యాటర్‌కైనా వెన్నులో వణుకు పుట్టాల్సిందే. గత కొన్నేళ్లుగా నిలకడగా రాణిస్తూ భారత జట్టులోని అన్ని ఫార్మాట్లలోనూ కీలక ప్లేయర్లలో ఒకడిగా మారాడు బుమ్రా. టీమిండియా బౌలింగ్ యూనిట్‌ను చూసి అపోజిషన్ టీమ్స్ భయపడుతున్నాయంటే అందుకు బుమ్రా ప్రధాన కారణమని చెప్పాలి. అలాంటి బుమ్రా ఇటు ఇంటర్నేషనల్ లెవల్‌తో పాటు అటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లోనూ దుమ్మురేపుతున్నాడు. మెగా లీగ్‌లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడీ పేసుగుర్రం. ఫెంటాస్టిక్ స్పెల్స్‌తో ముంబైని ఎన్నో మ్యాచుల్లో సింగిల్ హ్యాండ్‌తో గెలిపించాడు బుమ్రా.
బుమ్రా లేని ముంబై ఇండియన్స్ బౌలింగ్ అటాక్‌ను ఊహించడమే కష్టంగా ఉంటుంది. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇది నిజమయ్యేలా ఉంది. ముంబైని బుమ్రా వీడనున్నాడనే వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. 2013 నుంచి ముంబైకి ఆడుతున్న బుమ్రా.. ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కు మారుతున్నాడని సోషల్ మీడియాలో రూమర్స్ వస్తున్నాయి. బుమ్రా ముంబైని వీడటానికి హార్దిక్ పాండ్యానే కారణమని వినికిడి. గత రెండేళ్లుగా గుజరాత్ టైటాన్స్‌కు ఆడుతూ వస్తున్న హార్దిక్‌ను ట్రేడింగ్‌లో భాగంగా ఈసారి ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. ఆ టీమ్ కెప్టెన్ రోహిత్ శర్మ కెరీర్ ఎండింగ్లో ఉంది. కాబట్టి హార్దిక్‌ను తదుపరి కెప్టెన్ చేస్తారని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో ముంబై ఇండియన్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో బుమ్రా అన్‌ఫాలో చేయడం చర్చనీయాంశంగా మారింది.
రోహిత్ శర్మ తర్వాత తననే కెప్టెన్ చేస్తారని బుమ్రా అనుకున్నాడట. ముంబైకి 13 ఏళ్లుగా ఆడుతున్న ఈ స్పీడ్‌స్టర్‌కు.. ఈ మధ్యలో ఎన్ని ఆఫర్లు వచ్చినా వద్దనుకున్నాడట. ముంబై మీద ఉన్న ప్రేమతో ఆఫర్లను కాదని ఫ్రాంచైజీపై విధేయతను చూపితే.. మళ్లీ పాండ్యాను తీసుకురావడం ఏంటని బుమ్రా సీరియస్‌గా ఉన్నాడని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది. హార్దిక్‌ను తీసుకురావడం వల్ల కెప్టెన్సీ రేసులో తాను లేనని ఇన్‌డైరెక్ట్‌గా సిగ్నల్స్ ఇచ్చారని అతడు భావిస్తున్నాడట. అందుకే ఇన్‌స్టాలో ముంబై ఇండియన్స్‌ను అన్‌ఫాలో చేశాడని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ‘కొన్నిసార్లు సైలెంట్‌గా ఉండటమే బెస్ట్ ఆన్సర్’ అని ఇన్‌స్టా స్టోరీలో బుమ్రా పెట్టిన స్టోరీ ఇప్పుడు వైరల్‌గా మారింది. ముంబై యాజమాన్యాన్ని టార్గెట్ చేసుకునే అతడు ఈ పోస్ట్ పెట్టాడని అంటున్నారు. అతడితో ఆర్సీబీ మేనేజ్మెంట్ చర్చలు జరిపిందని చెబుతున్నారు. ఈ డిస్కషన్స్ ఓకే అయితే బుమ్రా ఆర్సీబీలోకి వెళ్లిపోవడం ఖాయమని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మరి.. ఆర్సీబీలోకి బుమ్రా అంటూ వస్తున్న వార్తలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: రోహిత్, కోహ్లీ వల్ల కానిది.. రుతురాజ్ సాధించాడు! సాహో రుతు..