వరల్డ్ కప్ లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో టీమిండియా స్పీడ్ గన్ బుమ్రా చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్ లో తీసింది ఒకే ఒక్క వికెట్ మాత్రమే అయినప్పటికీ.. నయా రికార్డు నెలకొల్పాడు.
వరల్డ్ కప్ లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో టీమిండియా స్పీడ్ గన్ బుమ్రా చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్ లో తీసింది ఒకే ఒక్క వికెట్ మాత్రమే అయినప్పటికీ.. నయా రికార్డు నెలకొల్పాడు.
వరల్డ్ కప్ లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతూనే ఉంది. ఈ మెగాటోర్నీలో దుమ్మురేపుతూ.. వరుసగా ఏడో విజయాన్ని తన ఖాతాలో వేసుకుని దర్జాగా సెమీస్ లోకి అడుగుపెట్టింది. గురువారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో 302 పరుగుల భారీ తేడాతో లంకను చిత్తుచేసింది. తొలుత టీమిండియా బ్యాటర్లు కోహ్లీ, అయ్యర్, గిల్ చెలరేగగా.. ఆ తర్వాత బుమ్రా, షమీ, సిరాజ్ నిప్పులు చెరిగారు. ప్రారంభం నుంచే లంక బ్యాటర్లకు చుక్కలు చూపించారు. ఈ పేస్ త్రయం ధాటికి కేవలం 55 పరుగులకే కుప్పకూలింది ప్రత్యర్థి టీమ్. ముఖ్యంగా షమీ మరోసారి విజృంభించి.. 5 వికెట్లు పడగొట్టి లంక నడ్డివిరిచాడు. ఇక ఈ మ్యాచ్ లో ఒకే ఒక్క వికెట్ తీసిన బుమ్రా సరికొత్త చరిత్ర సృష్టించాడు.
వాంఖడే స్టేడియంలో గురువారం నిప్పుల వర్షం కురిపించారు టీమిండియా బౌలర్లు. లంక బ్యాటర్లకు చుక్కలు చూపిస్తూ.. మరోసారి తక్కువ స్కోర్ కే ఆలౌట్ చేసి వరల్డ్ కప్ లో వరుసగా ఏడో విజయాన్ని నమోదు చేసింది. ఫస్ట్ బ్యాటింగ్ లో చెలరేగిన టీమిండియా.. ఆ తర్వాత బౌలింగ్ లో ఎవ్వరూ ఊహించని విధంగా దుమ్ముదులిపింది. 358 పరుగుల భారీ లక్ష్యంలో బరిలోకి దిగిన లంక భారత పేసర్ల ధాటికి.. 55 రన్స్ కే కుప్పకూలింది. ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా స్పీడ్ గన్ జస్ప్రీత్ బుమ్రా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఒకే ఒక్క వికెట్ మాత్రమే తీసిన బుమ్రా వరల్డ్ కప్ లో చరిత్ర సృష్టించాడు.
ప్రపంచ కప్ హిస్టరీలోనే ఇన్నింగ్స్ తొలి బంతికి వికెట్ తీసిన మెుట్టమెుదటి బౌలర్ గా రికార్డుల్లోకి ఎక్కాడు బుమ్రా. లంక బ్యాటర్ పాథుమ్ నిశాంక ను ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేసి.. ఈ ఘనత సాధించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 357 పరుగుల భారీ స్కోర్ చేసింది. జట్టులో గిల్(92), కోహ్లీ(88), అయ్యర్(82), జడేజా(35) పరుగులతో రాణించారు. లంక బౌలర్లలో మధుశంక 5 వికెట్లతో సత్తాచాటాడు.
అనంతరం 358 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి గిదిగిన లంక ఘోరంగా విఫలం అయ్యింది. బుమ్రా, షమీ, సిరాజ్ ల పేస్ ధాటిని తట్టుకోలేక కేవలం 55 రన్స్ కే కుప్పకూలింది. బౌలర్ కసున్ రజిత చేసిన 14 పరుగులే లంక ఇన్నింగ్స్ లో అత్యధిక స్కోర్ కావడం గమనార్హం. భారత బౌలర్లలో షమీ 5, సిరాజ్ 3, బుమ్రా, జడేజా తలా వికెట్ పడగొట్టారు. మరి వరల్డ్ కప్ లో నయా చరిత్ర సృష్టించిన బుమ్రాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Historic.
Bumrah becomes the first Indian to take a wicket in the first ball of the innings in World Cup history. pic.twitter.com/XI1MVeIcn7
— Johns. (@CricCrazyJohns) November 2, 2023