iDreamPost
android-app
ios-app

Jamie Smith: చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ ప్లేయర్! 94 ఏళ్ల రికార్డు బద్దలు..

  • Published Aug 24, 2024 | 9:19 AM Updated Updated Aug 24, 2024 | 9:19 AM

శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్ లో ఇంగ్లండ్ యంగ్ ప్లేయర్ జేమీ స్మిత్ సెంచరీతో అదరగొట్టాడు. ఇక ఈ శతకంతో 94 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. ఆ వివరాల్లోకి వెళితే..

శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్ లో ఇంగ్లండ్ యంగ్ ప్లేయర్ జేమీ స్మిత్ సెంచరీతో అదరగొట్టాడు. ఇక ఈ శతకంతో 94 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. ఆ వివరాల్లోకి వెళితే..

Jamie Smith: చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ ప్లేయర్! 94 ఏళ్ల రికార్డు బద్దలు..

ఇంగ్లండ్-శ్రీలంక మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ లో ఇంగ్లండ్ యంగ్ వికెట్ కీపర్ జేమీ స్మిత్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. శ్రీలంక బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ తన కెరీర్ లో తొలి శతకాన్ని నమోదు చేశాడు. ఈ క్రమంలో అతడు ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. దాంతోపాటుగా 94 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. ఆ వివరాల్లోకి వెళితే..

శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్ లో ఇంగ్లండ్ యంగ్ ప్లేయర్ జేమీ స్మిత్ సెంచరీతో అదరగొట్టాడు. మిగతా బ్యాటర్లు విఫలమైనచోట.. అద్భుతమైన  బ్యాటింగ్ తో అలరించాడు. ఈ ఇన్నింగ్స్ లో 148 బంతులు ఎదర్కొని 8 ఫోర్లు, ఓ సిక్స్ తో 111 పరుగులు చేశాడు. స్మిత్ కెరీర్ లో ఇదే తొలి శతకం కావడం విశేషం. ఇక ఈ సెంచరీతో 94 సంవత్సరాల రికార్డును బ్రేక్ చేశాడు స్మిత్. టెస్ట్ క్రికెట్ లో ఇంగ్లండ్ తరఫున సెంచరీ చేసిన యంగెస్ట్ వికెట్ కీపర్ గా ఇతడు నిలిచాడు.

jemi smith england cricketer

కాగా.. జేమీ స్మిత్ 24 సంవత్సరాల 42 రోజుల వయసులో ఈ ఘనత సాధించగా.. ఇంతకు ముందు ఈ రికార్డు ఇంగ్లండ్ మాజీ వికెట్ కీపర్ లెస్ అమెస్ పేరిట ఉండేది. అమెస్ 24 ఏళ్ల 63 రోజుల వయసులో ఈ రికార్డ్ నెలకొల్పాడు. 1930లో వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో అమెస్ ఈ రికార్డు సాధించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. శ్రీలంక తొలి ఇన్నింగ్స్ లో 236 పరుగులకు ఆలౌట్ కాగా.. ఇంగ్లండ్ 358 రన్స్ చేసింది. ప్రస్తుతం శ్రీలంక రెండో ఇన్నింగ్స్ లో 6 వికెట్ల నష్టానికి 204 రన్స్ చేసి 82 పరుగుల ఆధిక్యంలో ఉంది.