Somesekhar
Chris Gayle: క్రిస్ గేల్ మరోసారి రెచ్చిపోయాడు. వయసు పైబడుతున్న కొద్ది తనలో కసి ఇంకా పెరిగినట్లు కనిపిస్తోంది. తాజాగా జరిగిన ఓ మ్యాచ్ లో బౌలర్లపై సిక్సర్ల వర్షం కురిపించాడు.
Chris Gayle: క్రిస్ గేల్ మరోసారి రెచ్చిపోయాడు. వయసు పైబడుతున్న కొద్ది తనలో కసి ఇంకా పెరిగినట్లు కనిపిస్తోంది. తాజాగా జరిగిన ఓ మ్యాచ్ లో బౌలర్లపై సిక్సర్ల వర్షం కురిపించాడు.
Somesekhar
కొంత మందికి ఏజ్ ఒక నంబర్ మాత్రమే. తమ వయసు పెరుగుతున్నప్పటికీ.. ఆటలో ఎలాంటి మార్పు రాదు. పైగా వింటేజ్ కంటే ఎక్కువ స్థాయిలో రెచ్చిపోయి ఆడుతూ ఉంటారు. ప్రస్తుతం అదే పనిలో ఉన్నాడు వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్. క్రికెట్ కు వీడ్కోలు పలికిన తర్వాత లీగ్ మ్యాచ్ ల్లో మరింత రెచ్చిపోయి ఆడుతూ.. తనలో సత్తా ఇంకా తగ్గలేదని నిరూపిస్తూ వస్తున్నాడు. తాజాగా జరుగుతున్న ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ లో తెలంగాణ టైగర్స్ టీమ్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు ఈ సిక్సర్ల కింగ్.
క్రిస్ గేల్.. ఈ పేరు వింటే బౌలర్లకే కాదు.. క్రికెట్ బంతికి కూడా దడే. ఎందుకంటే? అతడి బాదుడు అలా ఉంటది మరి. కొడితే సిక్స్.. లేదంటే ఫోర్. గేల్ డిఫెన్స్ ఆడితే చూడాలని చాలా మంది అనుకుంటారు. కానీ అది వారి అత్యాశే అవుతుంది అంటే అతిశయోక్తికాదు. ఇక ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి విరామం ప్రకటించిన తర్వాత మరింతగా దూకుడుగా ఆడుతున్నాడు గేల్. పలు లీగ్ క్రికెట్ మ్యాచ్ ల్లో ఆకాశమేహద్దుగా చెలరేగిపోతూ.. బౌలర్లకు పీడకలలా మారుతున్నాడు.
ప్రస్తుతం ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ లో తెలంగాణ టైగర్స్ టీమ్ కు కెప్టెన్ గా ఉన్నాడు. ఈ లీగ్ లో తాజాగా వీవీఐపీ ఉత్తరప్రదేశ్ తో జరిగిన మ్యాచ్ లో వింటేజ్ గేల్ ను మరోసారి ప్రేక్షకులకు చూపించాడు. 46 బంతులు ఎదుర్కొని 10 సిక్సర్లు, 3 ఫోర్లతో 94 రన్స్ చేసి, సెంచరీ కొద్ది దూరంలో ఆగిపోయాడు. అయితే ఇక్కడ కొసమెరుపు ఏంటంటే? గేల్ సునామీ ఇన్నింగ్స్ ఆడినప్పటికీ.. తన టీమ్ ను మాత్రం గెలిపించలేకపోయాడు. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తెలంగాణ టైగర్స్ తడబడింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన యూపీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 269 పరుగుల భారీ స్కోర్ చేసింది. పవన్ నేగి విధ్వంసకర శతకంతో చెలరేగాడు. అతడు కేవలం 56 బంతుల్లోనే 16 ఫోర్లు, 8 సిక్సర్లతో 139 పరుగులు చేసి అబ్బురపరిచాడు. అతడికి తోడు అన్షుల్ కపూర్(71), చివర్లో రైనా 13 బంతుల్లో 5 ఫోర్లతో 27 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన తెలంగాణ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 222 పరుగులు మాత్రమే చేయగలిగింది. క్రిస్ గేల్ మినహా మరే ఇతర బ్యాటర్లు పెద్దగా రాణించకపోవడంతో.. కొండంత లక్ష్య ఛేదనని చేరుకోలేకపోయింది. మరి ఈ ఏజ్ లో కూడా గేల్ విధ్వంసంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Chris Gayle masterclass in the IVPL. 🔥pic.twitter.com/v3ggELI13K
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 26, 2024
ఇదికూడా చదవండి: ఇంగ్లండ్ పై సిరీస్ విజయం.. ధృవ్ జురెల్ ఎమోషనల్ పోస్ట్!