పాక్ కొత్త కోచ్‌గా గిల్లెస్పీ! రాగానే వెరైటీ స్టేట్మెంట్.. నవ్వకండి సీరియస్‌ మ్యాటర్‌!

Jason Gillespie, Pakistan, PCB: పాకిస్థాన్‌ టెస్ట్‌ జట్టుకు కొత్త కోచ్‌గా వచ్చిన గిల్లెస్పీ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పాక్‌ టీమ్‌ గురించి పూర్తిగా తెలుసుకోకుండా ఆయన మాట్లాడిన మాటలు నవ్వుల పాలవుతున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Jason Gillespie, Pakistan, PCB: పాకిస్థాన్‌ టెస్ట్‌ జట్టుకు కొత్త కోచ్‌గా వచ్చిన గిల్లెస్పీ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పాక్‌ టీమ్‌ గురించి పూర్తిగా తెలుసుకోకుండా ఆయన మాట్లాడిన మాటలు నవ్వుల పాలవుతున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

క్రికెట్‌లో కామెడీకి కేరాఫ్‌ అడ్రస్‌ అయిన టీమ్‌ పాకిస్థాన్‌. అప్పుడప్పుడు సంచలన ఆట తీరుతో వార్తల్లో నిలిచే పాక్‌.. కామెడీ యాంగిల్‌లో మాత్రం ఎప్పుడూ హెడ్‌లైన్స్‌లో ఉంటుంది. టీ20 వరల్డ్‌ కప్‌ కోసం ఆర్మీ ట్రైనింగ్‌ తీసుకోవడం, మెత్తటి పరుపులు కింద పెట్టుకుని ఫీల్డింగ్‌ ప్రాక్టీస్‌ చేయడం, గ్రౌండ్‌లో సులువైన క్యాచ్‌లు వదిస్తే.. నవ్వుల పాలవ్వడం ఒక్క పాకిస్థాన్‌ టీమ్‌కే చెల్లింది. ఇలాంటి టీమ్‌ను నంబర్‌ వన్‌ ప్లేస్‌లో నిలుపుతానంటూ.. ఒక కొత్త కోచ్‌ భారీ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. అతనిచ్చిన స్టేట్‌మెంట్‌ విని పాకిస్థాన్‌ క్రికెట్‌ అభిమానులే నవ్వుకుంటున్నారు. ఇంతకీ ఆ కోచ్‌ ఎవరు? అతను ఏమన్నాడో ఇప్పుడు చూద్దాం..

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ జాసన్ గిల్లెస్పీని పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు.. టెస్ట్‌ టీమ్‌కు హెడ్‌ కోచ్‌గా నియమించింది. ఆసీస్‌ తరఫున 71 టెస్టులు, 91 వన్డేలు, ఒక టీ20 మ్యాచ్‌ ఆడిన అనుభవం గిల్లెస్పీకి ఉంది. టెస్టుల్లో 259 వికెట్లు, 1218 పరుగులు, వన్డేల్లో 142 వికెట్లు, 289 రన్స్‌ సాధించాడు గిల్లెస్పీ. స్టార్‌ బౌలర్‌గా గుర్తింపు పొందిన గిల్లెస్పీకి టెస్టుల్లో ఒక డబుల్‌ సెంచరీ ఉండటం విశేషం. నైట్‌వాచ్‌ మెన్‌గా వచ్చి ఏకంగా డబుల్‌ సెంచరీ సాధించిన చరిత్ర సృష్టించిన ఘనత అతనికి ఉంది. అయితే.. పాక్‌ టెస్ట్‌ టీమ్‌ కోచ్‌గా ఎంపికైన గిల్లెస్పీ.. ఆదివారం పాకిస్థాన్‌కు వెళ్లి.. రెడ్‌ బాల్‌ హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించి.. కరాచీ స్టేడియంలో మీడియాతో మాట్లాడాడు. పాకిస్థాన్‌లో అద్భుతమైన టాలెంటెడ్‌ క్రికెటర్లు ఉన్నారని, ఇక్కడ టాలెంట్‌కు కొదవలేదు కానీ, నిలకడలేమి ప్రధాన సమస్యగా తాను భావిస్తున్నాట్లు పేర్కొన్నాడు. పాకిస్థాన్‌ టీమ్‌లో నిలకడం తీసుకొని రావడమే తన టాస్క్‌ అని గిల్లెస్పీ తెలిపాడు. జట్టు కన్సిస్టెన్సీ లేకనే పాకిస్థాన్‌ టీమ్‌ చాలా టోర్నీల్లో విఫలమైందని తాను భావిస్తున్నట్లు వెల్లడించాడు.

మంచి టాలెంటెడ్‌ ప్లేయర్లు ఉన్న పాకిస్థాన్‌ టీమ్‌కు నిలకడ అలవాటు చేస్తే.. నంబర్‌ వన్‌ టీమ్‌ అవుతుందని కొత్త కోచ్‌ గిల్లెస్పీ అన్నాడు. ఆయన చేసిన ఈ కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇతనికి పాకిస్థాన్‌ టీమ్‌ గురించి తెలియక ఇలా మాట్లాడుతున్నాడని.. ఒక రెండు వారాలు పాక్‌ టీమ్‌తో ఉంటే తెలుస్తుందంటూ జోకులు పేలుస్తున్నారు. టీమిండియాను ప్రపంచ ఛాంపియన్‌గా నిలిపిన గ్యారీ క్రిస్టన్‌ లాంటి కోచ్‌కే పాక్‌ ఆటగాళ్లు వినలేదని.. ఇక ఈ కొత్త బకరా గిల్లెస్పీ వల్ల ఏం అవుతుందని విమర్శిస్తున్నారు. ఆట కంటే టీమ్‌లో రాజకీయాలే ఎక్కువ ఉంటే పాక్‌ టీమ్‌ నుంచి గిల్లెస్పీ ఎక్కువ ఆశిస్తున్నాడంటూ క్రికెట్‌ అభిమానులు అంటున్నారు. మరి గిల్లెస్పీ చేసిన కామెంట్లతో పాటు ఆయనపై పేలుతున్న జోకులపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments