iDreamPost
android-app
ios-app

Jasprit Bumrah: చరిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా.. రికార్డులందు ఈ రికార్డు వేరయా..!

  • Published Jun 06, 2024 | 3:09 PM Updated Updated Jun 06, 2024 | 3:09 PM

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డును నెలకొల్పాడు. ఈ క్రమంలోనే ఈ ఘనత సాధించిన ఇండియన్ బౌలర్ గా రికార్డుల్లోకి ఎక్కాడు.

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డును నెలకొల్పాడు. ఈ క్రమంలోనే ఈ ఘనత సాధించిన ఇండియన్ బౌలర్ గా రికార్డుల్లోకి ఎక్కాడు.

Jasprit Bumrah: చరిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా.. రికార్డులందు ఈ రికార్డు వేరయా..!

టీ20 వరల్డ్ కప్ 2024 లో భాగంగా ఐర్లాండ్ తో జరిగిన తొలి మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు నిప్పులు చెరిగారు. దాంతో ఐరిష్ బ్యాటర్లు ఏ దశలోనూ క్రీజ్ లో నిలబడే సాహసం చేయలేదు. భారత బౌలర్లను ఎదుర్కొనలేక కేవలం 96 రన్స్ కే కుప్పకూలింది ఐర్లాండ్ టీమ్. ఇక ఈ మ్యాచ్ లో యార్కర్ల కింగ్ జస్ప్రీత్ బుమ్రా బుల్లెట్స్ లాంటి బంతులతో ఐర్లాండ్ బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టించాడు. ఈ మ్యాచ్ లో మూడు ఓవర్లలో ఒక మెయిడిన్ వేసి కేవలం 6 రన్స్ మాత్రమే ఇచ్చి రెండు కీలక వికెట్లు కూల్చాడు. ఈ క్రమంలోనే ఓ రేర్ ఫీట్ ను తన ఖతాలో వేసుకున్నాడు బుమ్రా. ఆ వివరాల్లోకి వెళితే..

సొట్టి ప్రపంచ కప్ తొలి మ్యాచ్ లో టీమిండియా బోణీ కొట్టింది. ఫస్ట్ మ్యాచ్ లో ఐర్లాండ్ పై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ లో టీమిండియా పేస్ దళం దాటిని తట్టుకోలేక కేవలం 96 రన్స్ కే చాపచుట్టేసింది ఐర్లాండ్. హార్దిక్ పాండ్యా 3 వికెట్లు, బుమ్రా, అర్షదీప్ సింగ్ తలా రెండు వికెట్లతో రాణించారు. అనంతరం 97 పరుగుల టార్గెట్ ను 12.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది టీమిండియా. రోహిత్ శర్మ(52, రిటైర్డ్ హార్డ్), రిషబ్ పంత్ (36*) పరుగులతో రాణించారు.

కాగా.. ఈ మ్యాచ్ ద్వారా అరుదైన ఘనతను సాధించాడు టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా. ఈ మ్యాచ్ లో 6వ ఓవర్లో బంతిని అందుకున్న బుమ్రా.. ఆ ఓవర్లో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా మెయిడెన్ చేశాడు. లైన్ లెంగ్త్ బంతులతో ఐరిష్ బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టాడు ఈ యార్కర్ల కింగ్. ఈ మ్యాచ్ లో 3 ఓవర్లు వేసి కేవలం 6 రన్స్ మాత్రామే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. దాంతో ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు బుమ్రా. టీ20ల్లో అత్యధిక మెయిడెన్ ఓవర్లు వేసిన భారత బౌలర్ గా జస్ప్రీత్ బుమ్రా ఘనత వహించాడు. ఈ క్రమంలోనే భువనేశ్వర్ కుమార్ రికార్డును బ్రేక్ చేశాడు. బుమ్రా ఇప్పటి వరకు 63 మ్యాచ్ ల్లో 11 ఓవర్లు మెయిడెన్ చేయగా.. భువనేశ్వర్ కుమార్ 87 మ్యాచ్ ల్లో 10 ఓవర్లు మెయిడెన్ చేశాడు. ఇక ఈ జాబితాలో ఉగాండ, కెన్యా బౌలర్లు అగ్రస్థానంలో ఉండటం విశేషం. ఉగాండ బౌలర్ ఎస్ నుబుసుగా ఏకంగా 15 ఓవర్లు మెయిడెన్ చేసి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. సెకండ్ ప్లేస్ లో 12 ఓవర్లు మెయిడెన్ చేసి కేన్యా బౌలర్ సోంగోచ్ ఉన్నాడు.