iDreamPost

రోహిత్, కోహ్లీ వల్ల కానిది.. రుతురాజ్ సాధించాడు! సాహో రుతు..

  • Author singhj Updated - 07:37 PM, Wed - 29 November 23

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి స్టార్ బ్యాటర్లకు సాధ్యం కాని ఓ ఫీట్​ను రుతురాజ్ గైక్వాడ్ సాధించాడు. ఆసీస్​తో జరుగుతున్న మ్యాచ్​లో రుతు చరిత్ర సృష్టించాడు.

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి స్టార్ బ్యాటర్లకు సాధ్యం కాని ఓ ఫీట్​ను రుతురాజ్ గైక్వాడ్ సాధించాడు. ఆసీస్​తో జరుగుతున్న మ్యాచ్​లో రుతు చరిత్ర సృష్టించాడు.

  • Author singhj Updated - 07:37 PM, Wed - 29 November 23
రోహిత్, కోహ్లీ వల్ల కానిది.. రుతురాజ్ సాధించాడు! సాహో రుతు..

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టీ20లో భారత్ దుమ్మురేపుతోంది. ఈ మ్యాచ్​లో టాస్ నెగ్గిన అపోజిషన్ టీమ్ కెప్టెన్ మాథ్యూ వేడ్ టీమిండియాను బ్యాటింగ్​కు ఆహ్వానించాడు. దీంతో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన మన జట్టుకు మంచి స్టార్ట్ లభించలేదు. యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్​ (6)ను​ క్రీజులో కుదురుకోక ముందే పెవిలియన్​కు పంపాడు బెరెన్​డార్ఫ్. బాల్ బాగా స్వింగ్ అవుతుండటంతో ఆసీస్ పేసర్లు చెలరేగి బౌలింగ్ చేశారు. జైస్వాల్​ను ఔట్ చేసిన ఊపులో ఇషాన్ కిషన్ (0)ను కూడా వెనక్కి పంపారు. రిచర్డ్​సన్ బౌలింగ్​లో ఇషాన్ గోల్డెన్ డక్​ అయ్యాడు. అయితే అనంతరం వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (39)తో కలసి ఇన్నింగ్స్​ను నడిపించాడు రుతురాజ్ గైక్వాడ్ (123 నాటౌట్).

రుతురాజ్-సూర్య ఆస్ట్రేలియా బౌలర్లపై అటాకింగ్​కు దిగారు. ముఖ్యంగా రుతు అయితే ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సూర్య ఔటైనా తిలక్ వర్మ (31 నాటౌట్) సాయంతో టీమ్​కు భారీ స్కోరును అందించాడు. ఆఖరి ఓవర్లలో ఆసీస్ బౌలర్లను చీల్చిచెండాడాడు రుతురాజ్. మొదటి 21 బంతుల్లో 21 రన్స్ చేసిన అతడు.. ఆ తర్వాత 31 బంతుల్లో ఏకంగా 81 రన్స్ చేశాడు. రుతు ఇన్నింగ్స్​లో 13 ఫోర్లు, 7 సిక్సులు ఉన్నాయి. దీన్ని బట్టే అతడి బ్యాటింగ్ విధ్వంసం ఏ విధంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. లాస్ట్ ఓవర్ వేసేందుకు వచ్చిన గ్లెన్ మాక్స్​వెల్​కు అతడు చుక్కలు చూపించాడు.

మాక్స్​వెల్ వేసిన ఆఖరి ఓవర్​లో 6 బంతులు ఆడిన రుతురాజ్ ఏకంగా 30 రన్స్ పిండుకున్నాడు. అందుకే ఒక దశలో 180 చేసినా గొప్పే అనుకున్నా టీమిండియా.. ఏకంగా 222 రన్స్ చేసింది. రుతు కెరీర్​లో ఇది మెయిడిన్ సెంచరీ. టీ20ల్లో ఆసీస్​పై ఫస్ట్ సెంచరీ కొట్టిన ఇండియన్ బ్యాటర్​గానూ రుతు చరిత్ర సృష్టించాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి స్టార్ బ్యాటర్లకు కూడా సాధ్యం కాని రీతిలో కంగారూలపై సెంచరీ బాది తానేంటో మరోమారు అతడు ప్రూవ్ చేసుకున్నాడు. మరి.. రుతురాజ్ ఇన్నింగ్స్​ మీకు ఎలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: పాండ్యా.. ఇంత డబ్బు పిచ్చి ఎందుకు? కోహ్లీని చూసి బుద్ధి తెచ్చుకో..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి